Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాల బీచ్ గురించి మీకు తెలుసా ?

దెయ్యాల బీచ్ గురించి మీకు తెలుసా ?

గుజరాత్ లోని సూరత్ కి 21కి.మీ ల దూరంలో వుంది. అదే "డ్యూమాస్ బీచ్". నిజానికి ఎంతో అందమైన బీచ్ ఈ డ్యూమాస్ బీచ్. ఆ బీచ్ లో నడుస్తూ వుంటే మన వెనకే మనకు కనపడకుండా ఫాలో అవుతున్నట్లు వుంటుందట.

By Venkata Karunasri Nalluru

బీచ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది అలల సవ్వడులు, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం కదా. కానీ ఆ బీచ్ కెళ్తే మాత్రం దెయ్యాలు గుసగుసలాడుతాయి. తెలియని ఆందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి మనల్ని మాయం చేసేస్తుంది. అందుకే అదొక మిస్టరీ బీచ్ గా ప్రసిద్ధిచెందింది.

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సూరత్ జిల్లా ఒకటి. జిల్లాలో ముహమ్మద్ బీన్ తుగ్లక్ నిర్మించిన కోట, ఉనై ఉష్ణగుండం, ఉభారత్ మరియు తితల్ వద్ద ఉన్న అందమైన సముద్రతీరాలు, దండి మరియు బార్డోలి గ్రామాలు, దండి యాత్ర మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

తిరుపతి పురాతన చిత్రాలు దృశ్యాలలో ...!తిరుపతి పురాతన చిత్రాలు దృశ్యాలలో ...!

సూరత్‌లో ఉన్న వంసదా వేషనల్ పార్క్‌లో అడవి పందులు, చిరుతలు, పులులు, పాంథర్‌లు ఉన్నాయి.

ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. గుజరాత్‌

1. గుజరాత్‌

గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది నమూనా ప్రకారం నిర్మించిన నగరం. గుజరాత్‌లోని అతి పెద్ద నగరమైన అహమ్మదాబాదు దీనికి దగ్గరలోనే ఉంది.

ఇది కూడా చదవండి: సూరత్ పర్యాటక ప్రదేశాలు !!

pc:Marwada

2. హరప్పా నాగరికత

2. హరప్పా నాగరికత

ప్రస్తుతం 'గుజరాత్' అనబడే ప్రాంతంలో హరప్పా నాగరికత కాలంనాటి అవశేషాలు బయటపడటం వల్ల ఇది పురాతనమైన సంస్కృతికి కేంద్రమనవచ్చును. వ్యాపారానికి అనువైన తీరప్రాంతము ఉన్నందున మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం రాజ్యాలకాలంనుండి ఇది వర్తక కేంద్రముగా విలసిల్లింది.

pc:Marwada

3. డ్యూమాస్ బీచ్

3. డ్యూమాస్ బీచ్

ఈ భయంకర బీచ్ ఎక్కడుందో తెలుసా ? గుజరాత్ లోని సూరత్ కి 21కి.మీ ల దూరంలో వుంది. అదే "డ్యూమాస్ బీచ్". నిజానికి ఎంతో అందమైన బీచ్ ఈ డ్యూమాస్ బీచ్.

ఇది కూడా చదవండి: ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

pc:Rahul Bhadane

4. భయంకరమైన అనుభవాలు

4. భయంకరమైన అనుభవాలు

కానీ అక్కడికి వెళ్లేవారికి మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఎదురౌతాయట. పగలంతా జనంతో కళకళలాడే ఈ బీచ్ సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యం అయిపోతుంది.

ఇది కూడా చదవండి: ఒకే కొండమీద వెయ్యికి పైగా దేవాలయాలు !!

pc:wikimedia.org

5. బీచ్

5. బీచ్

ఆ బీచ్ లో నడుస్తూ వుంటే మన వెనకే మనకు కనపడకుండా ఫాలో అవుతున్నట్లు వుంటుందట. మన చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుందట.

ఇది కూడా చదవండి: డామన్ ... తెలియని ప్రదేశాలు !

pc:wikimedia.org

6. స్థానికులు

6. స్థానికులు

ఎవరో బాధగా అరుస్తున్నట్టు,ఏడుస్తున్నట్టు, మూలుగుతున్నట్టు వినపడుతుందట. రాత్రిళ్ళు అక్కడికెల్తే ఇక తిరిగి రారు అని కూడా చెప్తూవుంటారు స్థానికులు.

ఇది కూడా చదవండి: ఒకే కొండమీద వెయ్యికి పైగా దేవాలయాలు !!

pc:Gagum

7. నాలుగు బీచ్ లు

7. నాలుగు బీచ్ లు

నిజానికి ఇక్కడ నాలుగు బీచ్ లను కలిపి డ్యూమాస్ బీచ్ గా చెప్తారు. అందులో రెండు బీచ్ లు మాత్రం జనంతో కళకళలాడిపోతాయి.

pc:Per Meistrup

8. దెయ్యాల బీచ్

8. దెయ్యాల బీచ్

ఇక మూడో బీచ్ లో కూడా కాస్తో, కూస్తో జనం వుంటారు. ఇంక నాలుగో బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల బీచ్. విచిత్రమేంటంటే ఈ బీచ్ లో ఇసుక కూడా నల్లగా వుంటుందట.

ఇది కూడా చదవండి: గుజరాత్ - ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

pc:Keith Tyler

9. స్మశానం

9. స్మశానం

అసలిక్కడ ఎందుకిలా జరుగుతోంది అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో స్మశానం వుండేదని, అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ ఆత్మలు తిరుగుతూవుంటాయని స్మశానంలో శవాలను కాల్చిన బూడిద కారణంగానే ఇక్కడ ఇసుక కూడా నల్లగా వుంటుందని స్థానికులు చెప్తారు.

ఇది కూడా చదవండి: గిర్నార్ - దేవతల కొండలు !

pc:Rahul Bhadane

10. కథనాలు

10. కథనాలు

ఈ కథనాల్లో నిజమెంతో చూద్దామని రాత్రిపూట ఆ బీచ్ కెళ్ళినవారు ఇక తిరిగిరాని సందర్భాలు కూడా వున్నాయట.

pc:Karansoni11

11. పగటిపూట

11. పగటిపూట

అలాగే పగటిపూట కూడా భయంకరంగా అరుపులు, మూలుగులు వినపడిన సందర్భాలు కూడా వున్నాయి అంటారు స్థానికులు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే చివరకు రాత్రిళ్ళు ఈ బీచ్ కు వెళ్ళటం కూడా నిషేధించారు.

pc:Ray Dumas

12. ముఖ్యమైన పర్యాటక స్థలాలు

12. ముఖ్యమైన పర్యాటక స్థలాలు

పాలిటానా, డయ్యు, కచ్, జామ్‌నగర్, జునాగఢ్, రాజ్‌కోట్

pc:Manfred Werner

ఇది కూడా చదవండి:జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలుశ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X