Search
  • Follow NativePlanet
Share
» »కన్యాకుమారి ప్రక్కనే ఆశ్చర్యకరంగా రంగులు మారే వినాయకుడు !

కన్యాకుమారి ప్రక్కనే ఆశ్చర్యకరంగా రంగులు మారే వినాయకుడు !

కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.ఎక్కువగా శివాలయాలు వున్నాయి. ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం వుంది. ఈ దేవాలయంలో 6నెలలకు ఒక సారి మూలవిరాట్ అయిన వినాయకుడు రంగులు మారటం ఇక్కడ విశేషం.

By Venkatakarunasri

ప్రళయం కూడా ఈ ప్రాంతాన్ని ఏమి చేయలేదట !ప్రళయం కూడా ఈ ప్రాంతాన్ని ఏమి చేయలేదట !

ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

మన భారతదేశంలో వున్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. దేశంలోని కీర్తిపతాకాలు దేశం అంతా వ్యాపించాయి. మన దేశంలో తమిళనాడులో చాలా ఎక్కువగా ఆలయాలు వున్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్ అంటారు. ఇందులో కేరళాపురం గ్రామం కన్యాకుమారికి దగ్గరలో వుంది. ఈ దేవాలయం ఒకప్పుడు ట్రావెన్కో వంశీయుల ఆధీనంలో వుండేది. ఈ ఆలయం క్రీ.శ.1200శతాబ్దం కాలంనాటిది. కాలక్రమేణా తమిళనాడు ఆలయంకు వచ్చింది.

కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.ఎక్కువగా శివాలయాలు వున్నాయి. ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం వుంది. ఈ దేవాలయంలో 6నెలలకు ఒక సారి మూలవిరాట్ అయిన వినాయకుడు రంగులు మారటం ఇక్కడ విశేషం. మార్చి నుండి ఆగస్ట్ వరకు నల్లని రంగులో,ఆగస్ట్ నుండి ఫిబ్రవరి వరకు తెల్లనిరంగులో వినాయకుడు మారుతూవుంటాడు.ఆలయంలోని ప్రాంగణంలో వున్న బావిలోని నీరు కూడా రంగు మారుతుంది.

వినాయకుడు నల్ల రంగులో వున్నప్పుడు నీళ్ళు తెల్లగాను, వినాయకుడు తెల్లగా వున్నప్పుడు నీళ్ళు నల్లగానూ మారతాయి. కేరళాపురం రాజు తీర్థయాత్రలకని వెళ్ళాడు.అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక వినాయకుని విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకువచ్చి రాతిపీఠంపై ప్రతిష్టించాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. రంగులు మారే శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్

1. రంగులు మారే శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్

రంగులు మారే శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్ ఆలయం తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది.

2. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం

2. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం

అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి రంగులు మారడం.

3. మరో విచిత్రం

3. మరో విచిత్రం

అంతేకాక, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచి నీటి బావి వుంది. ఈ బావిలో నీళ్ళు కూడా రంగులు మారతాయి. వినాయకుడు నల్లగా వున్నప్పుడు నీళ్ళు తెల్లగా మారతాయి.

pc: Sshankar s.

4. దక్షిణాయనం

4. దక్షిణాయనం

వినాయకుడు తెల్లగా వున్నప్పుడు ఈ బావిలో నీళ్ళు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆలయంలో వున్న మర్రిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది.

కన్యాకుమారి - ప్రతి పర్యాటకుని డ్రీమ్ డెస్టినేషన్ !

pc:Pradam

శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం

శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం

ఈ ఆలయం క్రీశ.12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సం.లో ఈ ఆలయం నిర్మించారనీ, చరిత్రకారుల అంచనా. నిజానికిది శివాలయం.ఈ ఆలయప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం వుంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించటం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని 'శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అంటారు.

pc:Dinesh Valke

6. 2300 సంవత్సరాల చరిత్ర

6. 2300 సంవత్సరాల చరిత్ర

ఆ కాలంలో ఈ ఆలయాన్ని ఎన్నో సార్లు పునర్నిర్మించటం జరిగింది. ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం'.

దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

pc:Shareef Taliparamba

వినాయకుని మహత్యం

వినాయకుని మహత్యం

ఉత్తరాయణ కాలంలో -మార్చి నుంచి జూన్ వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో - జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో వుంటాడు. ఈ విధంగా రంగులు మారడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం.

వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

pc:Swaminathan

 8. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్

8. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్

ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్' ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది.

pc:Natesh Ramasamy

9. కేరళపురం

9. కేరళపురం

ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాకా, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. ఈ ఆలయానికో చారిత్రక చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం' రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం' వెళ్లడం జరిగింది.

10. మరకత(పచ్చల) గణపతి

10. మరకత(పచ్చల) గణపతి

అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం' అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం' రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.

నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

11. తురుష్కుల దండయాత్ర

11. తురుష్కుల దండయాత్ర

అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు.

12. అతి పురాతరమైన వర్ణచిత్రాలు

12. అతి పురాతరమైన వర్ణచిత్రాలు

ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

ఆగస్టు నెలకే ఉత్తమ ప్రదేశాలు !!

13. కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

13. కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కి. మీ ల దూరంలో ఉన్న తక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

shankar s.

14. రైలు మార్గం :

14. రైలు మార్గం :

కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని, బస్సులలో లేదా టాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.

వాయు మార్గం

దగ్గరలో వున్న ఎయిర్ పోర్ట్ త్రివేండ్రం ఎయిర్ పోర్ట్.

pc: google maps

15. దగ్గరగా ఉన్న ప్రదేశాలు

15. దగ్గరగా ఉన్న ప్రదేశాలు

కన్యాకుమారి లో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు . ఇవి యాత్రికులను, పర్యాటకులను బా గా ఆకర్షిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు గా ఉన్నాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది.ఎలా చేరుకోవాలి ?

రైల్వే స్టేషన్ :

కన్యాకుమారి సమీప రైల్వే స్టేషన్ (47 KM).

విమానాశ్రయం :

తిరువనంతపురం సమీప విమానాశ్రయం (50 KM).

రోడ్డు/ బస్సు మార్గం :

కన్యాకుమారి, నాగర్ కోయిల్ తో పాటు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ. ప్రవేట్ బస్సులు, వాహనాలు తిరుగుతుంటాయి.

తిరువత్తర్ - 108 దివ్య క్షేత్రాలలో ఒకటి !

16. తిరువత్తర్

16. తిరువత్తర్

"ఆలయాల రాష్ట్రం" గా పిలువబడే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తిరువత్తర్ అనే పవిత్ర దివ్య క్షేత్రం కలదు. ఇది హిందువుల 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. కనుక హిందూ యాత్రికులు తప్పక సందర్శించవలసిన క్షేత్రం ఇది.

17. నాగర్ కోయిల్ - నాగరాజ దేవాలయం !

17. నాగర్ కోయిల్ - నాగరాజ దేవాలయం !

అందమైన ప్రకృతి దృశ్యాల వల్ల నాగర్ కోయిల్ భారతదేశంలో ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో కలదు. దీనికి ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు దట్టమైన పశ్చిమ కనుమలు ఉండి, మొదటి సారి ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులను కనువిందు చేస్తుంది. కన్యాకుమారి లోగానీ లేదా దాని చుట్టుపక్కల గానీ దేశ, విదేశీ పర్యాటకులు ఉంటె తప్పక నాగర్ కోయిల్ కు వెళతారు. అక్కడి ప్రకృతి దృశ్యాలను, జలపాతాలను మరియు ఇతర సైట్ సీఇంగ్ ప్రదేశాలను చూసి వారు మంత్రముగ్ధులవుతారు.

విమానం ద్వారా : త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ 80 km ల దూరంలో కలదు.

రైలు ద్వారా : కన్యాకుమారి రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్ల దోరంలో కలదు.

రోడ్డు ద్వారా : త్రివేండ్రం, తిరునల్వేలి, కన్యాకుమారి మరియు సమీప పట్టణాల నుండి నాగర్ కోయిల్ కు బస్సులు నడుస్తాయి.

18. నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

18. నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం 13 కి.మీ. దూరంలో శుచీంద్రం అనే ఊరు కలదు. ఇక్కడ లింగరూపమైన శుచీంద్రుడు త్రిమూర్తి రూపంలో కొలువుదీరి ఉంటాడు. ఇక్కడి లింగం స్వయంభూ గా వెలసినది. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు.

కన్యాకుమారి, త్రివేండ్రం తదితర సమీప పట్టణాల నుండి శుచీంద్రం పట్టణానికి డైరెక్ట్ గా బస్సులు కలవు. బెంగళూరు ,చెన్నై, కోయంబత్తూర్, కొచ్చిన్, కాలికట్ ప్రాంతాల నుండి కన్యాకుమారి కి, తిరువనంతపురానికి బస్సులు నడుస్తుంటాయి.

దక్షిణ భారత దేశపు అగ్రభాగం !

19. వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

19. వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

స్వామి వివేకానందుడు దేశంలోని పుణ్య క్షేత్రాలన్నీ దర్శించాలని, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల జీవన నాడిని తెలుసుకోవాలని కాలినడకన దేశాటన సాగిస్తాడు. అలా చేస్తూ చేస్తూ .. ఆయన కాశీ నుండి కన్యాకుమారి చేరుకుంటాడు. వివేకానందుడు కన్యాకుమారి ఒడ్డుకు చేరుకొని అక్కడ ఉన్న పెద్ద బండరాయి వరకు ఈత కొట్టుకుంటూ చేరుతాడు. ఇప్పడు అదే బండరాయి వివేకానంద రాక్ మెమోరియల్ గా ప్రసిద్ధి కెక్కింది.

కన్యాకుమారి ఒడ్డు నుండి రాక్ మెమోరియల్ చేరుకోవటానికి ఫెర్రీ సౌకర్యం కలదు. గురువారం తప్ప, మిగితా అన్ని దినాలలో రాక్ మెమోరియల్ తెరిచే ఉంచుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X