అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఉగ్రనరసింహస్వామి దేవుడికి ముస్లింలు అభిషేకం ఎక్కడ చేస్తారో తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Wednesday, June 28, 2017, 11:44 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

ఖమ్మం నగరానికి 20కి.మీ దూరంలో ఉన్న అష్ణగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నాననీ, తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్యనైవేద్యాలూ పూజలూ చేయమని ఆదేశించాడట. దీంతో ఆమె వూరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వెదకగా నరసింహుడి గుహ కనపడింది. ఆనందాశ్చర్యాలకు గురైన వూరి భక్తులు స్వామి కైంకర్యాలకోసం అష్ణగుర్తిలో కొంత ప్రాంతాన్ని ఇచ్చారు.

అంతేగాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకులను వెదికి తెచ్చి వారినే వంశపారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు. 16వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని ఖిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకొని ముఖమండప నిర్మాణం, రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయించాడట. 32 అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని 32 స్తంభాలతో ముఖమండపం, 32 అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఏర్పాటుచేయించడం విశేషం. అప్పటి సామంతరాజులు వేమారెడ్డి, లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆధారాలున్నాయి.

ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఉగ్రనారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ వూరిలోనేనట !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. నారసింహుడు

ఇక్కడి నారసింహుడు యుగయుగాల దేవుడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.

PC: youtube

 

2. నారసింహావతారం

రామావతారానికి ముందు అవతారమైన నారసింహావతారం కృతయుగానికి చెందినదైతే, హిరణ్యకశిపుడ్ని చీల్చిన తర్వాత స్వామి ఆ చోటే కొలువుతీరిన ప్రశస్తి ఉండటంతో తర్వాతి యుగంలో భరద్వాజ మహర్షి ఆయన కొలువైన ఈ గుహనే ఆశ్రమంగా చేసుకున్నారట.

PC: youtube

 

3. సెలయేరు

తన పరివారంతో కలిసి ఇక్కడ ఉండటమే కాదు ఇక్కడికి దగ్గరలోని ఒక సెలయేరులో స్నానాదికాలు చేస్తుండేవారట.

PC: youtube

 

4. మున్నేరు

అంతమంది మునులు రోజూ స్నానాలు చేసే ఏరు కనుక ఖమ్మం పక్కగా ప్రవహించే ఏరుకు ‘మున్నేరు'గా పేరొచ్చిందట.

PC: youtube

 

5. ఉగ్రనారసింహమూర్తి

ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఉగ్రనారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ వూరిలోనేనట.

PC: youtube

 

6. పానకం

అందుకే ఈ వూరిని స్తంభాద్రి అని పిలుస్తారు. పానకప్రియుడికి ఇక్కడ పానకంతోనే అభిషేకం చేయడం మరో విశేషం.

PC: youtube

 

7. కొండగుహ

ఖమ్మం నగరంలో కొండగుహలో కొలువైన ఈ నారసింహుడి దర్శనమే భయనాశకం.

PC: youtube

 

8. హరి నామం

హరి నామాన్ని జపించినందుకే కన్న కొడుకును నానా కష్టాలూ పెట్టిన హిరణ్యకశిపుడ్ని సంహరించేందుకు, అతని మాట ప్రకారమే స్తంభం నుంచి ఉద్భవించి భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టిన భక్తవరదుడు నారసింహుడు.

PC: youtube

 

9. స్తంభాద్రి గుట్ట

ఆయన రాక్షస సంహారానంతరం తన అవతారాన్ని చాలించి భక్తుల కోసం కొలువయిన క్షేత్రం ఖమ్మం నగరంలోని స్తంభాద్రి గుట్ట.

PC: youtube

 

10. భక్తుల నమ్మకం.

వివాహం, సంతానం, దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా... లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం అని వేడుకున్న వారిని ఒడ్డున పడేయడమే ఈయన తీరన్నది భక్తుల నమ్మకం.

PC: youtube

 

11. మహాముని లక్ష్మీనరసింహ స్వామి

భరద్వాజుడి ముని పరివారంలో ఒకరైన మౌద్గల మహాముని లక్ష్మీనరసింహ స్వామి కోసం తీవ్రంగా తపస్సు చేశాడట.

PC: youtube

 

12. లక్ష్మీ సమేతం

అప్పుడు నారసింహుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడట.

PC: youtube

 

13. నారసింహ క్షేత్రం

తర్వాత ద్వాపర యుగంలోనూ ఈచోటు నారసింహ క్షేత్రంగా వెలుగొందినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

PC: youtube

 

14. పాదతాడనం

మునులు తమ అవసరాలకు నీటి కోసం కోనేటిని అడగగా, స్వామి తన పాదతాడనంతో కొండమీదే కోనేరుని ఏర్పాటు చేశారట.

PC: youtube

 

15. పాదాకృతి

ఇప్పటికీ పాదాకృతిలోనే కనిపించే కోనేటిని ఆలయంలో దర్శించవచ్చు.

PC: youtube

 

16. స్తంభాద్రి

స్వామి వెలసిన ఈ ప్రాంతం పేరు మీదుగానే ఖమ్మాన్ని తొలుత స్తంభాద్రి అని పిలిచేవారు.

PC: youtube

 

17. ఖమ్మం

తర్వాత కంభంమెట్టుగా, ఖమ్మంగా రూపాంతరం చెందింది.

PC: youtube

 

18. ఉగాది

ఇక్కడ ప్రతి ఉగాదికి స్వామి వారి తొలి అభిషేకం వారి పెద్దల పేరిట ముస్లింలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

PC: youtube

 

19. కొండ గుహ

నిజాం నవాబుల కాలం నుంచీ ఇదే విధానం కొనసాగుతోంది. ఇక్కడ ఇప్పటికీ స్వామి కొండ గుహలోనే కొలువయ్యాడు.

PC: youtube

 

20. లక్ష్మీ అమ్మవారు

దాన్ని కదపకుండానే ఆలయాన్ని నిర్మించారు. పక్కనే మరో గుడిలో లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది.

PC: youtube

 

21. నిత్యం పానకం

ఇక్కడి స్వామిని శాంత పరచేందుకు నిత్యం పానకంతో అభిషేకం జరుపుతారు.

PC: youtube

 

22. కొబ్బరికాయ ముడుపు

భక్తులు తమ కోర్కెలు తీరేందుకు ‘కొబ్బరికాయ ముడుపు' కట్టడం సంప్రదాయం.

PC: youtube

 

23. కోరిన కోర్కెలు

ఉన్నత విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, విదేశీయానం తదితర సంకల్పాలతో రవిక గుడ్డలో కొబ్బరికాయను ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తే స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

PC: youtube

 

24. అన్నదాన కార్యక్రమాలు

ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే శాంతికళ్యాణం, పవళింపుసేవ, అన్నదాన కార్యక్రమాలకు వేలాది భక్తులు హాజరవుతారు.

PC: youtube

 

25. దీపోత్సవం

వైశాఖమాసంలో వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు, ఆశ్వయుజమాసంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, కార్తీకమాసంలో దీపోత్సవం, ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఏర్పాటుచేయడం, ధనుర్మాసంలో నెల రోజుల పాటు తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు.

PC: youtube

 

26. నిజాముల కాలం

దసరా రోజున స్వామి వారి పారువేటను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇది నిజాముల కాలం నుంచీ కొనసాగుతోంది.

PC: youtube

 

27. రైలు సదుపాయము

ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరాలంటే హైదరాబాద్‌ నుంచి 200 కి.మీ, విజయవాడ నుంచి సుమారు 120 కి.మీ ప్రయాణించాలి. రైలు సదుపాయమూ ఉంది.

PC: youtube

 

English summary

Narasimhaswamy Temple In Khammam !

Khammam, a city located in the southern Indian state of Telengana is also known as the headquarters for the Khammam District.Khammam is a beautiful city situated on the banks of river Munneru, a tributary of river Krishna.
Please Wait while comments are loading...