Search
  • Follow NativePlanet
Share
» »ఎన్టీఆర్ గార్డెన్స్, హైదరాబాద్ !

ఎన్టీఆర్ గార్డెన్స్, హైదరాబాద్ !

By Mohammad

ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్ లోని ఉద్యానవనాలలో ఒకటి. రాష్ట్ర సచివాలయానికి చేరువలో, హుస్సేన్ సాగర్ కు కూతవేటు దూరంలో ఎన్టీఆర్ గార్డెన్స్ కలదు. ఈ ఉద్యానవనాన్ని 36 ఎకరాలలో విస్తరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినిమా నటుడు ఎన్.టి.రామారావు జ్ఞాపకార్థం 1999 నుంచి ఈ పార్క్ సేవలందిస్తుంది.

రంగురంగుల పుష్పాలు, మొక్కలు, పొదలు మరియు చెట్లు మొదలైనవి ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పార్కు యొక్క వాతావరణం, అక్కడ ఆచరించే యాక్టివిటీలు తప్పక ఆకట్టుకుంటాయి.

ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రవేశం

ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రవేశం, చిత్రకృప : Saikiranstuffguy

పార్కులో ఆకర్షించేవి

మచల్ చెట్టు, కార్ కేఫ్, జపనీస్ పార్క్ మరియు పిల్లలు ఆడే స్థలం. వీటితో పాటు తాగటానికి, తినటానికి షాపులు, స్టాల్స్ ఉన్నాయి.

పార్కులో ప్రధాన ఆకర్షణ మోనో రైలు. ఇందులో కూర్చుంటే పార్క్ మొత్తం చుట్టేయొచ్చు. ఇవేకాక కృతిమ జలపాతం, బోటింగ్ వంటి ఆకర్షణలు కూడా ఉన్నాయి.

పూల అందాలు

పూల అందాలు, చిత్రకృప : Naveenji

ఆహార సదుపాయాలు

మీకు ఫుడ్ అక్కడి రెస్టారెంట్ లలో లభ్యమవుతుంది లేదా మీరు స్పెషల్ గా మెన్షన్ చేసి చెప్పవచ్చు. నార్త్ ఇండియన్, సౌంత్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్, రష్యన్ ఇలా అన్ని రుచులు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ టాప్ 10 బిర్యాని హోటళ్లు !హైదరాబాద్ టాప్ 10 బిర్యాని హోటళ్లు !

పార్క్ లోని పచ్చదనంలో విహరిస్తూ తాజా గాలిని మరియు విశ్రాంతిని తీసుకోవచ్చు.

రొటేటర్ టవర్

సందర్శకులకు నగరం కనిపించేలా ఎత్త్తెన రొటేటర్‌ టవర్‌ ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఇందులో కూర్చున్న వారిని ఒకటిన్నర నిమిషంలో దాదాపు 70 అడుగుల ఎత్తుకు తీసుకు వెళుతుంది. ఎత్తుకు చేరిన తరువాత 30 సెకెన్ల పాటు చుట్టూ తిరుగుతూ నగర అందాల్ని వీక్షించవచ్చు. మళ్లీ నిమిషమున్నరలో కిందకు చేరుకోవచ్చు. ఒకేసారి 32 మంది వరకు దీనిపై కూర్చొనేందుకు వీలుంటుంది. ఇది ఎక్కిన వారు ప్రత్యేక రుసుం (రూ.25) చెల్లించవలసి ఉంటుంది.

రొటేటర్ టవర్

రొటేటర్ టవర్, చిత్రకృప : Vilas Kangal Follow

టైమింగ్స్

ఎన్టీఆర్ గార్డెన్స్ లో సందర్శించాహటానికి ఒక సమయం అంటూ ఉంటుంది. మధ్యాహ్నం 2 :30 గంటల నుండి రాత్రి 10 : 00 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. వారంలో ప్రతి రోజూ తెరుస్తారు.

ప్రవేశం

ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలి ప్రవేశించటానికి పెద్దలు 20 రూపాయలు చొప్పున మరియు పిల్లలకు 10 రూపాయలు చొప్పున చెల్లించాలి.

ఫోటోగ్రఫీ

కొంతమందికి ఫోటోలు తీయాలనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ట్రావెలర్స్ మరియు ఫారెనర్స్ . వారు కెమెరా ను బట్టి 30 రూపాయల నుండి 65 రూపాయల వరకు చెల్లించాలి.

మోనో ట్రైన్

మోనో ట్రైన్, చిత్రకృప : Anulal

పార్టీలకు కూడా

కార్పొరేట్ పార్టీలు, చిన్నాపాటి ఫంక్షన్ లను ఎన్టీఆర్ గార్డెన్స్ లోని పార్టీ జోన్ లో నిర్వహించుకోవచ్చు. ఇందుకోసమై ముందుగానే బుక్ చేసుకోవాలి. రోజుకు 21,000 రూపాయలు మరియు సర్వీస్ టాక్సీ అదనం. దయచేసి గుర్తించుకోండి సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందుగానే 5000 రూపాయలు అదనంగా చెల్లించాలి. దీనిని తిరిగి ఇచ్చేస్తారు.

పార్టీలు నిర్వహించుకొనే టైం : మధ్యాహ్నం 2:30 గంటల నుండి అర్ధరాత్రి వరకు

ఎన్టీఆర్ గార్డెన్స్ భౌగోళికంగా నగరం మధ్యలో ఉన్న ఒక ప్రధాన ఉద్యాన వనం. దీనికి చేరువలో బిర్లా మందిర్, లుంబిని పార్క్ మరియు నేక్లెస్ రోడ్ వంటివి దీనికి దగ్గరలో ఉన్న ఇతర పర్యాటక ఆకర్షణలు.

తెలంగాణ తిరుమల .. చిలుకూరు బాలాజీ !తెలంగాణ తిరుమల .. చిలుకూరు బాలాజీ !

బుద్ధ విగ్రహం, హుస్సేన్ సాగర్

బుద్ధ విగ్రహం, హుస్సేన్ సాగర్, చిత్రకృప : TripodStories- AB

లుంబిని పార్క్

లుంబిని పార్క్ హుస్సేన్ సాగర్ ఒడ్డున 1994 లో ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ల సీజనల్ పుష్పాలను, మొక్కలను మరియు చెట్లను చూడవచ్చు. ఈ పార్క్ ప్రధాన ఆకర్షణ రాత్రి పూట నిర్వహించే లేజర్ షో మరియు టికెట్ తీసుకొని హుస్సేన్ సాగర్ మధ్యలో నిలబడ్డ బుద్ధుని విగ్రహం వరకు ఫెర్రీ ప్రయాణం.

వనస్థలిపురం : ప్రకృతిలో విహారం !వనస్థలిపురం : ప్రకృతిలో విహారం !

సందర్శన సమయం : ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ( సోమవారం తప్ప). పిల్లలు ఆడుకోవటానికి టాయ్ ట్రైన్, వేవ్ పూల్ వంటివి ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X