Search
  • Follow NativePlanet
Share
» »ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం

ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం

కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలో వున్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా వున్న సంతిబన్నూర్ ప్రాంతానికి సమీపంలో నాగినహళ్లి అనే ఒక గ్రామం వుంది. దేవనాగరి పట్టణానికి సరిగ్గా 50మీ దూరంలో ఈ పట్టణం వుంది

By Venkata Karunasri Nalluru

కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలో వున్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా వున్న సంతిబన్నూర్ ప్రాంతానికి సమీపంలో నాగినహళ్లి అనే ఒక గ్రామం వుంది. దేవనాగరి పట్టణానికి సరిగ్గా 50మీ దూరంలో ఈ పట్టణం వుంది. సర్పాల యొక్క మహత్యం కారణంగా ఈ గ్రామం చాలా కాలంగా వార్తల్లోకొస్తుంది. ఈ గ్రామంలో వున్న విశేషం ఏమిటంటే ఈ గ్రామంలో వున్న వారు గానీ,ఈ గ్రామానికి వచ్చిన వారు గానీ ఏవిధమైన సర్పకాటుకి గురికావటం లేదు.ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ త్రాచుపాములు సంచరిస్తూ వుంటాయి.

మురుడేశ్వర్ శివ ... విశిష్ట దైవత్వం !మురుడేశ్వర్ శివ ... విశిష్ట దైవత్వం !

అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవ్వరూ త్రాచుపాములను చూసి ఎంతమాత్రం భయపడరు. అసలు నాగినహళ్లి అంటేనే త్రాచుపాముల గ్రామం అని అర్ధం. త్రాచుపాములు మానవులతో కలిసి సహజీవనం చేస్తూ ద్రిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయ్. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు చాలాసార్లు కొన్నికారణాల వల్ల సర్పాల వల్ల కాటుకు గురైన వాళ్లకు ఏమీ కాలేదు. సర్పం చేత కరవబడ్డ వారు ఆ గ్రామంలో ఉన్నంతవరకు వాళ్లకు ఏమీ కాదు.

కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!

ఈ కారణం చేతనైనా పాముకాటుకు గురైనవారు ఆ వూరు పొలిమేరల్ని దాటి మరుక్షణం చచ్చి క్రింద పడిపోతారు. అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నంతవరకు వాళ్ళ మీద ఆ పాము విషం పనిచేయదన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన సర్పశాస్త్రఘ్నులకు కూడా అర్ధం కాలేదు. ఆ క్రమంలో ఎవరైనా ఒక సర్పం కరిస్తే వాళ్ళు ఆ సర్పాన్ని తీసికెళ్ళి ఆ వూరి స్మశానంలో వున్న యతీశ్వరస్వామి మంటపం దగ్గర వుంచుతారు. ఆ గ్రామంలో సర్పాల చేత కరవబడ్డవారు మొదట దగ్గరలో వున్న హనుమాన్ ఆలయానికి వెళతారు.

ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఆంజనేయస్వామి భక్తుడు

1. ఆంజనేయస్వామి భక్తుడు

అక్కడ స్వామివారి తీర్థాన్ని తీసుకుని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలోనే వుండిపోటారు. అంతే ఎక్కినా త్రాచుపాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్ళు క్షేమంగా భయటపడతారు. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వరస్వామి అనే సాధువు, ఆంజనేయస్వామి భక్తుడిగా వుండేవాడట. ఆయన ప్రతీరోజు ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకొని ఆ పై హనుమాన్ గుడి పరిసరాలలో విశ్రాంతి తీసుకునేవాడట. ఒక రోజు ఆయన ఇంటింటికి వెళ్లి బిచ్చం ఎత్తుకుంటుండగా పొదల మధ్యలో పడివున్న ఒక శిశువు కనిపించింది.

హంపి దేవాలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు !

PC:youtube

2. మగబిడ్డ

2. మగబిడ్డ

అది ఒక మగబిడ్డ అనాధిగా పడివున్న ఆ బిడ్డను చూసి ఆ సాధువు హృదయం కరిగిపోయింది. ఫలితంగా ఆయన ఆ బిడ్డను తనతో పాటుగా తీసుకువెళ్ళి పెంచటం ప్రారంభించాడు. కాలచక్రంలో 12సం.లు గడిచిపోయాయ్. ఆ మగబిడ్డకు 12ఏళ్ళు నిండాయి. ఒకరోజున ఆయన ఆ పిల్లవాడిని గుడివద్ద వుంచి బిచ్చమెత్తుకోవడానికి ఊరిలోకెళ్ళాడు.మధ్యాహ్నానికి బిచ్చం తీసుకుని గుడి దగ్గరకొచ్చిన సాధువుకి పాముకాటుకి గురై చనిపోయివున్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు.

ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లివిరిసే అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం

PC:youtube

3. సాధువు

3. సాధువు

తన పెంపుడు బిడ్డకు అకాలమృత్యువు కలిపించిన ఆ సర్పం పైన ఆ సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది. అమోఘమైన తపఃశ్శక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించే నాగారాజుని శపించటానికి ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్నుమూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళలోకం నుండి ఆ సాధువున్న ప్రాంతానికి వచ్చి శపించబోతున్న ఆ సాధువు కాళ్ళమీద పడి జాతి పాము చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు.

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో సమ్మర్ థ్రిల్ రైడ్స్ !

PC:youtube

4. సాధువు శాంతించి

4. సాధువు శాంతించి

అంతేగాకుండా సర్పం కాటుకి గురై చనిపోయిన బాలుని వెంటనే బ్రతికించాడు. అప్పుడు ఆ సాధువు శాంతించి నాగరాజుతో ఇలా అన్నాడు. ఇకపై ఈ గ్రామంలో నివశించేవారిని, ఉన్నవారిని ఏ సర్పమైతే కరిచినట్లయితేకరవబడ్డవారు ఈ గ్రామం దాటనంతవరకు వారిలో వున్న పాము విషం శక్తిహీనమౌతుంది.

PC:youtube

5. నాగినహళ్లి గ్రామం

5. నాగినహళ్లి గ్రామం

అందువలన వారు చావరు. ఏ కారణంగానైనా పాము కాటుకు గురైనవాళ్ళు ఈ గ్రామం పొలిమేరులు దాటినా మరుక్షణం చనిపోతారు. నాగరాజు సాధువు చెప్పిన షరతుకు అంగీకరించాడు. ఆ తరువాత ఆ సాధువు ఆ గ్రామానికి 4సరిహద్దులలో నాలుగు బండరాళ్ళను నాటి వాటిపై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడు. ఈ నాలుగు రాళ్ళ సరిహద్దుల లోపల వుండే నాగినహళ్లి గ్రామంలో ఉన్నంతవరకు సర్పం చేత కరవబడ్డ ఏ వ్యక్తీ ప్రాణహాని వుండదు. సర్పం కరచిన వ్యక్తి వెంటనే గ్రామ పొలిమేరలు దాటిపోయినట్టయితే వారికి మరణం తప్పదు.

PC:youtube

6. యతీశ్వరస్వామి

6. యతీశ్వరస్వామి

ఈ నాటికీ ఆనాడు యతీశ్వరస్వామి చేత భూమిలో స్థాపించబడ్డ నాలుగు సరిహద్దు బండరాళ్ళు యధాతధంగా నిలిచే వున్నాయ్. అయితే ఆ యతీశ్వరస్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలియటంలేదు. ఈ గ్రామంలోని ప్రజలు మాంసాహారం తినకూడదని, సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని ఆ సాధువు ఏర్పాటుచేశాడు.

PC:youtube

7. సాధువు

7. సాధువు

తెలిసికానీ తెలియకకానీ ఈ గ్రామంలోని వారు ఏదైనా సర్పాలను చంపినట్లయితే తీవ్ర ఫలితాలను ఎదుర్కోవలసి వుంటుందని ఆ సాధువు తెలియజేసాడు. ఆ సాధువు కదా తరతరాలుగా ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి అందుతూవుంది. ఆ గ్రామంలో దాదాపు 70ఇళ్లుంటాయ్. ఆ గ్రామంలోని ఇళ్ళవెంట తోటల్లోనూ,పోదల్లోనూ భారీ పరిమాణంలో వుండే త్రాచుపాములు నిరాటంకంగా సంచారిస్తూవున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతూ వుంటారు ఆ నాగినహళ్లి గ్రామస్థులు.

భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X