Search
  • Follow NativePlanet
Share
» »నమ్దఫా టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్ !!

నమ్దఫా టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్ !!

వన్యప్రాణి ఔత్సాహికుల కోసం ఎంతో ఉత్తమమైనది. ఇది సవాలే కాక ఉత్తేజకరమైనది కూడా, ఎందుకంటే వృక్ష, జంతుజాలాలు అసంఖ్యాకమైన జాతులు కనుగొనడానికి వేచి ఉన్నాయి.

By Mohammad

నమ్దఫా నేషనల్ పార్క్ తూర్పు హిమాలయాల యొక్క బయోడైవర్సిటీ హాట్ స్పాట్. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద రక్షణ ప్రాంతం మరియు భారతదేశంలో మూడవ అతిపెద్ద నేషనల్ పార్క్ ఇది. దట్టమైన సతతహరితారణ్యాలు ఈ నేషనల్ పార్కులో రాజ్యమేలుతున్నాయి. మిష్మి కొండలు, పట్కాయి శ్రేణులలో భాగమైన దఫా బం శ్రేణి, నమ్దఫా చుట్టూ ఉంది. ఇది మియో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

భారతదేశంలోని 15 వ టైగర్ రిజర్వు పార్కు అయిన నమ్దఫా 1985 చ.కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ అడవి గుండా ప్రవహించే నోవా-దిహింగ్ నదిలో జలచర జాతులు ఉన్నాయి. నమ్దఫా నది కూడా ఈ పార్కు గుండా ప్రవహించడం వలననే పార్కు కు అనే పేరు వచ్చింది.

వన్యప్రాణి ఔత్సాహికుల కోసం ఎంతో ఉత్తమమైనది. ఇది సవాలే కాక ఉత్తేజకరమైనది కూడా, ఎందుకంటే వృక్ష, జంతుజాలాలు అసంఖ్యాకమైన జాతులు కనుగొనడానికి వేచి ఉన్నాయి. సాధారణ మిథున్, ఏనుగు, దున్న, సాంబార్, హిమాలయముల నల్ల ఎలుగుబంటి, టాకిన్, సాధారణ పాట్కోయి రకానికి చెందిన అడవి మేక, కస్తూరి జింక, నెమ్మది లోరిస్, బింతురాంగ్, ఎర్ర పాండా ఈ ప్రాంతంలో కనబడే కొన్ని జంతువులు. రకరకాల సీతాకోకచిలుకలు ఈ అడవి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

నమ్దఫా టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్

నమ్దఫా నేషనల్ పార్క్ ఏరియల్ వ్యూ

చిత్రకృప : Yogeshw

పులి, చిరుతపులి, మంచు చిరుత, మబ్బు చిరుత అనే నాలుగు చిరుతల రకాలు కేవలం నమ్దఫాలో అతి ఎత్తైన ప్రాంతాలలో కనబడతాయి. మంచు చిరుతలు ప్రస్తుత కాలంలో అతి అరుదైన జాతి. తెలుపు రెక్కల వడ్రంగిబాతు కూడా ఈ పార్కులో కనబడే అటువంటి అరుదైన పక్షి. అస్సామీ మెకాక్, పంది తోక మెకాక్, హూలాక్ గిబ్బన్, హార్న్బిల్స్, అడవి కోడి వంటి ఇతర జాతులు పార్కు అంతటా కనిపిస్తాయి. సాహసప్రియులు ఈ అడవిలో నివాసముండే పాములపట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది.

రకరకాల మొక్కలు కూడా ఇక్కడ కనబడతాయి. వానిలో కొన్ని 150 కలప జాతులు, మిష్మి తీట వంటి కొన్ని అరుదైన వనమూలికా మొక్కలు. లో వృక్ష సంపద ఎత్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఒక రకానికి చెందిన వెదురుతో బాటుగా ఎత్తైన అడవులలో వెడల్పాటి ఆకుల చెట్లు ఇక్కడి కొన్ని రకాల వృక్షసంపద. గతంలో 425 పక్షి జాతుల అతి ఎత్తైన ప్రాంతాలలో ఎగురుతూ కనబడేవి.

నమ్దఫా టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్

చిత్రకృప : Prashanthns

కొన్ని గిరిజన తెగలు పార్కులో, ముఖ్యంగా భారతదేశ౦ భూభాగం తన సరిహద్దును మయాన్మార్ తో పంచుకొనే తూర్పు భాగంలో నివాసముంటాయి. చక్మ, తంగ్స, సింగ్ఫో తెగలు పార్కు చుట్టూ ఉన్న ప్రాంతాలలో కనబడతాయి.

మియో మ్యూజియం

మియో మ్యూజియంలో వివిధ జంతువుల నమూనాలను సేకరించి ప్రదర్శిస్తుంటారు. ఈ మ్యూజియం ను నందఫా అథారిటీ సిబ్భంది పర్యవేక్షిస్తుంది. పర్యాటకులు మ్యూజియంలో వివిధ రకాల పాము నమూనాలను, కప్ప నమూనాలను, పక్షుల చర్మాలను, ఏనుగు దంతాలను ఇలా ఎన్నో చూడవచ్చు.

మ్యూజియం లో ప్రధాన ఆకర్షణ గోడకు పెట్టిన పైథాన్ అవశేషం. మ్యూజియంలో మరో గ్యాలరీ కూడా ఉంది. అందులో స్థానిక ప్రజల దుస్తులను, ఆభరణాలను, సంస్కృతిని చూడవచ్చు.

దేబన్ లో పక్షుల విహంగాలను, అనామిక జలపాతాలను చూడవచ్చు. సీజన్ లో ఇక్కడికి విదేశాల నుండి పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. వర్షాకాలం లో జలపాతం సందర్శకులను కనువిందు చేస్తుంది.

నమ్దఫా టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్

చిత్రకృప : AshLin

నమ్దఫా నేషనల్ పార్క్ సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

ఎంపాంగ్ బుద్దిస్ట్ టెంపుల్, బుద్ధిష్ట్ పగోడా, పరుశురాం కుండ్ టెంపుల్, దగ్రేబాబా టెంపుల్, బొటానికల్ గార్డెన్, లార్డ్ శివ మరియు శ్రీకృష్ణ దేవాలయం, బాపిస్ట్ చర్చి, హనుమాన్ దేవాలయం, రామ్ మందిర్, కోవిన్ బుద్దిస్ట్ టెంపుల్, చిల్డ్రన్స్ పార్క్, క్యాథలిక్ చర్చి మొదలగునవి.

నమ్దఫా నేషనల్ పార్క్ చేరడం ఎలా ??

నమ్దఫా నేషనల్ పార్క్ ప్రధానంగా రోడ్డుమార్గాల ద్వారా కలపబడింది. రైలు, రోడ్డు మార్గాల కోసం పర్యాటకులు అస్సాం చేరి అప్పుడు మియోకు ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ప్రదేశానికి తీన్ సుకియ రైలు స్టేషన్ సమీపం. ఇది దేబాన్ నుండి 141 కి. మీ. ల దూరం లో కలదు. మోహన్ బారి ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. ఇది 182 కి. మీ. ల దూరం లో కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X