Search
  • Follow NativePlanet
Share
» »శకుని ఆలయం ఉందని మీకు తెలుసా..?

శకుని ఆలయం ఉందని మీకు తెలుసా..?

మహాభారత యుద్ధం జరిగే సమయంలో శకుని తన మేనళ్లళ్లు తో సహా దేశమంతా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట. ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలను పంచుకున్నారట.

By Venkatakarunasri

మహాభారత యుద్ధం జరిగే సమయంలో శకుని తన మేనళ్లళ్లు తో సహా దేశమంతా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట. ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలను పంచుకున్నారట. అందుకే దీన్ని పాకుథేశ్వరం అనేవారనీ తర్వాత పవిత్రేశ్వరంగా మారిందని చెబుతుంటారు.

శకుని పరమ శివభక్తుడు. మహాభారత యుద్ధం తర్వాత ఇక్కడికే వచ్చి పరమశివుడ్ని ప్రార్థించి మోక్షం పొందాడని వీరి నమ్మకం. ఆ విధంగా భగవాన్ శివుని అనుగ్రహం పొందాడు కనుక ఈ తెగవారు ఇతగాడ్ని భగవాన్ శకుని అనే పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఏటా కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. మరో విశేషమేమంటే శకుని ఆలయానికి చేరువనే దుర్యోధన ఆలయం కూడా ఉండటం.

శకుని ఆలయం ఉందని మీకు తెలుసా..?

 శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

ఎక్కడ వుంది?

అది కేరళలోని కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం. అక్కడ ఒక పురాతనమైన కట్టడం వుంది.చాలా పాత కాలం నాటి కట్టడం ఇది. దీన్నే శకుని ఆలయం అంటారు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

మహాభారతం చదువుతూవుంటే మహాప్రతినాయకుడిగా అనిపిస్తూవుంటాడు శకుని.అతనిలో వున్నవన్నీ తామసగుణాలే.అయితే అంత చెడ్డ లక్షణాలు వున్న శకునిలో కూడా సాత్వికలక్షణాలు వున్నాయని
కేరళలో కురువార్ తెగవాళ్ళు బలంగా నమ్ముతూవుంటారు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

చాలాకాలం క్రిందటే నిర్మితమైన ఈ శకుని ఆలయం బాగోగులన్నీ ఈ తెగవాళ్ళే ఇప్పటికీ చూసుకుంటూవుంటారు. ఈ ఆలయంలో శకుని కూర్చున్న సింహాసనం వుంది.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

ఈ ఆలయంలో పూజలుగట్రా చేయరు.అష్టోత్తరసహస్రనామావళి లాంటివికూడా వుండవు. మహాభారత యుద్ధం జరిగే సమయంలో శకుని తన మేనల్లుళ్ళతో సహా దేశమంతటా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలను పంచుకున్నారట. అందుకే దీనిని పాకుతేశ్వరం అనే వారని,తరువాత ఇది పవిత్రేశ్వరంగా మారిందని చెపుతూవుంటారు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని పరమశివభక్తుడు.మహా భారత యుద్ధం తరువాత ఇక్కడికే వచ్చి పరమశివుని ప్రార్ధించి మోక్షం పొందాడని వీరి నమ్మకం.ఆవిధంగా భగవాన్ శివుని అనుగ్రహం పొందాడు గనుక ఈ తెగవారు ఇతన్ని భగవాన్ శకుని అని పిలుస్తారంట.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

ఈ ప్రాంతంలో ఏటా కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతూంటాయి. మరో విశేషం ఏమిటంటే శకుని ఆలయం చేరువనే దుర్యోధనుని ఆలయం కూడా వుంది.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

వ్యాస మహాభారతంలో శకుని యుద్ధం చేస్తూ పాండవుల్లో చిన్నవాడైన సహదేవుని చేతిలో మరణిస్తాడు.శకుని కొడుకు ఉలుకుడు నేలకొరుగుతాడు. దీంతో కొడుకుని చంపిన సహదేవునిపై పిచ్చికోపం వచ్చి శకుని ఆయుధం పట్టుకుని సహదేవునిపైకి ఉరుకుతాడు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

కొంతసేపు వీరిద్దరిమధ్య యుద్ధం జరుగుతుంది.కానీ సహదేవుని దాటికి తాళలేక లొంగిపోతాడు. ఆ వెంటనే శకుని తలని సహదేవుడు నరికేస్తాడు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

అంటే మహాభారతయుద్ధసమయంలోనే శకుని చనిపోయాడు.మరి అలాంటి శకుని కురువార్ తెగవాళ్లకు శకుని చివరి దశలో మహాశివుడ్ని ప్రార్ధించి పవిత్రేశ్వరంవద్ద మోక్షం పొందటమేమిటని సందేహం కలగకమానదు. మరి ఇందులో వున్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ తెలీదు.

PC:youtube

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

శకుని మామను అక్కడ దేవుడిగా పూజిస్తారట..

ఎలా చేరాలి

హైదరాబాదు నుండి అనంతపురం, బెంగుళూరు, మదురై మీదుగా పవిత్రేశ్వరం చేరవచ్చును.

హైదరాబాదు నుండి విజయవాడ, నెల్లూరు, చెన్నై, మధురై మీదుగా పవిత్రేశ్వరం చేరవచ్చును.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X