Search
  • Follow NativePlanet
Share
» »శివుడి తల ఆ గుహని తాకితే సృష్టి నాశనం.. పాతాళ ద్వారం అసలు రహస్యం

శివుడి తల ఆ గుహని తాకితే సృష్టి నాశనం.. పాతాళ ద్వారం అసలు రహస్యం

పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉన్నది. దీనిని శివుడికి అంకితం చేసినా, ఇక్కడ, ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు.

By Venkatakarunasri

పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉన్నది. దీనిని శివుడికి అంకితం చేసినా, ఇక్కడ, ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు.

ఒక సన్నని సొరంగం మార్గం ద్వారా గుహలోకి వెళుతున్నప్పుడు స్టాలగ్మైట్ రాతి నిర్మాణాలు మరియు వివిధ దేవతల చెక్కిన చిత్రాలను చూడవొచ్చు. ఈ ఆలయం గంగోలిహాట్ ఉత్తర-తూర్పు దిశ నుండి 16 కి. మీ. దూరంలో ఉన్నది మరియు ఇక్కడనుండి రాజ్ రంభ,పంచాచులి,నందా దేవి మరియు నందా ఖాట్ పర్వత శిఖరాల సౌందర్యాలను వీక్షించవొచ్చు.

ఈ ప్రాంతంలో మతపరమైన ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంవలన దీనిని పవిత్రమైన చార్ ధామ్ కు సమానంగా దీనిని భావిస్తారు. కొత్త ప్రపంచం కొత్త సృష్టి కొత్తయుగం మొదలవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా వుంది కదూ.హిమాలయాలలోని ఓ గుడిలో ఆ పరమశివుని లింగం ప్రతిసంవత్సరం పెరుగుతోందట. ఈ శివలింగం ఆ గుహ పై భాగాన్ని తాకితే ఆ రోజే చివరిరోజు అవుతుందని మళ్ళీ సత్య యుగం మొదలై కొత్త యుగం, కొత్త సృష్టి వస్తుందని ఈ గుహ స్థానికులు అంటున్నారు. ఇంతకీ ఆ గుహ ఏంటి?ఆ గుహ రహస్యం ఏంటో తెలుసుకుందాం.

ఈ గుహలలోని మహా శివుని దర్శనం ఛార్ ధాం యాత్రతో సమానం - పాతాళ భువనేశ్వర్

గుహ ఎక్కడ వుంది?

గుహ ఎక్కడ వుంది?

భూగర్భ శివుడు, 33 కోట్ల దేవతలు, 90 అడుగుల లోతులో, 163మీ పొడవుతో కొన్ని గుహల సముదాయంగా ఉత్తరఖాండ్ రాష్ట్రంలోని పితోర్ఘర్ జిల్లాలోని గంగోలీ హాట్ కు 14 కి.మీ ల దూరంలో గల భువనేశ్వర్ గ్రామంలో వున్న ఆ ఆలయమే భువనేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కొన్ని గుహల సముదాయం. ఈ గుహనే పాతాళ భువనేశ్వర్ గా పిలుస్తున్నారు.

PC:youtube

ఈ గుహలు ఎలాంటి గుహలు?

ఈ గుహలు ఎలాంటి గుహలు?

ఈ గ్రామానికి 2 కి.మీ ల దూరంలో వుండే ఈ గుహ లోపలికి వెళ్ళటానికి గోడల చుట్టూ వున్న ఇనప సంకెళ్ళను పట్టుకుని క్రిందకు దిగాలి. చాలా ఇరుకుగా ఈ గుహలు వుంటాయి. ఈ గుహలు సున్నపురాతి గుహలు.

PC:youtube

ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గుహలు

ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గుహలు

ఇవి ప్రకృతిసిద్ధంగా నిర్మించబడ్డాయి.పురాణాల గాధల ప్రకారం ఈ భూగర్భగుహలో శివుడు మరియు 33కోట్ల దేవతలు కొలువుతీరివున్నారు. ఈ గుహల గురించి పురాణాల,ఇతిహాసాల ప్రకారం సూర్యవంశానికి చెందిన ఋతువర్ణ మహారాజు గుర్తించాడట. ఆ కధ విషయానికి వస్తే నలమహారాజు అతని భార్య అయిన దమయంతి చేతిలో ఓడిపోయాడు.

PC:youtube

ఋతువర్ణమహారాజు

ఋతువర్ణమహారాజు

తన భార్యచే విధించబడిన కారాగారవాసం నుండి తప్పించుకోవటానికి తనను దాచమని ఋతువర్ణమహారాజు కోరినట్లు ఆయన నలమహారాజుని హిమాలయాలలో గల అరణ్యాలలో వుండమన్నట్లు చెబుతారు.

PC:youtube

ఋతువర్ణమహారాజు

ఋతువర్ణమహారాజు

అదే సమయంలో నలుడు అడవిలో ఒక జింకను చూసి ఆకర్షితుడవుతాడు. దానిని పట్టుకునేందుకు వెళుతూ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకు ఒక కల వచ్చి దానిలో జింక తనను వెతకొద్దని చెప్పినట్లు తను మేల్కొని అక్కడే వున్న ఒక గుహ వద్దకు వెళ్ళగా ఆ గుహ వద్ద వున్న రక్షకభటుడు నలుని గురించి అడిగి లోపలి వెళ్ళటానికి అనుమతి ఇస్తాడు.

PC:youtube

శేషనాగు

శేషనాగు

అనుమతి పొందిన నలమహారాజును గుహకుడిప్రవేశద్వారం వద్ద శేషనాగు తన పడగపై కూర్చోపెట్టుకుని అతనికి లోపల వున్న మహా శివుడు,33 కోట్ల దేవతలు కొలువు తీరి వున్న అద్భుతమైన దృశ్యాన్ని శేష నాగు చూపిస్తుంది.

PC:youtube

కలియుగంలోనే గుర్తించిన గుహలు

కలియుగంలోనే గుర్తించిన గుహలు

అనంతరం ఈ గుహ కొన్ని యుగాలు మూసివేయబడినట్లు ఆ తరువాత మళ్ళీ కలియుగంలోనే గుర్తించినట్లు స్కంద పురాణంలో వుంది. అప్పటినుండి ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి.

PC:youtube

గుప్తమార్గం గుండా కైలాసం

గుప్తమార్గం గుండా కైలాసం

అలాగే త్రేతాయుగంలో పాండవులు మహాభారత యుద్ధానంతరం ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహలలో తపస్సుచేసుకుని ఇక్కడ గల గుప్తమార్గం గుండా కైలాసం వెళ్ళారని చెప్తారు.

PC:youtube

ఛార్ దం యాత్రతో సమానమైన ఈ గుహల దర్శనం

ఛార్ దం యాత్రతో సమానమైన ఈ గుహల దర్శనం

ఈ గుహ నుండి కైలాస పర్వతంనకు అలాగే ఛార్ దంలకు భూగర్భ మార్గం వున్నట్లు చెబుతున్నారు. ఈ గుహలలోని మహా శివుని దర్శనం ఛార్ దం యాత్రతో సమానమని భక్తులు భావిస్తారు.

PC:youtube

రోజు రోజుకీ సైజు పెరుగుటున్న శివలింగం

రోజు రోజుకీ సైజు పెరుగుటున్న శివలింగం

హిమాలయాల్లోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజు రోజుకీ పెరుగుతోందట. అది అలా పెరిగి పెరిగి గుహ పై భాగం (సీలింగ్)ను తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది.

ప్రచారంలో వున్న కధ

ప్రచారంలో వున్న కధ

హిమాలయాల్లోని గుహల్లో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతా యుగంలో సూర్య వంశానికి చెందిన రితుపుర్ణ అనే రాజు గుర్తించాడట. దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది.

PC:youtube

 దమయంతి

దమయంతి

నలుడనే రాజు తన భార్య దమయంతి చేతిలో ఓటమి పాలవగానే రితుపుర్ణ వద్దకు వచ్చి తనను తన భార్య చూడకుండా ఎక్కడైనా దాచి ఉంచాలని అడిగాడట. అప్పుడు రితుపుర్ణ నలుడ్ని హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో దాచి పెడతాడు.

PC:youtube

 చెట్టు కింద విశ్రాంతి

చెట్టు కింద విశ్రాంతి

అనంతరం తిరుగు ప్రయాణంలో అతనికి ఓ లేడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాన్ని తరుముకుంటూ వచ్చిన రితుపుర్ణ అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. ఆ సమయంలో తాను ఒక కల కంటాడు. ఆ కలలో తనను చంపవద్దని వేడుకుంటున్న ఓ లేడిని అతను చూస్తాడు.

PC:youtube

గుహకి కాపలా

గుహకి కాపలా

వెంటనే కల మాయమై అతనికి మెళకువ వస్తుంది. అనంతరం ఆ లేడిని వెతుక్కుంటూ అతను పక్కనే ఉన్న మరో గుహ వద్దకు వస్తాడు. ఆ సమయంలో ఆ గుహను కాపలా కాస్తూ ఓ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు.

PC:youtube

రితుపుర్ణ రాజు

రితుపుర్ణ రాజు

అతని అనుమతితో గుహలోకి వెళ్లిన రితుపుర్ణకు పెద్ద ఆకారంతో ఉన్న ఓ శేష నాగు కనిపిస్తుంది. ఆ పాము అతన్ని గుహలోకి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. అక్కడే రితుపుర్ణ రాజు దేవుళ్లు, దేవతలదరినీ చూస్తాడు. వారిలో శివుడు కూడా అతనికి కనిపిస్తాడు.

PC:youtube

కలియుగం

కలియుగం

ఆ క్రమంలో రితుపుర్ణ ఆ 6 ఇంచుల శివలింగాన్ని చూసి దర్శించుకుంటాడు. అనంతరం ఆ గుహ కొన్ని యుగాల మూసి వేయబడిందట. దీన్ని గురించి స్కంద పురాణంలో కూడా వివరించబడి ఉన్నట్టు పండితులు చెబుతారు. కాగా ఆ గుహ మళ్లీ కలియుగంలోనే గుర్తించబడుతుందని అందులో ఉందట.

PC:youtube

నిత్యం పూజలు, అభిషేకాలు

నిత్యం పూజలు, అభిషేకాలు

అందుకు అనుగుణంగానే కలియుగంలో శంకరాచార్యుడు ఆ గుహను గుర్తించాడట. దీంతో అప్పటి నుంచి ఆ గుహలో ఉన్న శివలింగానికి నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయట.

PC:youtube

90 అడుగుల లోతు

90 అడుగుల లోతు

అయితే అన్ని గుహల్లా ఆ గుహ ఉండదు. దాంట్లోకి వెళ్లాలంటే పై నుంచి కిందకి దాదాపు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా, ఇరుకుగా ఉంటుంది.

PC:youtube

పాతాళ భువనేశ్వర్ గుహ

పాతాళ భువనేశ్వర్ గుహ

గుహ మొత్తం 160 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో మళ్లీ అనేక గుహలు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. కొన్నింటిలో నీటి ప్రవాహం ఉంటుంది. చిట్ట చివరికి ఉండే గుహను పాతాళ భువనేశ్వర్ గుహ అంటారు.

PC:youtube

హిమాలయాల్లోని ఆ గుహ

హిమాలయాల్లోని ఆ గుహ

కాగా ద్వాపర యుగంలో పాండవులు ఓ సందర్భంలో ఈ గుహను గుర్తించారని, అందులో కొంత కాలం నివసించారని కూడా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. హిమాలయాల్లోని ఆ గుహలో ఉన్న 6 ఇంచుల శివలింగం ఏటా పెరిగిపోతోందట.

PC:youtube

సత్యయుగం

సత్యయుగం

ఈ క్రమంలో అది గుహ పైభాగాన్ని తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందని, అప్పుడు అంత సర్వ నాశనమవుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. సృష్టి నాశనం అనంతరం మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు. అప్పుడు మళ్లీ సృష్టి క్రమం మొదలవుతుందట. కొత్త ప్రపంచం సృష్టించబడుతుందట.

PC:youtube

భూమి ప్రారంభం నుంచి వున్న గుహలు

భూమి ప్రారంభం నుంచి వున్న గుహలు

కొంతమందైతే ఈ గుహ భూమి ప్రారంభం నుంచి ఉందని చెబుతుండడం విశేషం. ఈ గుహ చుట్టూ ఉన్న మరికొన్ని గుహల్లో అత్యంత పురాతనమైన మహాకాళి ఆలయం, చాముండేశ్వరి ఆలయాలు ఉన్నాయని తెలిసింది.

PC:youtube

శివలింగానికి పూజలు

శివలింగానికి పూజలు

1191 వ సంవత్సరం నుంచి ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. గుహలో ఉన్న రాళ్లు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలను పోలి ఉంటాయట. ఈ గుహను చేరుకోవాలంటే అర కిలోమీటర్ ముందే వాహనంలో ఆగాల్సి ఉంటుంది.

PC:youtube

వర్ణించలేని అనుభూతి

వర్ణించలేని అనుభూతి

అక్కడి నుంచి కాలి నడకనే గుహ ముఖ ద్వారంకు చేరాలి. అనంతరం ద్వారం నుంచి కిందకి దిగి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో కలిగే అనుభూతి వర్ణించరానిదని, గుహ లోపలికి పూర్తిగా చేరుకున్నాక ఆ అనుభూతి ఇంకా ఎక్కువ అవుతుందని పలువురు చెబుతున్నారు.

PC:youtube

ఇక్కడ సమీప ప్రదేశాలను కూడా చూడవచ్చును.

ఇక్కడ సమీప ప్రదేశాలను కూడా చూడవచ్చును.

కౌసని, ధార్చుల, అల్మోర, రాణిఖెట్, జగేశ్వర్, చంపావత్, భీమ్టాల్, రాం ఘర్, ముక్తేశ్వర్, జియోల్కొట్, సత్తాల్, రుద్ర ప్రయాగ, జోషిమత్, నైనిటాల్, కోత్గోడం

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి పాతాళ భువనేశ్వర్ కు 34 గంటల సమయం పడుతుంది. మీరు న్యూఢిల్లీ మార్గంలో వెళ్ళినట్లయితే 42గంటలు పడుతుంది.

PC:gooogle maps

మ్యాప్ రూట్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X