Search
  • Follow NativePlanet
Share
» »నాగార్జున సాగర్ డ్యాం గురించి బయటపడిన కొన్ని భయంకరమైన నిజాలు?

నాగార్జున సాగర్ డ్యాం గురించి బయటపడిన కొన్ని భయంకరమైన నిజాలు?

తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానది పై నిర్మించబడ్డ ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు.

By Venkatakarunasri

ఈ వ్యాసంలో మనం నాగార్జున సాగర్ గురించి తెలుసుకుందాం. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానది పై నిర్మించబడ్డ ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు.అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి ఆ మొత్తం ప్రాజెక్టుకు అక్కడి వూరికి కూడా వర్తింపజేయటం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు పొడవులో మొదటిది.దీని నిర్మాణ కాలము 1955 - 1967. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 490 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్ ద్వారా నల్గొండ, ఖమ్మం, కృష్ణ, మరియు గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించు చున్నది. అంతేగాక ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ఎక్కడ వుంది?

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్హున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో "నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలువబడే మ్యూజియంలో భద్ర పరచారు. ఆ మ్యూజియాన్ని నాగార్జునకొండ మ్యూజియం అంటారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నందికొండ ప్రాజెక్టు

ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అనగా నైజాము పరిపాలన కాలములోనే 1903 లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

భారత దేశ రెండవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది. గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జున కొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేయడము జరిగింది. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శన కొరకు పెట్టారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది. సాగునీటి సరఫరా కోసమే కాక, విద్యుదుత్పత్తి కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రధాన ఆనకట్ట రాతి కట్టడము.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని జవహర్ కాలువ గాను, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జునకొండ మ్యూజియం

నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియంలో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ఇతర దర్శనీయ స్థలాలు

పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. వాగార్జున కొండ మ్యూజియం కూడా తప్పక చూడదగినది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

సాగరమాత దేవాలయం

నాగార్జున సాగర్ దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉంది.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జునకొండ మ్యూజియం

నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియంలో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.

దగ్గరి మరికొన్ని స్థలాలు

ఎత్తిపోతల జలపాతము, అనుపు, మాచర్ల

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

గగన విహారం

బౌద్ధులు సాగర్‌ను పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు. విదేశీయులు రహదారి మార్గాన వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ట్రాఫిక్‌ సమస్యలతోపాటు, సమయం ప్రధాన సమస్యగా మారింది.నాగార్జనకొండ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, ఎత్తిపోతల జలపాతం, అనుపు పురావస్తు సంపద,జలాశయ అందాలు ప్రత్యేక ఆకర్షణ.

PC: youtube

 నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

నాగార్జున సాగర్ డ్యాం గురించి భయంకరమైన నిజాలు

అందువలన పర్యాటకశాఖ సాగర్‌ పరిధిలో 500 ఎకరాల్లో మెగా పర్యాటకం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాదు‌, విజయవాడ, వైజాగ్‌తోపాటు బెంగుళూరు, ఢిల్లీ, బొంబాయి, పూణె వంటి నగరాల నుంచి నేరుగా హెలికాప్టర్ లో సాగర్‌కు పర్యాటకులను తరలించాలని ప్రతిపాదించింది.ప్రస్తుతం విమాన శిక్షణ కోసం నాగార్జున సాగర్‌లో చిన్నపాటి విమానశ్రయం ఉంది.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X