Search
  • Follow NativePlanet
Share
» »ఒక్క రోజు ట్రెక్కింగ్ ఆనందాలు - టుంకూర్ కొండలు !

ఒక్క రోజు ట్రెక్కింగ్ ఆనందాలు - టుంకూర్ కొండలు !

సాహస క్రీడల అభిమానులు, తమ ప్రతి ప్రోగ్రాం తర్వాత మరోసారి ఎక్కడకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ వుంటారు. ఈ రకమైన సాహిసిక యువత బెంగుళూరు లో అనేకం వున్నారు. ఇటువంటి వారికి బెంగుళూరు చుట్టుపట్ల అనేక ప్రదేశాలు కలవు. వాటిలో అమితంగా ఆనందించ దగిన ప్రదేశం టుంకూర్ ఒకటి. టుంకూర్ లో సాహసం చేసెందుకు అనేక ప్రదేశాలు కలవు. అనేక సరస్సులు, ఎత్తైన కొండలు తో ఈ ప్రదేశం సుందరంగా వుంటుంది. అనేక హిల్ టెంపుల్స్ కలవు. వాస్తావానికి టుంకూర్ ను ట్రెక్కర్ల స్వర్గం అనవచ్చు. ఈ ప్రదేశం బెంగుళూరుకు వాయువ్యంగా 70 కి. మీ. ల దూరంలో వుంది. బెంగుళూరు నుండి ఒక్క రోజులో తిరిగి వచ్చేదిగా వుంటుంది. అయితే కొందరు ఈ ట్రెక్కింగ్ ను పౌర్ణమి వెన్నలలో కూడా చేయటానికి ఇష్టపడతారు.

ఒక్క రోజు ట్రెక్కింగ్ ఆనందాలు టుంకూర్

చిత్ర కృప : Vinay Siddapura

టుంకూర్ లో అన్ని ప్రదేశాలకంటే కూడా ట్రెక్కింగ్ కు అనువైనది మధుగిరి కొండలు. మధుగిరి అంటే తేనె కొండ అని అర్ధం. ఇక్కడి అనుభవం తేనె అంత మధురంగా వుంటుంది. ఇక్కడ కల ఏక రాయి ఆసియ లో పెద్దది, ప్రపంచంలో రెండవ పెద్దదిగా చెపుతారు. ఇక్కడ ఒక బ్లాక్ బాక్ సంక్చురి కలదు. కొండ కింద కల మధుగిరి కోట మిమ్మల్ని గత చరిత్రలోకి తీసుకు వెళుతుంది.

టుంకూర్ లోకల దేవరాయన దుర్గ కొండకు పర్యాటకులు అధికంగా వస్తారు. పవిత్రమైన ఈ కొండపై రెండు దేవాలయాలు కలవు. ఒకటి కింది కొండపైన, రెండవది పై కొండపైనా కలవు. ఈ టెంపుల్స్ ను ద్రావిడ శిల్ప శైలి లో నిర్మించారు. ఉదయమే వచ్చే వారికి ఉదయించే సూర్యుడు ఒక ప్రత్యేక ఆకర్షణ. పచ్చటి ఈ కొండపై, కల నామద చాలూమే అనే ఒక జింకల పార్క్ ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రదేశంలోనే జయమంగాలి నది ప్రవాహం మొదలవుతుంది.

ఒక్క రోజు ట్రెక్కింగ్ ఆనందాలు టుంకూర్

చిత్ర కృప : Srinivasa83

సిద్దర బెట్ట ప్రదేశం నేటి యువకులలో కూడా ఎంతో ఆధ్యాత్మికత నింపుతోంది. యువకులు ఈ కొండ సందర్శనకు ఇష్టపడతారు. 'సిద్దరు ' అంటే పవిత్రమైన మనుషులు అని అర్ధం. సుమారు తొమ్మిది వేలమంది సిద్దరు ఇక్కడ ధ్యానం చేసారని ఆ కారణంగా ఈ కొండకు ఆ పేరు వచ్చిందని చెపుతారు. దేవరాయనదుర్గ కు సమీపంలోనే కల సిద్దర బెట్ట లో కొన్ని టెంపుల్స్ మరియు కొండపై గుహలు కలవు. కొండపై అనేక వన మూలికలు కూడా దొరుకు తాయి అని చెపుతారు.

ఇక్కడ కల ప్రదేశాలలో 'శివ గంగ ' మరొక చూడ దగిన ప్రదేశం. ట్రెక్కింగ్ కు అనుకూలం. ఇది బెంగుళూరు కు 54 కి. మీ. లు. బెంగుళూరు నుండి ట్రైన్ లో ప్రయాణించి దాబాస్ పేటలో దిగి ఈ ప్రదేశం చేరాలి. శివ లింగం ఆకారంలో వుండే ఈ కొండను ట్రెక్కింగ్ చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. ఈ కొండపై ఒక నీటి ప్రవాహం కలదు. కనుక దీనిని శివ గంగ అన్నారు. దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి బెంగుళూరు మరియు టుంకూర్ ప్రదేశాల విద్యార్ధులు అధికంగా వస్తారు.

ఒక్క రోజు ట్రెక్కింగ్ ఆనందాలు టుంకూర్

చిత్ర కృప : Manjeshpv

సిద్ద గంగ

సిద్ద గంగ కొండలు క్యాడ సాంద్ర కు సమీపంలో కలవు. ఇక్కడ కల సిద్దగంగా మఠం అందరకూ చిరపరిఛితం. దేవాలయంకల ఈ కొండ యాత్రికులకు ఒక వినోద ప్రదేశంగా కూడా వుంటుంది. దీనినే రామదేవర బెట్ట అని కూడా అంటారు.

నిజగల్ బెట్ట అనేది మరొక ట్రెక్కింగ్ ప్రదేశం. నిజగల్ బెట్ట సిద్ద గంగ కు సమీపంగా వుంటుంది కనుక, ఒకే రోజులో మీ ఎనర్జీ స్థాయి, స్పీడ్ లను బట్టి రెండిటినీ చూడవచ్చు.

మొత్తంగా చూస్తె, మీరు మీ వీక్ ఎండ్ విహారాలకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు. బెంగుళూరు సమీపంలోని టుంకూర్ ట్రెక్కర్ల కు ప్రియమైన అనేక ప్రదేశాలను కలిగి వుంది. ఈ ట్రెక్కింగ్ ప్రదేశాలు మీ లోని సాహసికతకు ఒక పరీక్ష గా నిలుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X