అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Saturday, June 17, 2017, 10:46 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో వున్నాయి. ప్రకృతి పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు.

సంస్కృతీ సాంప్రదాయాల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'....అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం.

అంతేకాకుండా పర్వతారోహులకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖరాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనది. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం'లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. ' యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం వున్నాయి.

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్ విహారం

1. నైనితాల్

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు వుండేవట.

pc: youtube

 

2. నైనీ

ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు,మునులు నివాసం వున్నట్టు స్కందపురాణంలో వుంది.

pc: youtube

 

3. ఋషుల సరోవరం

నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) అని కూడా పిలుస్తారు.

pc: youtube

 

4. నైనితాల్

అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్ లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు.

pc: youtube

 

5. మానస సరోవరం

అలా ఒక లోతైన గుంతను తవ్వి...టిబెట్ దగ్గర వున్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి.

pc: youtube

 

6. పుణ్యం

అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

pc: youtube

 

7. నైనితాల్

దేశంలో వున్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీదేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట.

pc: youtube

 

8. నయన్ అంటే కన్ను

అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి.

pc: youtube

 

9. నైనాదేవి

అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు.

pc: youtube

 

10. నైనాదేవి ఆలయం

నైనాదేవి ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.

pc: youtube

 

11. ఎలా చేరాలి?

దగ్గరి విమానాశ్రయం

పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే.....దగ్గరి విమానాశ్రయం పంత్ నగర్. ఇది నైనితాల్ కు 71 కి.మీ దూరంలో వుంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్ళవచ్చు.

 

12. రైలు మార్గం

రైలు మార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్ గోదాం రైల్వేస్టేషన్ గుండా వెళ్ళవచ్చు( ఈ స్టేషన్ నైనితాల్ కు 31కి.మీ)

pc: youtube

 

13. ఆల్మోరా

ఉత్తరాఖండ్ లో పచ్చదనంతో మైమరపించే మరో ప్రదేశం ఆల్మోరా.

pc: youtube

 

14. ప్రకృతి

ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించి పర్యాటకుడు వుండడంటే అతిశయోక్తి కాదు.

pc: youtube

 

15. ప్రకృతిమాత

ప్రశాంత వాతావరణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతిమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది.

pc: youtube

 

16. ఆల్మోరా

కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది.

pc: youtube

 

17. ప్రముఖుల నివాసాలు

ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది.

pc: youtube

 

18. తాత్కాలిక విడిది

స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట.

pc: youtube

 

19. జన్మస్థలం

అంతేకాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్,ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ , నోబెల్ గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ లకు జన్మస్థలం ఆల్మోరా.

pc: youtube

 

20. మహేంద్ర సింగ్ ధోని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాడట.

pc: youtube

 

21. రాంచీ

ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫాంలు వుండేవట.

pc: youtube

 

22. విమానాశ్రయం

ఇక్కడకు చేరుకోవాలంటే నైనితాల్ కు మాదిరిగానే పంత్ నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి.

pc: youtube

 

23. రైల్వేస్టేషన్

రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్ డాం రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

pc: youtube

 

24. రాణీఖేత్

మన దేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధించిన మైదానాలకు మారుపేరు రాణీఖేత్.

pc: youtube

 

25. పచ్చని తివాచీ

ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచినట్టుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్ లు వున్నాయి.

pc: youtube

 

26. గోల్ఫ్ కోర్స్

ఓక్ అడవుల్లో విస్తరించి వున్న ఈ గోల్ఫ్ కోర్స్ లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.

pc: youtube

 

27. మంచు దుప్పటి

చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది.

pc: youtube

 

28. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు

ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్ గోదాం రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

pc: youtube

 

29. పంత్ నగర్.

దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం పంత్ నగర్. ఇది రాణీఖేత్ కు 20 కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

pc: youtube

 

English summary

Natural Beauty Of Himalayas - Uttarakhand Tourist Places!

Uttarakhand officially the State of Uttarakhand formerly known as Uttaranchal, is a state in the northern part of India. It is often referred to as the Devbhumi due to many Hindu temples and pilgrimage centres found throughout the state. Uttarakhand is known for its natural beauty of the Himalayas.
Please Wait while comments are loading...