Search
  • Follow NativePlanet
Share
» »పర్యావరణ పర్యటనలు - పర్యటన భాద్యతలు!

పర్యావరణ పర్యటనలు - పర్యటన భాద్యతలు!

పర్యావరణ పర్యటన చేసేవారికి ప్రకృతి ప్రాధాన్యం. పర్యావరణ పర్యటనలో, వ్యక్తి గత ట్రావెల్ లో మంచి అవగాహన, పర్యావరణం పట్ల శ్రద్ధ కలిగి వుండాలి. ఒక మంచి పర్యావరణ పర్యాటకుడు కావాలంటే, టూర్ చేసేటపుడు ఏమి చేయాలి ? ఏమి చేయ కూడదు ? అనేది తెలుసుకుని వుండాలి. అయితే, ఎన్నో కల్పితాలు, భ్రమలు పర్యావరణం గురించి తప్పుడు అభిప్రాయాలు కల్పించటంతో ఇండియాలో పర్యావరణ పర్యటన అభివృద్ధి చెందటం లేదు. వాటిని తొలగించటమే మా ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం.

పర్యావరణ పర్యటన అనేది గొప్ప వారికి మాత్రమే! ఇది ఒక భ్రమ. పర్యావరణ పర్యటన సాధారణ టూరిస్ట్ కు కూడా వర్తిస్తుంది. మరి కొందరు, ఈ పర్యావరణ పర్యటన అనేది విదేశీ టూరిస్ట్ లకు మాత్రమే అనుకుంటారు. ఇది కూడా ఒక కల్పితమే. ప్రదేశాలకు స్వదేసీయులైనా విదేశీయులు అయినా ఒకటే. పర్యావరణ పర్యటన ఖర్చుతో కూడుకొన్నది అను కుంటారు. కాని సరి కాదు. మనం టూర్ చేసే ప్రదేశాల పట్ల అవగాహన కలిగి వాటిని సంరక్షిన్చటమే. ఇక్కడ మన ఉద్దేశ్యం అసలు సిసలైన, నాగరికతలు కలిగి ఆయా ప్రదేశాల సమతుల్యతలను సంరక్షించడమే.

పర్యటనలో ఆయా ప్రదేశాలలోని స్థానికులను కలవటం, అక్కడి ఆచార వ్యవహారాలు పాటించటం మీ ట్రావెల్ అనుభవాలను ఎల్లపుడూ పెంచుతుంది. ప్రస్తుతం ఇండియాలో పర్యావరణ పర్యటన కొద్దిపాటి వ్యయంతో కూడుకొన్నది అయినప్పటికీ, భవిష్యతులో అది తగ్గ గలదు. పర్యావరణ పర్యటన సుఖంగా వుండదు అనుకుంటారు, లక్సరీ హోటల్స్ వుండవు అని అంటారు. మీరు ఈ విషయంలో కొంత రాజీ పడి ప్రకృతి సంరక్షణకు తోడ్పడాలిసిందే. ఆ ప్రదేశాలలో కల కాటేజ్ లు వంటివి ఉపయోగించాల్సిందే. పర్యావరణ పర్యటన లో ముఖ్య ఉద్దేశ్యం ఒక పచ్చని ప్రదేశ వాతావరణం సంరక్షించటమే. అలాగని మీరు మీ వెకేషన్ అంతా చెట్లు నాటాల్సిన అవసరం లేదు.

పర్యావరణ పర్యటనలు - పర్యటన భాద్యతలు!

మరి మీ వంతు చర్యగా ఏమి చేయాలి ? ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర వ్యర్ధాలను మీరు వెళ్ళిన ప్రదేశంలో పారవేయకండి. మొక్కలను అక్కడ తొలగించి మీతో తెచ్చుకోకండి. ప్రత్యేకించి పెద్దలు ఈ అంశంలో చిన్నవారికి ఆదర్శంగా వుండాలి. మీరు చూపే ఈ కొద్దిపాటి శ్రద్ధ, భవిష్యత్ తరాలకు మీరు ప్రకృతి సంపదలను అందించినట్లు అవుతుంది కూడాను. వాస్తవానికి పిల్లలే, ఆహ్లాదకర వాతావరణంలో అమితంగా ఆనందించ గలరు. ప్రకృతి సంరక్షణ మీ పూర్తి విశ్రాంతికి దోహదం చేస్తుందనేది గ్రహించండి. ప్రకృతి ఎంత చక్కగా వుంటే అంత ఆనందం. అంతే కాదు, మీ జీవితాలకు పునరుజ్జీవం మరియు, ఎప్పటికపుడు తాజా అనుభూతులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X