Search
  • Follow NativePlanet
Share
» »ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు

ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు

హోగేనక్కల్ తమిళనాడు, ధర్మపురి జిల్లాలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కాని బెంగళూరు నుండి వెళ్ళడం సులభం. ఇది నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.

By Venkatakarunasri

అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?

ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానంఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

హోగేనక్కల్ జలపాతాలు బెంగళూరు నుండి 180 కి.మీ ల దూరంలో తమిళనాడు ధర్మపురి జిల్లాలో కావేరి నది మీద ఉంది. దీనిని 'నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాల నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి మరియు ప్రత్యెక బోటు రైడ్స్ కి ప్రాచుర్యం సంతరించుకున్నది. ఈ ప్రాంతంలో కనిపించే కార్బోనేట్ శిలలు ఆసియా లోనే కాదు, ప్రపచంలోకల్లా అతిపురాతనమైనవని భావిస్తారు. వేసవికాలంలో, ఈ జలపాతాల నీరు బలమైన ప్రవాహాలు లేని సమయంలో, ప్రత్యేక కొరాకిల్స్ (రౌండ్ పడవలు) ప్రయాణించేందుకు ప్రయాణికులు తీసుకుంటారు. అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొరాకిల్స్ లో కొనుక్కోవొచ్చు. ఇక్కడ త్రాగే నీటి పాకెట్లను మరియు స్నాక్స్ ను, ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతుంటారు. ఇక్కడ అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొనుక్కొని వంటకం తయారు చేసుకుంటారు.

ఇది తమిళనాడు, ధర్మపురి జిల్లాలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కాని బెంగళూరు నుండి వెళ్ళడం సులభం. ఇది ధర్మపురి నుండి 50 కి. మీ, సేలం నుండి 114 కి. మీ, బెంగళూరు నుండి 133 కి. మీ దూరంలో కలదు. ఇది నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.

ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం, చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపుగా దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్ దూరంనుండే ఝుమ్మనే శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్ళే కొద్దీ శబ్ధం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్ధంతాలూకు ట్రాన్స్ లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకొని చూడాల్సిందే.

ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

భారతదేశంలో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలలో హోగెనక్కల్‌ జలపాతం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో వుంది.

pc:Joievictor

భారతీయ నయాగరా జలపాతం

భారతీయ నయాగరా జలపాతం

ఈ జలపాతం కావేరీ నదీ మీద ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది.ఆకాశం నుండి దూకుతున్నట్లుగా కనిపించే ఈ జలపాతాన్ని భారతీయ నయాగరా జలపాతంగా పిలుస్తారు.

pc:Ragadreams85

ప్రపంచంలోనే పురాతనమైనవి

ప్రపంచంలోనే పురాతనమైనవి

ఇక్కడున్న కార్బోనేట్ రాళ్ళు దక్షిణాసియాలోను,ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తున్నారు.

pc:Chitrinee

సహజత్వం

సహజత్వం

చూసే వాళ్లకు కళ్ళు చెదిరినట్లుగా అనిపించే ఈ జలపాతం ఆధునిక ప్రపంచానికి దూరంగా వుండే హోగెనక్కల్‌ సహజత్వానికి చేరువగా వుంటుంది.

pc:Nikhilb239

ఎత్తు నుండి భూమి మీదకు

ఎత్తు నుండి భూమి మీదకు

ఈ వాటర్ ఫాల్స్ లో లెక్కలేనన్ని జలపాతాలు వున్నాయి. 250మీ ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి.

pc:R Shanmuga Sundaram

హోగెనక్కల్‌

హోగెనక్కల్‌

వర్షపు నీరు కొండవాలులో ప్రవహించి హోగెనక్కల్‌ దగ్గరకు నదిలో కలుస్తాయి.

pc:Pandi2win

వర్షపునీరు

వర్షపునీరు

వర్షపునీరు కొండవాలులో ప్రవహించి ఈ హోగెనక్కల్‌ దగ్గర నదిలో కలుస్తుంది.

pc:Thamizhpparithi Maari

20 మీ ఎత్తుకు

20 మీ ఎత్తుకు

అంతెత్తు నుండి కిందికి దూకే క్రమంలో నీటి తుంపరులు 20 మీ ఎత్తు లేస్తాయి. ఈ తుంపరులన్నీ కలసి పొగ కప్పేసినట్టుంటుంది.

pc:Thamizhpparithi Maari

ఆరోగ్యం

ఆరోగ్యం

హోగెనక్కల్‌ అంటే అర్ధం కూడా ఇదే.మంచుతుంపరుల నుండ వచ్చే శబ్దమని ఈ హోగెనక్కల్‌ జలపాతం కేవలం అందంగా కనిపించటం మాత్రమే కాదు. ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

pc:Thamizhpparithi Maari

చర్మవ్యాధులు పోతాయి

చర్మవ్యాధులు పోతాయి

అదెలానంటే ఈ నీటిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంట.ఈ జలపాతంలోని నీరు చూడటానికి వెరైటీగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మేలు చేస్తాయట.

pc:Thamizhpparithi Maari

తెప్ప విహారం

తెప్ప విహారం

ఈ జలపాతంలో తెప్ప విహారం ఎంతో పేరు గాంచింది. తెప్ప అంటే వెదురు బద్దలతో ఒక చిన్న బోటుగా అంచులు కొంతవరకు మూయబడి వుంటాయి.

pc:Ashwin Kumar

 తెప్ప

తెప్ప

నీరు లోనికి రాకుండా జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్ షీటు వంటివి క్రింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు.

pc:R Shanmuga Sundaram

ఆనందకరమైన తెప్ప విహారం

ఆనందకరమైన తెప్ప విహారం

ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళనాడులోని హోగెనక్కల్‌ లో బాగా కనబడుతుంది.

pc:Ashwin Kumar

 బొట్లు జలపాతాలు

బొట్లు జలపాతాలు

పురాతనమైన ఈ బొట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రవహిస్తాయి. ఈ ప్రయాణం కొద్ది పాటి భయం కలిగించినప్పటికి, సహజవంతులకు ఆనందాన్ని ఇస్తుంది.

pc: Mithun Kundu

కావేరీ డ్యాం వాటర్

కావేరీ డ్యాం వాటర్

ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరీ డ్యాం వాటర్.

pc:Thamizhpparithi Maari

తెప్ప సహజ క్రీడ

తెప్ప సహజ క్రీడ

ఈ విహారం ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆనందకరమైన ఈ తెప్ప సహజ క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది.

pc: Thamizhpparithi Maari

చర్మ వ్యాధులు

చర్మ వ్యాధులు

హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు.

pc:Emőke Dénes

అరుదైన ప్రకృతి సోయగాలు

అరుదైన ప్రకృతి సోయగాలు

ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.

pc:Ashwin06k

తెప్ప విహారం

తెప్ప విహారం

అక్కడ తెడ్డులో జలపాతాలు చూపించడానికి మనుషులు ఉంటారు. సుమారు ఒక గంట తిప్పుతారు. ఇది ఒక విహారమే కాక, ఒక రవాణా సాధనంగా కూడా వుంటుంది. ఈ తెప్ప విహారం కావేరి మరియు తుంగభద్రా నదులలో అధికంగా కనపడుతుంది.

pc: Thamizhpparithi Maari

వెదురు బద్దలతో తయారు చేయబడిన చిన్న బోటు

వెదురు బద్దలతో తయారు చేయబడిన చిన్న బోటు

తెప్ప అంటే, వెదురు బద్దలతో తయారు చేయబడిన ఒక చిన్న బోటుగా అంచులు కొంత వరకు మూయబడి వుంటుంది. నీరు లోనికి రాకుండా, జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్‌ షీట్‌ వంటివి కింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు.

pc:Thamizhpparithi Maari

తెప్ప విహారం

తెప్ప విహారం

హోగె నక్కల్‌ జలపాతాలు ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళనాడు లోని హోగె నక్కల్‌లో బాగా కనపడుతుంది. పురాతనమైన ఈ బోట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణం కొద్దిపాటి భయం కలిగించి నప్పటికీ, సాహస వంతులకు ఆనందాన్ని ఇస్తుంది.

pc:Sreejith K

 వర్షాకాలంలో మరింత ఉత్సాహంగా

వర్షాకాలంలో మరింత ఉత్సాహంగా

హోగె నక్కల్‌ లోని ఆనందకరమైన ఈ తెప్ప సాహస క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది. తుంగభద్ర నది దక్షిణాదిన మీరు కర్నాటకలోని హంపి పట్టణం సందర్శించినపుడు, అక్కడ కల తుంగభద్ర నదిలో కూడా ఈ తెప్ప ప్రయాణం చేయవచ్చు. తెప్ప నదిలో ప్రయాణిస్తుంటే, హంపి శిథిలాలను చూడవచ్చు.

pc:ezhuttukari

తెప్ప ప్రయాణం - మరింత ఆనందం

తెప్ప ప్రయాణం - మరింత ఆనందం

అలల తాకిడి ఎక్కువగా వున్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రయాణంలోనే అక్కడ మరి కొన్ని ప్రదేశాలు, హోటళ్ళు, రెస్టరెంట్లు చూడవచ్చు. కావేరి నది కావేరి నదిలో తెప్ప ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కావేరి నది, కర్నాటకలోని కొడగు వద్ద పుట్టి, తమిళనాడు రాష్ట్రం గుండా ప్రయాణించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.

pc:Thamizhpparithi Maari

హోగేనక్కల్ ఎలా వెళ్ళాలి?

హోగేనక్కల్ ఎలా వెళ్ళాలి?

హోగేనక్కల్ జలపాతం

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X