Search
  • Follow NativePlanet
Share
» »మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం.

By Venkatakarunasri

ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను "సప్త పురిస్"(ఏడూ పవిత్ర నగరాలు) లో ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలలో భావించబడే ఏకైక నగరం ఈ ద్వారక. పౌరాణిక సంబంధం భగవంతుడు శ్రీ కృష్ణుడు మేనమామ మథుర రాజు అయిన కంసుని చంపటం వల్ల, కంసుని మామ అయిన జరాసంధునికి యాదవులకు ఎడతెగని శత్రుత్వం ఏర్పడింది. జరాసంధుడు కృష్ణుని చంపటానికి పదిహేడు సార్లు దాడి చేసాడు. ఈ సందర్భం లో శ్రీ కృష్ణుడు యాదవులను భవిష్యత్తు లో ఇటువంటి దాడులనుండి తప్పించటానికి గిర్నార్ పర్వతాల గుండా ద స్టేట్ అఫ్ సౌరాష్ట్ర లేదా గుజరాత్ కు తీసుకు వెళ్ళాడు. యుద్దాన్ని వదిలి నందుకు శ్రీ కృష్ణుడు రంచ్చోద్రై (యుద్ద భూమిని వదిలిన వాడు) అని అభిమానంగా పిలువబడ్డాడు.

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మథుర ని వదిలి పోర్ట్ ఒఖ కి దగ్గరలోని బెయ్ట్ ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించటానికి పూనుకొన్నాడు. ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రాముఖ్యమైన జీవిత భాగాన్ని గడిపాడు. శ్రీ కృష్ణుని మరణానంతరం పెద్ద వరద ఈ నగరాన్ని ముంచేసింది. ద్వారక ఆరు సార్లు మునిగిపోయిందని నమ్ముతారు. ఇప్పటి ద్వారకని అందుకే ఈ ప్రాంతం లో ఏడవ సారి నిర్మిత నగరంగా భావిస్తారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

పవిత్ర నగరం ద్వారకకు ఆ పేరు సంస్కృతమ్ లోని 'ద్వార్' అనే పదం, అంటే తలుపు అనే అర్ధం నుండి వచ్చింది, ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. విష్ణు భక్తులకు ఈ నగరం ఒక విశిష్టమైనది. ఇక్కడి జగత్మందిర్ దేవాలయం లో ద్వారకాదీష్ (శ్రీ కృష్ణుడు)ని పూజిస్తారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన నాగేశ్వర జ్యోతిర్లింగ కూడా ఈ ద్వారకలో ఉన్నది. బెయ్ట్ ద్వారకభగవంతుడు శ్రీ కృష్ణుడు తన రాజ్యాన్ని స్థాపించిన ప్రదేశంగా భావించే బెయ్ట్ ద్వారక గల్ఫ్ అఫ్ కచ్ లో నెలకొని ఉన్న ఒక చిన్న ద్వీపం. ఒఖ ఓడ రేవు కు మునుపు ముఖ్య రేవుగా ఈ ద్వీపం ఉండేది. ద్వారక నుండి ఇక్కడికి చేరటానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టికి చేరుకొని అక్కడ నుండి పడవలో ఈ ప్రదేశానికి వెళ్ళాలి.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

క్రీ.పూ. 3 వ శతాబ్దపు చారిత్రిక అవశేషాలు ఇక్కడ గుర్తించబడ్డాయి. శంఖసురుని భగవంతుడు విష్ణువు సంహరించిన ప్రదేశంగా కూడా బెయ్ట్ ద్వారక ఇతిహాసం చెపుతుంది. అందుకే ఈ ద్వీపం బెయ్ట్ శంఖోధర అని కూడా పిలువబడుతుంది. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని చూడవచ్చు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ఇక్కడ పిక్నిక్ లకు, కాంపింగ్లకు మరియు సముద్ర విహారానికి వెళ్ళవచ్చు. భౌగోళిక విశేషాలుగుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలో ఉన్నది ఈ ద్వారకా నగరం. గుజరాత్ ద్వీపకల్పం లోని పశ్చిమ భాగాన ఉన్నది ద్వారక.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

శ్రీకృష్ణుడితో ఎలియన్స్ యుద్ధం చేసారా. మహాభారతం నిజంగా జరిగిందా.దానిలో చెబుతున్నట్లుగా ద్వారకానగరాన్ని నిజంగా శ్రీకృష్ణుడే నిర్మించాడా?అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.అయితే ఈ మధ్యనే సముద్రగర్భంలో ఒక నగరం దొరికింది.దానినే ద్వారకానగరంగా చెబుతున్నారు.సైంటిస్టులు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

సైంటిస్టులు. దీనిపై పరిశోధన చేసి అది ద్వారకానగరంఅని తేల్చారు.ఈ నగరానికి అనేక ద్వారాలు వుండటంవలన దీనికి ద్వారక అనే పేరు వచ్చిందని చెబుతున్నారు.యాదన్నకు ద్వారకరాజధాని అయిన ద్వారకనగారాన్ని నిర్మించింది శ్రీకృష్ణుడు అనే విషయం భాగవతగ్రంథంగా తెలుస్తోంది.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడటానికి సూరసామ్రాజ్యానికి చెందిన యదుప్రముఖులతో కలిసి శ్రీకృష్ణుడు సముద్రగర్భంలో వున్న ద్వీపాలసమూహాన్ని ఎంచుకుని ఈ నగరనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేసి సూరసేనపురాజధాని మధురనుండి ద్వారకకు తరలిస్తాడు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

తన సోదరుడైన శిశు పాలుడ్ని శ్రీకృష్ణుడు సంహరించినందుకు ప్రతీకారంగా సాల్వుడు ఒకరోజు ద్వారకపై దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధంలో వ్యవహరించిన తీరు శ్రీకృష్ణుడితో పాటు అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ యుద్ధంలో సాల్వుడు ఏలియన్స్ వాడే యుద్ధవిమానాలని,యంత్రాల్ని వుపయోగించాడని చెబుతున్నారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

వీటిద్వారానే సాల్వుడు ద్వారకానగరంపై అగ్నివర్షంకురిపించినట్టుగా కొన్ని ఆధారాలు వున్నాయి. అందుకే ద్వారకలో సగ భాగం కాలిపోయిందని చెపుతూవుంటారు. ఈ యుద్ధం జరిగిన కొన్నాళ్ళకే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినట్లుగా కొన్ని ఆధారాలు వున్నాయి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడో వెంటనే ద్వారకానగరం సముద్రంలోకి జారిపోయిందని చెబుతున్నారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ఇక్కడ ఒక్కవిషయం గురించి అందరికీ చాలా అనుమానాలు వున్నాయి.అసలు ఎలియన్స్ వాడే యుద్ధవిమానాలు, యంత్రాలు సాల్వుడికి ఎక్కడనుంచొచ్చాయ్ ఆ టెక్నాలజిసాల్వుడికి ఎలా తెలిసిందనే అనుమానాలు.అంటే సాల్వుడు శ్రీకృష్ణుడితో యుద్ధంచేయటానికి ఎలియన్స్ సహాయం తీసుకున్నాడేమోనని అందరూ అనుకుంటున్నారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

దీనిని బట్టి చూస్తే ఆకాలంలో సాల్వుడితో పాటు చాలామందికి ఎలియన్స్ తో సంబంధంవున్నట్టుగా కొందరు చెబుతున్నారు. ఇదంతా నిజమోకాదో ఇప్పటికీ ఎవ్వరూ తేల్చిచెప్పలేకపోతున్నారు. అయితే ఒక్కటిమాత్రం నిజం.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

సాల్వుడితో ఎలియన్స్ కి సంబంధాలు లేకపోతే ఎలియన్స్ వాడే యుద్ధవిమానాలు, యంత్రాలు ఎక్కడ్నుంచొచ్చాయ్ అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.ఈ రహస్యాన్ని భవిష్యత్తులో ఎవరైనా చేధిస్తారేమోచూద్దాం.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ద్వారకా లోని ముఖ్య దేవాలయం అయిన ఈ ద్వారకాదిష్ దేవాలయం జగత్ మందిర్ (విశ్వ పుణ్యక్షేత్రం ) గా కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుడి రాజ్యం అయిన ద్వారకా మహాభారత యుద్ధం తరువాత నీటి లో మునిగిన తర్వాత శ్రీ కృష్ణుని ముని మనవడు గా చెప్పబడే వజ్రనాభుని చే నిర్మితమయినదిగా చెప్తారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ఈ దేవాలయం చుట్టుత ఉన్నటువంటి కళాత్మక భవనం 16 వ శతాబ్దంలో నిర్మితమైనదిగా చెప్తారు.ఈద్ దేవాలయపు 43 మీటర్ల ఎత్తుఅయిన శిఖరం , దాని పైన సూర్య చెంద్రుల చిత్రాల జండా 10 కిలో మీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి. ఈద్ దేవాలయం మృదువయిన లైం స్టోన్ తో నిర్మితమైనది.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

దేనికున్న రెండు ద్వారాలు స్వర్గ ద్వార మరియు మోక్ష ద్వార గుండా భక్తులు లోనికి మరియు వెలుపలికి చేరుకుంటారు. ఈ దేవాలయం భక్తులకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9.30 వరకు, మధ్యలో 12.30 నుండి 5 గంటల వరకు విరామంతో భక్తులకు దర్సనానికి అందుబాటులో ఉంటుంది.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

పర్యాటక ఆకర్షణలు ద్వారకా మరియు బెయ్ట్ ద్వారకా లోని అనేక పవిత్ర దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రతి ఏడూ అనేక మంది పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ద్వారకదిశ దేవాలయం, నాగేశ్వర జ్యోత్ర్లింగం దేవాలయం, మీరాబాయి దేవాలయం, శ్రీ కృష్ణ దేవాలయం, హనుమంతుని దేవాలయం మరియు బెయ్ట్ ద్వారకా లోని కచోరియు మొదలగు ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశాలు ద్వారకాలో ఉన్నాయి. ఇటువంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కల ద్వారకా అప్పటికి ఎప్పటికీ గుజరాత్ లోని ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్నది.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ఇక్కడ చూడవలసినవి

ఘుమ్లి, ద్వారక

క్రీ.శ. 7 వ శతాబ్దం లో జేత్వ సాల్ కుమార్ చే స్థాపించబడిన ఘుమ్లి అనే కుగ్రామం బర్ద హిల్స్ పాద ప్రాంతాన ఉంది. గుజరాత్ లో ని చాలా అందమైన దేవాలయాలకు నెలవైన ఈ ప్రదేశం ఒకప్పుడు జేత్వ వంశీకులకు పురాతన రాజధానిగా ఉండేది. ఇక్కడి సోలంకి వంశీకుల నవ్లఖ టెంపుల్ గుజరాత్ లో ని పురాతన సూర్య దేవాలయం గా చెప్పబడుతుంది. వికి వావ్ అనే దిగుడు బావి కూడా ఇక్కడ ఉన్నది. గుజరాత్ గవర్నమెంట్ మరియు అర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పురాతన చారిత్రక నగరం యొక్క పునరుద్ధరణ బాధ్యతలు చేపడుతున్నాయి.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

నాగేశ్వర్ జ్యోతిర్లింగా టెంపుల్, ద్వారక

ద్వారకకు మరియు బెయ్ట్ ద్వారకా కు చేరే మార్గం లో సౌరాష్ట్ర తీరాన ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం ఉన్నది. ప్రపంచం లోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ దేవాలయం ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగానే కాకుండా ముఖ్య పర్యాటక ప్రదేశంగా కూడా ఉన్నది. ఈ ప్రదేశంలో ఒక భూగర్భగుడి ఉన్నది. ఈ దేవాలయం లో పెద్ద ఈశ్వరుని విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం చుట్టూ చూడచక్కని ఉద్యానవనం ఉంది. శివరాత్రి సమయాన ఈ దేవాలయం తప్పక దర్శించదగ్గది.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

భలక తీర్థ & దేహోత్సర్గ్, ద్వారక

ఈ ప్రదేశం లో శ్రీ కృష్ణుడు ఒక వేట గాని బాణం చేత కాలి పై గాయం చేయబడి తన అవతారం చాలిస్తాడు. ఈ టెంపుల్ ఆవరణ లో శ్రీ కృష్ణుని గుర్తుగా ఒక తులసి మొక్క కలదు. వేటగాడు, శ్రీ కృష్ణుని కదలికను ఒక జింక కదలికగా భావించి బాణం వేస్తాడు. ఇక్కడే శ్రీ కృష్ణుడి దేహాన్ని సమాధి చేసిన దేహోత్సర్గ్ తీర్థ్ అనబడే స్థలం కూడా కలదు. ఇక్కడ కల సోమ నాథ్ టెంపుల్ కు ఒక కిలో మీటర్ దూరం లో ఒక గుహ కలదు. శ్రీ కృష్ణుడి అవతార సమాప్తి తో బలరాముడు ఒక సర్ప రూపం లో ఈ గుహ లోకి వెళ్లి అదృశ్య మయ్యాడని చెపుతారు.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

గోమతి ఘాట్ టెంపుల్స్, ద్వారక

పవిత్రమైన ద్వారకా నగరం ఆధ్యాత్మిక విశిష్ట ప్రదేశాలతోఅలాగే వాటికి సంబంధించిన ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ విశేషాలని తెలుసుకుంటూ అలాగే ఈ నగరం యొక్క అందాలని కూడా ఆస్వాదించడానికి గోమతి నదిలో పర్యాటకులు పడవ ప్రయాణం చెయ్యవచ్చు. ఈ నదీ తీరాన ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దేవాలయాలలో శివుడు, కృష్ణుడు, రాముడు మరియు శ్రీకృష్ణుడి విశ్వాసపాత్రుడైన స్నేహితుడు సుధాముడు దేవాలయాలు ఉన్నాయి. కొన్ని యుగాలుగా ఈ దేవాలయాలు పుణ్యక్షేత్రాలుగా ప్రఖ్యాతి గాంచాయి.

PC:youtube

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం

జామ్నగర్ నుండి ద్వారక కు వెళ్ళే రాష్ట్ర హైవే పైఉన్న ద్వారక నగరం బస్సుల ద్వారా జామ్నగర్ మరియు ఆహ్మేదాబాద్ నుండి సులభంగా చేరుకోవచ్చు. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా ఈ పవిత్ర నగరానికి రాష్ట్రం నలుమూలల నుండి చేరుకోవచ్చు. అంతే కాక, విలాసవంతమైన పర్యాటక బస్సుల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

రైలు మార్గం

అహ్మదాబాద్-ఒఖ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ వద్ద ఉన్న ద్వారకా స్టేషన్ రాజ్కోట్, ఆహ్మెదబద్ మరియు జామ్నగర్ వంటి ప్రదేశాలను కలుపుతుంది. అంతే కాక, కొన్ని రైళ్ళు సూరత్, వదోదర, గోవా, కర్ణాటక, ముంబై మరియు కేరళ వరకు వెళ్తాయి.

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

వాయు మార్గం

ద్వారకాకి 127 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వదేశీ విమానాశ్రయం జామ్నగర్ లో ఉంది. అక్కడి నుండి పర్యాటకులు టాక్సీ ద్వారా ద్వారకకి చేరుకోవచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విరివిగా విమానాలు జామ్నగర్ కు అందుబాటులో ఉన్నాయి.

<strong>తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?</strong>తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

<strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?</strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?

<strong>భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !</strong>భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X