Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీ మాయా దృశ్యాలు - ఎవరికీ తెలియని ఢిల్లీ !

ఢిల్లీ మాయా దృశ్యాలు - ఎవరికీ తెలియని ఢిల్లీ !

బహుశ ఢిల్లీ నగరానికి మీరు సాధారణ సైట్ సీయిన్గ్ కు మాహ్రమే వెళ్లి ఉండవచ్చు. ఆగ్రా లో తాజ్ మహల్ చూసి ఉండవచ్చు. మొఘల్ వంటకాలు ఆస్వాదించి ఉండవచ్చు. కుతుబ్ మినార్ వద్ద మీ ప్రియమైన వాటిర్హో కలసి ఆనందించి ఉండవచ్చు.

ఇది అంతా ఒక టూరిస్ట్ గా మీరు ఆస్వాదించే ఆనందాలు. అయితే, ఢిల్లీ లో ఎవరికీ పైకి తెలియని ఆనందాలు కొన్ని కలవు.

సాధారణంగా ఈ అంశాలు ఇక్కడ కొంతకాలం పాటు వుండే వారికే మాత్రమే తెలుస్తాయి. మరి అటువంటి అంశాలు ఏమిటి ? అనేది పరిశీలిస్తే ....

మనసును ఉల్లాసం చేసే కవాలీలు

మనసును ఉల్లాసం చేసే కవాలీలు

ఈ కవాలీలు నిజాముద్దీన్ దర్గా వద్ద వినపడతాయి. నిజాముద్దీన్ దర్గా సౌత్ ఢిల్లీ లో కలదు. ఈ దర్గా హజరత్ నిజాముద్దీన్ ఔలియా సమాధి ప్రదేశం సూఫీ భక్తులు ఈ పవిత్ర దర్గా ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వస్తారు. ప్రతి గురువారం ఇక్కడ వీనుల విందైన భక్తి పూర్వక కవాలీలు దర్గా ప్రాంగణం లో జరుగుతాయి. దర్గా చుట్టుపక్కల కల బిజీ మార్కెట్ మరియు సమీపంలోనే వున్నా హుమాయూన్ టూంబ్ లు కూడా చూడవచ్చు. Photo Courtesy: rajkumar1220

చేయ వలసినవి - చేయకూడనివి

చేయ వలసినవి - చేయకూడనివి

చీకటి పడగానే లేదా సూర్యుడు అస్తమించాగానే ఈ ప్రదేశానికి చేరండి. మీ వేషం అంటే దుస్తులు కొంచెం సాంప్రదాయకంగా వుండాలి. దర్గా లోపలి ప్రవేశించే ముందు మీ పాద రక్షలు తీసి వేయండి. ఇక్కడ చెప్పుల రక్షణకు ఎవరూ ఫీజు వసూలు చేయరు. చుట్టూ పక్కల షాపులు కోరినా ఈ సొమ్ము మీరు ఇవ్వనసరంలేదు.

Photo Courtesy: Varun Shiv Kapur

ఢిల్లీ లో వీధి జీవితం

ఢిల్లీ లో వీధి జీవితం

పెద్ద పెద్ద నగరాలలో పిల్లలకు గల జీవితాలు కొద్దిపాటి విచారం కలిగించేవిగా వుంటాయి. ఇక్కడ కల గైడెడ్ టూర్ ఒక రెండు గంటల పాటు పహరాన్గంజ్ మరియు ఢిల్లీ రైల్వే స్టేషన్ చుట్టుపట్ల కనుక మీరు పొందితే వారి జేవనం అర్ధం అవుతుంది.. ఈ టూర్ ను సలాం బాలక్ ట్రస్ట్ అనే ఒక స్వచ్చంద సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఢిల్లీ లోని అనాధ పిల్లలను రక్షిస్తుంది వీధి పిల్లల గురించిన విచార జీవితాలను లోకానికి వెల్లడిస్తుంది.

Photo Courtesy: Grant Matthews

జానపద కళాకారులు

జానపద కళాకారులు

ఇంత పెద్ద మెట్రో నగరంలో జానపద కలాకారులా అనుకుంటున్నారా ? వీరు వెస్ట్ ఢిల్లీ లోని శాదిపూర్ బస్సు డిపో వద్డకల కట్ పుతలి అనే ఒక స్లమ్ ప్రాంతంలో వుంటారు. ఇతర స్లం ల వాలే కాక ఇది అనేక మంది మెజీషియన్ లకు, ఇంద్రజాలికులకు, మైఁ ఆర్టిస్ట్ లకు, ఆక్రో బాట్ , డాన్సర్ లకు, గాయకులకు స్థిర నివాసం కల్పిస్తోంది. వీరు ఇండియా కు ప్రాతినిధ్యం వహిస్తూ, విదేశాలలో వారి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తక్కువ కులాల వారు అవటం వలన జీవనం కష్టం గా గడుపుతారు. అంతం కానున్న అనేక కళలను వీరు చస్తూ వాటిని బహికిస్తున్న వీరి జీవనాలు కోడిగా పరిశీలించండి. అభినందించండి.

Photo Courtesy:rajkumar1220

దయ్యాల టూర్

దయ్యాల టూర్

వావ్ వింటేనే భయబెస్తోంది కదూ...గుండె బలహీనత కల వారు వెల్ల వద్దు. ఢిల్లీ లోని ఈ ప్రదేశం లో ఒకప్పుడు రక్తం కారింది. బయన్కరమైన కన్నీటి గాధలు నడిచాయి. పూర్తిగా ఇది అఆత్మలు సంచరిచే మరొక ప్రదేశం కళ్ళారా చూడండి. ఒళ్ళు గగుర్పొడిచే సంగతులు వినండి. ఇవన్నీ ఎక్కడో కాదు, ఢిల్లీ మెట్రో నగరంలోని ఖూని దర్వాజా వద్ద. ఇక్కడ ముగ్గురు రాజకుమారులు భయంకరంగా బ్రిటిష్ వారిచే చంపబడ్డారు. నేటికీ ఇక్కడ అర్ధ రాత్రిలో ఒక మహిళా తెల్లటి చీర ధరించి చేతిలో ఒక కేండిల్ దీపం పట్టుకొని ఆ ప్రదేశంలో సంచరించే కార్ల వద్దకు వస్తుంది. కార్లను నిలిపి ఇస్తుంది. ఈ టూర్ తప్పక చూసి మీలోని ధైర్యం పరీక్షించండి.

Photo Courtesy: varun shiv kapur

రక్షక భటుల సంగీత వేడుకలు

రక్షక భటుల సంగీత వేడుకలు

ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ గురించి చాలామంది కి తెలియదు. ఇక్కడ కల రక్షక భటుల విధులు మారే సంగీత వేడుకలు అద్భుతంగా వుంటాయి. ఈ వేడుకలు లండన్ లోని బకింగ్హాం పాలస్ లో కూడా చూడవచ్చు. ప్రతి సనివారం ఉదం ఇవి రాష్ట్రపతి భవన్ లో జరుగుతాయి. మార్చ్ 15 నుండి ఆగష్టు 14 వరకు ఉదం 8 గం. లకు, ఆగష్టు 15 నుండి నవంబర్ 14 వరకూ ఉదం 9 గం.లకు నవంబర్ 15 నుండి మార్చ్ 14 వరకూ ఉదయం 10 గంటలకు ఇది జరుగుతుంది.

Photo Courtesy: Siebrand
-

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X