Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో మీరు తప్పకుండా చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు !

ఇండియాలో మీరు తప్పకుండా చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు !

భారతదేశం ఒక అద్భుతాల పుట్ట. ఇక్కడ ఎన్నెన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు దాగున్నాయి. సైన్స్ కు సైతం అంతుపట్టని ఎన్నో విషయాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలాయి.

By Venkatakarunasri

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

భారతదేశంలోనే అతి పొడవైన ధోలా సదియా బ్రిడ్జి ఎక్కడుందో మీకు తెలుసా ?భారతదేశంలోనే అతి పొడవైన ధోలా సదియా బ్రిడ్జి ఎక్కడుందో మీకు తెలుసా ?

నాచురల్ వండర్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా ? లేదా చూసారా ? అసలు భారతదేశంలో అవి ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ? అయితే ఓసారి కింద లుక్కేయండీ ...!

మనము గుళ్ళూ .. గోపురాలను దర్శిస్తుంటాం కానీ అవి అంతగా ఆశ్చర్యాన్ని కలిగించవు. కానీ కొన్ని ప్రదేశాలు, ఆలయాలు, టూరిస్ట్ ప్రాంతాలు మాత్రమే ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. భారతదేశం ఒక అద్భుతాల పుట్ట. ఇక్కడ ఎన్నెన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు దాగున్నాయి. సైన్స్ కు సైతం అంతుపట్టని ఎన్నో విషయాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలాయి.

దాదాపు ఇటువంటి ఆశ్చర్యాలన్నీ కూడా ఎవరి ప్రేరేపితం కావు. పుట్టుకతోనే సహజ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఎవరు మార్చినా ఇవి చరిత్ర పుటల్లో చెరిగిపోవు. వాటిని చూస్తే ఎవ్వరైనా వారెవ్వా అనాల్సిందే ..!

ఇండియాలో మీరు తప్పకుండా చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు !

ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. చిర్ భట్టి

1. చిర్ భట్టి

బన్ని గ్రాస్ లాండ్స్ లోని కుచ్ అనే ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు.. వివరించలేని విధంగా.. లైట్లు కనిపిస్తాయి. ఇవి.. దయ్యాల రూపంలో కనిపిస్తాయని నమ్మకం ఉంది. ఈ లైట్స్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ లో ఏర్పడతాయట. ఇండియాలోని ఇదో న్యాచురల్ వండర్.

ఇది కూడా చదవండి: ఇండియాలోని మొదటి 10 అద్భుత ప్రదేశాలు !

2. బొర్రా గుహలు

2. బొర్రా గుహలు

బొర్రా కేవ్స్ కూడా చాలా సహజంగా ఏర్పడినవే. ఇవి విశాఖపట్నంలోని అనంతగిరి కొండలు, అరకులోయలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన గుహలు ఇవి. 80 మీటర్ల లోతులో ఉంటాయి.

చిత్ర కృప : Rajib Ghosh

3. అయస్కాంత కొండ

3. అయస్కాంత కొండ

అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు.

చిత్ర కృప : Fulvio Spada

4. వేడి నీటి బుగ్గ

4. వేడి నీటి బుగ్గ

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉంది.. మణికరన్ పుణ్యక్షేత్రం. ఇక్కడ వేడి నీళ్లు ఎగిరిపడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ఫేమస్. ఇది కూడా న్యాచురల్ గా ఏర్పడిన వండర్.

చిత్ర కృప : Aman Gupta

5.బ్యాలెన్సింగ్ రాక్

5.బ్యాలెన్సింగ్ రాక్

తమిళనాడులోని మహాబలిపురంలోని బ్యాలెన్సింగ్ రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారు. ఇక్కడ గుహలో శివాలయం ఉంటుంది. అలాగే బీచ్ కి సమీపంలో.. ఈ రాయి ఉంది. దీన్ని చూస్తే.. పడిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ యాత్రికులు ఫోటోలు దిగితుంటారు.

చిత్ర కృప : Leon Yaakov

6.బెరడు బ్రిడ్జ్

6.బెరడు బ్రిడ్జ్

ప్రపంచంలో అత్యంత సహజంగా ఏర్పడిన ప్రాంతం ఇది. మేఘాలయకు సమీపంలో ఉన్న చిరపుంజిలో రెండు పెద్ద చెట్ల బెరడుతో.. బ్రిడ్జ్ ఏర్పడింది. ఈ వంతెన ఎవరైనా నిర్మించారా అన్నట్టు ఉంటుంది. కానీ.. ఇది కూడా న్యాచురల్ వండరే. ఈ బ్రిడ్జ్ ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు వినియోగిస్తారు.

చిత్ర కృప : Arshiya Urveeja Bose

7. మంచు శివలింగం

7. మంచు శివలింగం

అమర్ నాథ్ గుహల్లో ఉన్న మంచు శివలింగం హిందువుల పవిత్ర ప్రదేశం. గుహలోపల మంచుతో ఏర్పడ్డ శివలింగం పూర్తిగా సహజమైనది. ఈ శివలింగం ఆకారం ప్రతి ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. అత్యంత ఎక్కువ సందర్శకులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.

చిత్ర కృప : Gktambe

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలుశ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X