అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

Written by: Venkatakarunasri
Published: Saturday, August 12, 2017, 11:28 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

అది పాండవులు కట్టించిన కట్టడం.కాని అది మాత్రం సముద్రంమధ్యలో ప్రశాంతంగా వుంది.అక్కడికి వెళ్ళాలని మీకుంటే సరిపోదు. నువ్వు అక్కడికి రావాలని దానికీ అనిపించాలి.అప్పుడు అదేంచేస్తుందో తెలుసా?అలా కాదని దాని దగ్గరకి వెళ్లాలని ట్రైచేస్తే ఇక అంతే. ఇంతకి అదెక్కడ?ఇప్పుడు మనం తెలుసుకుందాం.అది మన భారతదేశంలోనే అరేబియా సముద్రం లోపల వుంది.ఇక్కడికి వెళ్తే రాగాలమో, లేదో?అనే ప్రశ్నకు సమాధానం కూడా చెబుతాను.

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. ఒక్కోసారి కొన్ని వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది శివుడి గుడి అయితే అది మహాద్భుతమే. అదే ఈ అద్భుతశివలింగం. అరేబియాసముద్రంలో వుందంటే నమ్మగలమా?నమ్మితీరాల్సిందే. కానీ ఆ గుడిలోకి వెళ్ళాలంటే సాహసయాత్రే అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం సముద్రపు అలలు వుప్పొంగినా, సమయం దాటిపోయినా,మనం శివుడిలో ఐక్యం అయిపోతాం. మరి ఈ అరేబియా సముద్రంలో వున్నటువంటి లింగేశ్వరుని ఆలయం గురించి తెలుసుకోవాలని వుందా? అరేబియా సముద్రంలో ఉన్న ఆ శివాలయం గురించి మీకు తెలుసా ?

గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఎక్కడ వుంది?

గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపంలోవున్న కులియాక్ అనేగ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కి.మీ లోపల వుంది ఈ టెంపుల్.

ఇక్కడ ప్రధాన దైవం

ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం శివునికి అంకితం చేయబడినది.ఇందులో శివలింగం వుంటుంది.ఇదే ఇక్కడ ప్రధాన దైవం.

ఎలా వెళ్ళాలి

ఆలయానికి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళకూడదు.వెళ్తే ప్రాణాల్తోమాత్రం తిరిగిరారు.ఎందుకంటే సముద్రం మింగేస్తుంది కాబట్టి.దీనికంటూ ఒక సమయం వుంది.

ఏ సమయంలో వెళ్ళాలి?

ఉదయాన్నే లేచి అక్కడకువెళ్తే ఆలయం కనపడదు.ఒక వేళ మీరు వెళ్ళారే అనుకోండిఅక్కడ మీకు ఆలయం కనిపించదు.దూరంలో సముద్రంలో నిలబడివున్న ధ్వజస్థంభం మాత్రం కనిపిస్తుంది.మధ్యాహ్నంపూట వెళితే మీరు ఆ ఆలయాన్ని చూడొచ్చు.

ఎలా వెళ్ళాలి

ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కివెళుతుంది.మధ్యాహ్నమంటే సుమారు 1గంట సమయంలో అలా సముద్రం వెనక్కివెళ్ళిన తర్వాత మీరు ఆ ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళాలి.

ఏ సమయంలో హాయిగా గడపొచ్చు

అక్కడికెళ్ళి ఆ ఆలయంలో పూజలు కూడా చేయొచ్చు.ఇలా రాత్రి 10గంటల వరకు మీరు అక్కడేవుండొచ్చు.ఆలయంలో హాయిగా గడపొచ్చు.ఆ సమయం దాటితే మాత్రం వెనక్కివచ్చేయాలి. అలా కాకుండా నేను అక్కడే వుంటాను అని మారాం చేస్తే సముద్రంలో కలిసిపోతారు.

రాత్రిపూట ఏం జరుగుతుంది?

రాత్రి 10దాటితే సముద్రం మళ్ళీ ముందుకు వస్తుంది.గుడిని ముంచెత్తుతుంది.దాంతో గుడి కనిపించదు.ఇది అక్కడ జరిగే అద్భుతం.ఆలయంలో ఎత్తుగావుండేది ధ్వజస్థంభం.సుమారు ఆ లెవల్ వరకు అంటే 20మీలఎత్తు నీళ్ళు వచ్చేస్తాయ్

ఎప్పుడు అద్భుతంగాకనిపిస్తుంది?

ఇలాగ కొన్ని వందలవేల సంల నుంచి జరుగుతుందట అక్కడ.ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణంలో చెబుతుంది.పాండవులు పూజలుచేసి ప్రతిష్టించిన 5శివలింగాలు ఇప్పటికి ఆలయంలో చెక్కు చెదరకుండా వున్నాయ్.పౌర్ణమిలో చంద్రుని వెన్నెల కాంతిలో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా గుడిని తీసుకుపోవటం అద్భుతంగా కనిపిస్తుందట అక్కడ.

లింగ ప్రతిష్ట ఎవరు చేసారు?

ధర్మరాజు ప్రతిష్టించిన లింగేశ్వరుడిని ఇక్కడ భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో కొలుస్తారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఇక్కడ లింగాలను ప్రతిష్టించారు.

అద్భుతమైన వీక్షణ

అందుకే ఇక్కడ మనకి 5 లింగాలు దర్శనమిస్తాయి. ఇక ఈ గుడి పున్నమికాంతిలో చూసి తీరాల్సిందే. చంద్రుని కాంతి ఈ లింగంపై బడి అద్భుతంగా కనిపిస్తుందని అది ఖచ్చితంగా చూసితీరాల్సిందేనని ఇక్కడి ప్రజలు చెప్తారు.

పూజ

ఇక్కడ పూజారులు ఎవరూ వుండరు. కేవలం భక్తులతో పాటే వచ్చి భక్తులతో బయటకు వచ్చేస్తారు. వారితో పాటు మనం వెళ్లి పూజను ముగించుకొని తిరిగి వచ్చేయాలి.

చిన్న పిల్లలు

ముఖ్యంగా ఈ గుడికి చిన్న పిల్లలను అనుమతించరు. ఎందుకంటే వారు సముద్రంలో నడువలేరు.కేవలం 10సంలు దాటితేనే అనుమతిస్తారు.

గుడిలోకి భక్తులు ఎలా ప్రవేశించాలి?

తాళ్ళసహాయంతో మెల్లగా అడుగులోఅడుగు వేసుకుంటూ అలలను దాటుకుంటూ ఈ గుడిలోకి భక్తులు ప్రవేశిస్తారు. గుడి మొత్తం నాచుతో కప్పబడి పోయివుంటుంది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే జారి పడి పోయే ప్రమాదం వుంది.

భారతదేశంలో అద్భుతం

సముద్రంలో ఇలాంటి ఆలయం వుండటం నిజంగా భారతదేశంలో అద్భుతమనే చెప్పాలి. గుజరాత్ పర్యాటకులకు ఈ గుడి గురించి చెప్పి వారికి ఇష్టమైతే ఈ గుడి దగ్గరకు తీసుకునివెళతారు. ఇలాంటి ఎన్నో వింతలు మనమధ్య మన భారతదేశంలోనే వున్నాయి.

భావ్ నగర్ కు దగ్గరలో చూడాల్సిన పర్యాటక స్థలాలు

బ్రహ్మ కుంట

గుజరాత్ లోని భావ నగర్ జిల్లలో సిహోర్ నగరం లో బ్రహ్మ కుండ్ లేదా బ్రహ్మ కుంట కలదు. ఇది ఒక మెట్ల బావి. ఎన్నో అందమైన హిందూ దేవతల శిల్పాలు కలిగి వుంది. రానక్ దేవి చే శపించబడిన రాజు సిద్ధరాజ్ తన చర్మ వ్యాధుల నుండి ఈ బావి నీటిచే నయం చేయబడ్డాడని చెపుతారు. ఈ బావికి గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలదు. బ్రహ్మ కుండ్ మధ్య యుగం నాటి శిల్ప కళల తో అనేక మెట్లు, చిన్న టెంపుల్స్, విగ్రహాలు, దేవతలు వంటి వాటితో అందంగా నిర్మించ బడింది.

 

గాంధీ స్మ్రితి భవనం

గాంధీ స్మ్రితి భవనాన్ని 1955 లో మహాత్మా గాంధి కి స్మారకంగా నిర్మించారు. ఇక్కడ మహాత్మా గాంధి ఉపయోగించిన వస్తువుల సేకరణ తో పాటు, వివిధ రకాల పుస్తకాలను కూడా ఉంచారు. గాంధి గారి జీవిత విశేషాలను చూపుతూ అనేక ఫోటో గ్రాఫులు కూడా ప్రదర్శిస్తారు. కాల క్రమేణా గాంధీ స్మ్రిత్ గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకొంది. సిటీలోని ఏ ప్రాంతం నుండి అయినా సరే తేలికగా ఇక్కడకు చేరవచ్చు.

గౌరీ శంకర్ లేక్ మరియు విక్టోరియా ఫారెస్ట్

దివాన్ శ్రీ గౌరీ శంకర్ ఓజా పేరుతో ఈ లేక్ ను మరియు విక్టోరియా ఫారెస్ట్ ను సుమారు 381 హెక్టార్ ల భూమిలో నిర్మించారు. దీనిని బోర్ తాలాబ్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు ను 1872 లో ఒక నీటి రిజర్వాయర్ గా తాగు నీటి కొరకు ఏర్పరచారు. సిటీలో చక్కటి పిక్ నిక్ స్పాట్ గా పేరు పడింది. దీనికి సమీపంలో ఒక లక్ష చెట్ల పైగా కల ఒక చిన్న అడవి కూడా కలదు. దీనిలో ఎన్నో వృక్షాలు, జంతువులు కూడా కలవు. ఈ అడవి లో మొక్కల పెంపకానికి అవసరమైన రెండు నర్సరీ లు కూడా కలవు.

ఇక్కడకు ఎలా చేరాలి

రైలు ప్రయాణం

భావనగర్ రైలు స్టేషన్ కు గుజరాత్, అహ్మదాబాద్, వదోదర వంటి ప్రధాన నగరాల నుండి రైళ్ళు కలవు.

 

విమాన ప్రయాణం

భావ నగర్ లోని స్థానిక విమానాశ్రయం నుండి విమానాలు ముంబై వంటి ప్రధాన నగరాలకు కలవు. ప్రధాన విమాన సర్వీస్ లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మరియు జెట్ ఎయిర్ వేస్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి సేవలు అందిస్తారు. భావ నగర్ చేరాలంటే, ఇది సౌకర్య వంతమైన ప్రయాణం.

English summary

Nishkalang Mahadev Temple in Gujarat

Nishkalank Mahadev Temple temple is located in the Bhavnagar district of Gujarat state in India.
Please Wait while comments are loading...