Search
  • Follow NativePlanet
Share
» »నెల్లూరు ...దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు !

నెల్లూరు ...దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు !

దేవాలయాల పట్టణంగా పిలువబడే నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ లో కలదు. నేడు ఈ పట్టణం ఒక ఐ టి కేంద్రం గా మారిపోతోంది. ఈ పట్టణాన్ని పూర్వకాలంలో 'విక్రమ సింహపురి' అని పిలిచే వారు. పెన్నా నది ఒడ్డున కల ఈ పట్టణం వ్యవసాయానికి, చేపల చెరువులకు ప్రసిద్ధి గాంచినది. నెల్లూరు లో అనేక ప్రకృతి దృశ్యాల ప్రదేశాలు కలవు. ఇవి మాత్రమే కాక, ఇక్కడ కల బారా షాహీద్ దర్గా, మైపాడు బీచ్, పులికాట్ సరస్సు, నెల పట్టు పక్షి అభయారణ్యం, నరసింహస్వామి టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్ మొదలైనవి కూడా కలవు.

నెల్లూరు ఎలా చేరాలి ?

నెల్లూరు ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం
తిరుపతి లో కల ఎయిర్ పోర్ట్ నుండి నెల్లూరు చేరవచ్చు. దీని దూరం 130 కి. మీ. లు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్, విశాఖపట్నంలకు విమానాలు కలవు. నెల్లూరు కు సమీప అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ 177 కి. మీ. ల దూరంలో చెన్నై నగరం లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

ట్రైన్ ప్రయాణం
నెల్లూరు కు రైలు స్టేషన్ కలదు. చెన్నై నుండి మూడు గంటల ప్రయాణంలో నెల్లూరు చేరవచ్చు. వయా నెల్లూరు అనేక ట్రైన్ లు ప్రయాణిస్తాయి.

రోడ్డు ప్రయాణం
నెల్లూరు పట్టణం చెన్నై కు నాలుగు వరుసల రోడ్డు మార్గం ద్వారా కార్లు లేదా బస్సు లలో ప్రయాణించవచ్చు. చెన్నై, హైదరాబాద్ లకు రెగ్యులర్ బస్సు సర్వీస్ లు కలవు.

Photo Courtesy: ShashiBellamkonda

బారా షాహీద్ దర్గా

బారా షాహీద్ దర్గా

బారా షాహీద్ దర్గా ఒక ప్రసిద్ధ టూరిస్ట్ సైట్ సీయింగ్ ప్రదేశం. ఈ మసీదు లో భక్తి విశ్వాసాలతో ప్రార్ధనలు చేస్తే కోరుకున్నవి నెరవేరు తాయని భక్తులు చెపుతారు. మొహరం పండుగ ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది.
Photo Courtesy: Md Tabish Islam

మై పాడు బీచ్

మై పాడు బీచ్

నెల్లూరు లో మైపాడు బీచ్ మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది నెల్లూరు కు 22 కి. మీ. ల దూరంలో కలదు. మైపాడు వెళ్ళే రోడ్డు మార్గం బాగుంటుంది. నెల్లూరు నుండి తేలికగా వెళ్ళవచ్చు. బీచ్ పొడవుగా వుండి ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణం కలిగి వుంటుంది. పబ్లిక్ కు సా. 6 గం. వరకు మాత్రమే అనుమతి. అందమైన సూర్యోదయం చూసేందుకు టూరిస్ట్ లు ఇక్కడకు వస్తారు.

Photo Courtesy: Md Tabish Islam

పులికాట్ సరస్సు

పులికాట్ సరస్సు

నెల్లూరు లో పులికాట్ సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ సరస్సుకు అనేక వలస పక్షులు వస్తాయి. వివిధ రకాల పక్షులను చూసి ఆనందించేందుకు పక్షి ప్రియులకు ఈ ప్రదేశం స్వర్గం వలె వుంటుంది. ప్రశాంతంగాను,ఆహ్లాడంగాను వుండే ఈ ప్రదేశం ఒక మంచి పిక్నిక్ ప్రదేశంగా వుంటుంది.

Photo Courtesy: Manvendra Bhangui

నెల పట్టు పక్షి అభయాశ్రమం

నెల పట్టు పక్షి అభయాశ్రమం

నెల్లూరు పట్టన తూర్పు కోస్తా తీరంలో సుమారు 20 కి. మీ. ల దూరంలో ఈ నెల పట్టు పక్షి ఆశ్రయం కలదు. ఈ ఆశ్రమంలో వివిధ రకాల పక్షుల సంతానోత్పత్తి జరుగుతుంది. అంతరించి పోతున్న అనేక పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: Lip Kee

నరసింహస్వామి దేవాలయం

నరసింహస్వామి దేవాలయం

నెల్లూరు లో కల నరసింహస్వామి దేవాలయం తప్పక చూడ దగినది. ఈ దేవాలయాన్ని శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయ ఆవరణలో కల ఒక చెట్టును 'సంతాన వృక్షం' అంటారు. పిల్లలు లేని వారు ఈ చెట్టును పూజిస్తే, వారి కోరిక తీరుతుందని నమ్ముతారు. ఇక్కడే కల కొండి కాసులి హుండీ ని పూజిస్తే, వారు విషపు పాములు, తేళ్ళు కాటుకు బలికాకుండా ఉంటారని నమ్ముతారు. Photo Courtesy: Praveen Kaycee

రామలింగేశ్వర దేవాలయం

రామలింగేశ్వర దేవాలయం

రామలింగేశ్వర దేవాలయం నెల్లూరు లో మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనినే రామతీర్ధం అని కూడా పేర్కొంటారు. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన దైవం గాను మాత కామాక్షమ్మ కొలువై వుంటారు. శ్రీ విగ్నేస్వరుడు మరియు శ్రీ సుబ్రమణ్య స్వామీ లను కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ దేవాలయ శిల్ప శైలి చాలా అందంగా వుంటుంది. రంగులు వెలసినప్పటికి ఈ ప్రదేశం ఆకర్షణీయంగా వుంటుంది. Photo Courtesy: Praveen Kaycee

శ్రీ రంగనాథస్వామి దేవాలయం

శ్రీ రంగనాథస్వామి దేవాలయం

విష్ణుమూర్తి అవతారమైన శ్రీ రంగనాథస్వామి ఈ దేవాలయంలో పూజించబడతాడు. ఈ టెంపుల్ ను తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం లేదా రంగనాయకులు గుడి అని కూడా పిలుస్తారు. పెన్నా నది ఒడ్డున కల ఈ దేవాలయం అక్కడి గాలిగోపురం కు ప్రసిద్ధి. ఈ గాని గోపురం ఎత్తు సుమారు 70 అడుగులు కలదు. దీనిపై పది బంగారు పూత కల కలసాలు నిర్మించారు. ఈ దృశ్యం సందర్శకులకు ఒక అద్భుతంగా వుంటుంది. Photo Courtesy: YVSREDDY

అద్దాల మండపం

అద్దాల మండపం

రంగనాధ స్వామి టెంపుల్ లో కల అద్దాల మండపం మరొక పర్యాటక ఆకర్షణ. ఈ మండపంలో చుట్టూ అనేక అద్దాలు వుంచి ప్రదర్శిస్తారు. ఇది ఒక పురాతన మండపంగా చెప్పబడుతుంది. ఈ మండపంలోనే ఇక్కడి ప్రధాన దైవం అయిన రంగనాథస్వామి విగ్రహం కూడా వుంటుంది.

Photo Courtesy: Rajesh kamisetty

సోమశిల

సోమశిల

సోమశిల నెల్లూరు లో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. అక్కడి రిజర్వాయర్ కు ప్రసిద్ధి. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణం కలిగిన ఈ ప్రదేశం నగరవాసులకు ఒక పిక్నిక్ ప్రదేశంగా వుంటుంది. సమీపంలో ట్రెక్కింగ్ చేసేందుకు ఒక కొండ కూడా కలదు.

Photo Courtesy: Praveen Kaycee

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X