Search
  • Follow NativePlanet
Share
» »క్రీ.పూ 573 సముద్రం నుండి బయటపడ్డ కేరళ !

క్రీ.పూ 573 సముద్రం నుండి బయటపడ్డ కేరళ !

కేరళ అనేది నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి.

By Venkatakarunasri

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళ అనేది నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ. కొత్త రాతియుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు. అంచేత క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి, ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు (తమిళకం లోని భాగం) ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తూంది.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

చేర రాజులు వర్తకంమీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపారస్థావరాలు ఏర్పరచుకొన్నారు. ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాలనుండి తప్పించుకోవడానికి యూదులు, క్రైస్తవులు వంటివారు ఇక్కడికి వలస వచ్చారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం, మప్పిల ముస్లిమ్ సమాజం వంటివి రూపు దిద్దుకొన్నాయి. యూదులు క్రీ.పూ. 573లో ఇక్కడకి వచ్చి ఉండవచ్చునని అంచనా. అపోస్తలు థామస్ క్రీ.శ. 52లో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవబోధనలు ఆరంభించాడని తెలుస్తున్నది.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కాని సుమారు క్రీ.శ.345 లో యూదుల వలసకు (నస్రాని-యూదులు) కచ్చితమైన ఆధారం క్నాయి తోమా రాక. 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు. 1498లో వాస్కో డ గామా వచ్చిన తరువాత లాభసాటి సుగంధ ద్రవ్యాల వర్తకంలో ఆధిపత్యంకోసం పోర్చుగీసువారు స్థానికులను, వారి వర్తకాన్ని అదుపుచేయడానికి ప్రయత్నించారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు. ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళకు ఆ పేరు ఎలా వచ్చింది?

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందు కనే కేరళను "God's own country" భగవంతుని రాజ్యంగా అంటారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

డచ్చివారికి, పోర్చుగీసువారికి జరిగిన యుద్ధాలలో 1741లో డచ్చివారిది పైచేయి అయ్యింది. 1766లో మైసూరుకు చెందిన హైదర్ ఆలీ కేరళ ఉత్తరభాగమైన కోజికోడ్‌ను జయించాడు. 18వ శతాబ్దంలో హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్‌కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల ఫలితంగా మలబార్జిల్లా, దక్షిణ కెనరాలు 1790లో ఆంగ్లేయుల పరమయ్యాయి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1791, 1795లలో కంపెనీవారు కోచి, తిరువాన్కూరు సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మలబార్, దక్షిణకెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడన్సీలో భాగాలయ్యాయి.కేరళలో బ్రిటిష్ అధికారానికి ప్రతిఘటనలు తక్కువనే చెప్పవచ్చు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1946 పున్నపర-వయలార్ తిరుగుబాటు అలాంటివాటిలో ఒకటి. కాని నారాయణ గురు, చత్తంపి స్వామిగళ్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడచాయి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహం వీటిలో చెప్పుకొనదగినది. 1936లో తిరువాన్కూర్ చిత్ర తిరుణాల్ బాల రామ వర్మ అన్ని కులాలకూ ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు. కొచ్చిన్, మలబార్‌లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళలోని 9,400 చ.కి.మీ. అడవులలో, ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు వృక్షజాతులున్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. సస్థంకొట్ట చెరువు, వెంబనాడ్ చెరువు - ఇవి రెండు ప్రపంచంలో గుర్తింపబడిన తేమ పర్యావరణ ప్రదేశాలు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

నీలగిరి జీవ పరిరక్షణా నిలయం కూడా ఇదే గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ఆయుర్వేదము, సిద్ధ వైద్యము, యునాని, ఇంకా కొన్ని (ప్రస్తుతం కనుమరుగవుతున్న) సాంప్రదాయిక, నాటు వైద్యవిధానాలు - కలారి, మర్మచికిత్స, విషవైద్యం వంటివి ఇంకా కేరళలో వాడబడుతున్నాయి. ఈ విజ్ఙానం గురుకుల విద్యా విధానం ద్వారా శిష్యులకు సంక్రమిస్తున్నది. వీటిలో కొన్ని మూలికలు, మంత్రాల కలగలుపు విధానాలు. వైద్య పర్యాటకులు కేరళ ప్రత్యేక వైద్యవిధానాల చికిత్సకోసం కేరళకు వస్తుంటారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

కేరళ భారతదేశం లోనే ప్రముఖ పర్యాతక ప్రదేశం. ప్రముఖ కృష్ణ మందిరం గురువాయూర్, అయ్యప్ప స్వామి, తిరువనంత పురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను చూడ టానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగె మున్నార్ టీ తోటలు, అలెప్పి లోని బాక్ వాటర్స్, అద్భుత మైన బీచ్ లు, జల పాతాలు చూడ టానికి దేశ విదేశాల నుండి ఎందరో వస్తుంటారు.

PC:youtube

కేరళ టూరిజం

కేరళ టూరిజం

రవాణా సదుపాయాలు

8 జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు) కేరళలో ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతున్నది. NH 47, NH 17ల ద్వారా కేరళ పశ్చిమతీరం దాదాపు అంతా కలుపబడింది.

PC:youtube

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

హైదరాబాద్ నుండి కేరళ చేరుటకు కర్నూలు, అనంతపురం, బెంగుళూరు, కోయంబత్తూరు మీదుగా 16గంలు పడుతుంది.

హైదరాబాద్ నుండి ఒంగోలు, కావలి, తిరుపతి, వెల్లూరు మీదుగా 20గం లు పడుతుంది.

విమానమార్గంలోనైతే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేరళలోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుటకు 4గంల సమయం పడుతుంది.

PC:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X