Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశ నగరాలు - రాత్రివేళ అందాలు!

భారత దేశ నగరాలు - రాత్రివేళ అందాలు!

నగరాలు పగలు ఒక రకంగాను, రాత్రులు మరొక రకంగానూ కనపడుతూ వుంటాయి. పగటి వేళ వేడి సూర్య రశ్మి తో చెమటలు కక్కించే ఎండలు, వాహున కాలుష్యాలు, వాహనాల ధ్వనులు మొదలైన వాటితో జీవనం ఎంతో కష్ట తరంగా సాగి పోతూ వుంటుంది. కాని రాత్రి అయింది అంటే చాలు చీకటి మాటున ప్రతి నగరం ఎన్నో సరికొత్త అందాలు సంతరించు కొంటుంది. నిర్వహించబడే వివిధ ప్రోగ్రాం లతో పాటు, మెరిసి పోయే విద్యుత్ దీపాల కాంతులు, విద్యుత్ దీపాలతో అలంకరించ బడిన ఎత్తైన భవనాలు, పార్కులు, వివిధ ఇతర ప్రదేశాలు నగరాలలో ప్రధాన ఆకర్షణగా వుంటాయి.

అన్నిటినీ మించి నగరంలోని పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లు వంటివి యువతకు ప్రత్యేక ఆకర్షణగా వుంటాయి. పగలంతా శ్రమ కోర్చి అలసిన వారు సాయంత్రం అయ్యిందంటే చాలు వివిధ ఆనందపు ప్రదేశాలు వెతుక్కుంటారు. కొందరు పార్కులకు వెళితే, మరి కొందరు విందులు, వినోదాలతో వివిధ ప్రదేశాలలో ఆనందిస్తారు. అందుకు అనువైన వాతావరణం ఆకర్షణలతో సృష్టించబడుతుంది.

బహుశా నేటి ఆధునిక జీవనోపాధి అవసరాలు, విభిన్న ఆనందాల కల్పనలు ప్రతి వారిని నగరానికి ఆకర్షిస్తున్నాయి అనుకోవచ్చు. మరి ఇండియా లోని వివిధ నగరాలలో రాత్రి జీవనాలు, ప్రదేశ అందాలు ఎలా ఉంటాయో చిత్ర సహితంగా పరిశీలించండి.

అందాల నగరంలో అర్ధ రాత్రి ....!

ముంబై

ముంబై

అనేక ఆకర్షణలు కల ముంబై నగరం రాత్రివేళ ఒక కళ్యాణ మంటపాన్ని తలపిస్తుంది.

చిత్ర కృప : Advait Supnekar

చెన్నై

చెన్నై

నగరంలో ఒక సామాన్యమైన రాత్రి ఇంత కళ గా వుంటుంది.

చిత్రకృప : Planemad

కోల్కొతా

కోల్కొతా

రాత్రివేళ విద్యుత్ కాంతులతో మెరిసిపోయే కలకత్తా లోని హౌరా వంతెన.

చిత్రకృప : Shubhankar.sengupta19

ఢిల్లీ

ఢిల్లీ

దేశానికే గర్వకారణం అయిన రాజధాని ఢిల్లీ లో విద్యుత్ దీపాలతో అలంకరించబడిన ఇండియా గెట్

చిత్రకృప : Edmund Gall

బెంగుళూరు

బెంగుళూరు

ఇది గో చూడండి ...బెంగుళూరు నగరం లోని యు.బి. సిటీ రాత్రివేళ అందాలు

చిత్రకృప : Ming-yen Hsu

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో రాత్రివేళ వెలుగులలో అందంగా కనపడే బుద్ధ విగ్రహం

చిత్రకృప : Alosh Bennett

గౌహతి

గౌహతి

అస్సాం రాష్ట్రంలోని హౌహతి నగరం లో ఒక దీపావళి రోజున నగరం కనపడిని దృశ్యం ఇలా వుంటుంది.

చిత్ర కృప : Kinshuk Kashyap

అహ్మదాబాద్

అహ్మదాబాద్

గుజరాత్ రాష్ట్రంలోని అహమదాబాద్ నగరం లో నవరాత్రి సందర్భంగా రాత్రి వేల జరిగు వేడుకలు

చిత్ర కృప : Hardik jadeja

అల్లెప్పి

అల్లెప్పి

కేరళ లోని అల్లెప్పి లో రాత్రివేళ విహరించే బోటు దృశ్యం

చిత్ర కృప : Ajith

అలహాబాద్

అలహాబాద్

అలహాబాద్ లోని కుంభ మేళ లో అతీత శక్తులతో పోరాటం సాగించే ఒక నాగ సాధువు. రాత్రివేళ తీసిన ఒక చిత్రం

అమృత్సర్

అమృత్సర్

పంజాబ్ లోని అమృత సర్ లో కల సిక్కు మతస్తుల స్వర్ణ దేవాలయ దృశ్యం.

మదురై

మదురై

మదురై పట్టణంలోని ఎ.వి. వంతెన

చిత్ర కృప : wishvam

హరిద్వార్

హరిద్వార్

హిందువుల పవిత్ర క్షేత్రం హరిద్వార్ లోని హర కి పౌరి లో ఒక అందమైన దృశ్యం

చిత్ర కృప : Livefree2013

జైపూర్

జైపూర్

జైపూర్ లోని సహాయ మాన్ సింగ్ పాలస్ రాత్రివేళ విద్యుత్ కాంతులలో మెరిసిపోతున్న దృశ్యం.

చిత్ర కృప : Nitesh Pandey

జంషెడ్ పూర్

జంషెడ్ పూర్

ఉక్కు నగరంగా పిలువబడే జెంషెడ్ పూర్ లో ఒక రాత్రి.

చిత్ర కృప : Ashokinder

కొచ్చి

కొచ్చి

కేరళ లోని కొచ్చి నగరం రాత్రివేళ దీపాలతో ధగ దగా మంటూ ఆకర్షిస్తోంది.

చిత్ర కృప : Augustus Binu

వారణాసి

వారణాసి

వారణాసిలో పవిత్ర గంగా నదికి సాయంత్రం వేల భక్తి శ్రద్ధలతో హారతి అందించే దృశ్యం

చిత్ర కృప: dalbera

పాండిచేరి

పాండిచేరి

కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరి లో ఒక రాత్రి.

ఫోటో కృప : Nelson.G

సిమ్లా

సిమ్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సిమ్లా లో ఒక రాత్రివేళ దృశ్యం

చిత్ర కృప: Sumit.kumar2209

కన్యాకుమారి

కన్యాకుమారి

తమిళనాడు లోనికన్యాకుమారిలో కల వివేకానంద రాక్ మెమోరియల్ విద్యుత్ వెలుగుల దృశ్యం.

చిత్ర కృప : Jegan M

కర్నూల్

కర్నూల్

కర్నూల్ పట్టణంలో రెడ్డి బురుజు రాత్రి వెలుగులలో కనపడే దృశ్యం

చిత్ర కృప: Poreddy Sagar

శివకాశి

శివకాశి

తమిళనాడులో పేలుడు పటాకులకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధి గాంచిన శివకాశి పట్టణం రాత్రి వెలుగులలో ...

చిత్ర కృప : Joel Suganth

చెన్నై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X