Search
  • Follow NativePlanet
Share
» »నంజన్ గుడ్ నంజున్దేస్వరుడు !!

నంజన్ గుడ్ నంజున్దేస్వరుడు !!

కర్నాటక రాష్ట్రంలో మైసూరు జిల్లా కర్నాటకకు సాంస్కృతిక రాజధాని గా చెప్పబడుతుంది. ఈ జిల్లాలో కొన్ని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాలు కూడా కలవు. వాటిలో నంజన్ గుడ్ లోని నంజున్దేశ్వర దేవాలయం ఒకటి. ఈ పుణ్య క్షేత్రాన్ని భక్తులు దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు.

ఈ దేవాలయ ప్రధాన దైవం శ్రీ కన్టేశ్వరుడు నంజన్ గుడ్ , బెంగుళూరు నుండి 163 కి. మీ. ల దూరంలో కలదు. మైసూరు నుండి కేవలం 30 కి. మీ. ల దూరం మాత్రమే. నంజన్ గుడ్ పట్టణానికి రైలు కూడా కలదు. అనేక ప్రభుత్వ బస్సు లో బెంగుళూరు లేదా మైసూరు పట్టణాల నుండి నడుస్తాయి.

హర హర...శంభో!

హర హర...శంభో!

కన్నడ భాషలో నంజు అంటే విషం అని అర్ధం. పురాణాల మేరకు దేవతలు, రాక్షసులు సముద్ర మధనం చేయగా అందులోనుండి విషం వచ్చినదని, దానిని లోక కళ్యాణార్ధం శివుడు మింగగా ఆయన గొంతు ఆ విషానికి మంది నీలం రంగులోకి మారిపోయిందని, అప్పటి నుండి శివుడు ఈ ప్రదేశంలో నీల కంటుడు లేదా శ్రీ కంటుడు గా ఇక్కడ పిలువబడుతూ పూజలు అందుకున్తున్నాడని చరిత్ర చెపుతుంది.
చిత్ర కృప : Dineshkannambadi

హర హర...శంభో!

హర హర...శంభో!

నంజున్దేశ్వర దేవాలయం అతి పురాతనమైనది. సంవత్సరంలో రెండు సార్లు జాతరలు జరుగుతాయి. వాటిలో ఒకటి పెద్ద జాతర కాగా రెండవది చిన్న జాతర. ఈ జాతరలకు వేలాది భక్తులు వస్తారు.

చిత్ర కృప : Dineshkannambadi

హర హర...శంభో!

హర హర...శంభో!

నంజున్దేశ్వర దేవాలయంలో జరిగే ఉత్సవాలలో ప్రధానంగా శివ, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య, మరియు చందికేస్వర విగ్రహాలు అయిదు ప్రత్యేక రధాలలో వుంఛి పట్టణ వీధులలో ఊరేగిస్తారు.
చిత్ర కృప : Sharanabasaveshwar

హర హర...శంభో!

హర హర...శంభో!

నంజున్దేస్వర
నంజన్ గుడ్ ఒక పుణ్య క్షేత్రం అవటం వలన అనేక ప్రత్యేకతలు కలిగి వుంది. ఈ అంశాలు ముందు పొందు పరచిన వివిధ స్లయిడ్ లలో చూడండి. నంజన్ గుడ్ ఇక్కడ కల అరటి పండ్లకు ప్రసిద్ధి.

చిత్ర కృప : Sarvagnya

హర హర...శంభో!

హర హర...శంభో!

సముద్ర మధనంలో వచ్చిన విషం శివుడు మింగిన తర్వాత, లక్ష్మి దేవి ఆవిర్భవించినది. ఆమె శ్రీ మహా విష్ణువుతో వివాహం కోరినది. అయితే, తండ్రి ఆదేశానుసారం నంజన్ గుడ్ చేరి శివుడి కొరకు తపస్సు చేయగా , ఆయన అనుగ్రహించి లక్ష్మి - విష్ణువుల కల్యాణం జరిపించాడు.

చిత్ర కృప : Nayvik

హర హర...శంభో!

హర హర...శంభో!

మరొక కధనం మేరకు, కేశి అనే రాక్షసుడు ఇక్కడ భయంకర వాతావరణం సృష్టించాడు. శివుడు ఆ రాక్షసుడిని వధించి యజ్ఞ కుండంలో పడవేసి ఆ బూడిద ను తింటాడు. ఈ కారణంగా వివిధ అనారోగ్యాలు కల భక్తులు సైతం ఇక్కడకు వచ్చి తమ వ్యాధులకు ఆ బూడిదతో ఉపశమనం పొందుతారు. చిత్ర కృప : Pavithrah

హర హర...శంభో!

హర హర...శంభో!

నంజన్ గుడ్ పరశురామ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందినది. తండ్రి ఆదేశానుసారం తల్లిని వధించిన పరశురాముడు ఈ ప్రదేశంలో కల కపిల మరియు కౌండిన్య నదుల సంగమంలో తపస్సు చేసి పాప విముక్తి చేసుకున్నాడు. శివుడు పరశురాముడి తపస్సుకు మెచ్చి తన క్రుపను చూపి ఆదరిస్తాడు. భక్తులు కనుక పరశురామ క్షేత్రం కూడా ఇక్కడ సందర్శిస్తారు.
చిత్ర కృప : Pavithrah

హర హర...శంభో!

హర హర...శంభో!

మరొక కధనం మ్సేరకు, మ్య్సోర్సే స్రసాజు టిప్పు సుల్తాన్ తనకు అత్యంత ప్రియమైన ఒక ఏనుగు కు దృష్టి పోగా, ఆ ఏనుగును ఆస్థాన పండితుల సలహా మేరకు నంజున్దేశ్వర దేవాలయానికి పంపి అక్కడి కొలనులో స్నానం చేయిస్తాడు. ఈ విధంగా 48 రోజుల పాటు చేసిన ఏనుగుకు చక్కని దృష్టి ఏర్పడి స్వస్థత చేకూరుతుంది. కనుక అప్పటి నుండి ఇక్కడి శివుడిని ఆయన హకీమ్ నంజున్దేశ్వరుడిగా కొలిచాడు. దేవాలయానికి అనేక కానుకలు సమర్పించాడు. హకీమ్ అంటే వైద్యుడు అని అర్ధం కనుక ఈ శివుడిని వైద్య నంజున్దేశ్వర అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : Sekhar gunturu

హర హర...శంభో!

హర హర...శంభో!

నంజన్ గుడ్ లో మరొక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ గురు రాఘవేంద్ర మఠం

చిత్ర కృప : Raod07

హర హర...శంభో!

హర హర...శంభో!

అత్యంత పురాతన మైన కపిలా నది పై కట్టిన నంజన్ గుడ్ వంతెన. ఇది ఒక రాష్ట్రీయ చిహ్నంగా పేరు పడింది.
చిత్ర కృప : Suraj T S

మైసూరు ఇతర ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

మైసూరు హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X