Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల అతి ప్రాచీన ఆలయం !!

ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల అతి ప్రాచీన ఆలయం !!

By Super Admin

తిరునల్లార్ శనేశ్వరాలయం సైన్స్ కే సవాల్ !తిరునల్లార్ శనేశ్వరాలయం సైన్స్ కే సవాల్ !

మీకు తెలుసా ?? పురాతన బ్రహ్మ దేవుని ఆలయాలలో ఒకటి మన నవ్యాంధ్ర(ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రంలో ఉందని ..?? అసలు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో ... ఆ ఆలయం పూర్వాపరాలు ఏమిటో ఇదిగో ఇక్కడ చదవండి.

ఇది కూడా చదవండి : కోటివేల్పుల అండ ... కోటప్పకొండ !

గుంటూరు నుండి తెనాలి వెళ్లే దారిలో చేబ్రోలు అనే గ్రామం ఉంది. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి సుమారుగా అటుఇటు 32 కి. మీ. దూరంలో ఉండి గంటలో చేరుకొనే విధంగా ఉంటుంది. ఈ చేబ్రోలు గ్రామం ఇక్కడున్న బ్రహ్మ ఆలయం తో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం గుంటూరు జిల్లాలో నే కాక రాష్ట్రంలోనే పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఈ ఆలయ ప్రాంగణంలో రెండువేల సంవత్సరాల క్రితం అనగా క్రీ. శ. 14 వ శతాబ్ధంలో నిర్మించిన ఆలయాలు సైతం ఉన్నాయి. ఆ ఆలయం కోనేరు మధ్యలో నిర్మించబడి, నాలుగువైపులా శివ, విష్ణు,శక్తి దేవాలయాలతో అలరారుతుంది. ఇక్కడి విశేషాలు, స్థల పురాణం పరిశీలిస్తే ...

ఇది కూడా చదవండి : గుంటూరు పర్యాటక ప్రదేశాలు !!

ముందుగా స్థల పురాణం

ముందుగా స్థల పురాణం

భృగు మహర్షి " బ్రహ్మకు ఎక్కడా పూజింపబడవని " ఇచ్చిన శాపం కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం ,కాశీ లో ఒక ఆలయం, ఇక్కడ మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మ కు ఆలయాలు ఉన్నాయి.

Photo Courtesy: Adityamadhav83

విశేషాలు

విశేషాలు

ఇక్కడ ఉన్న ఆలయం బ్రహ్మ దేవునికి ఉన్న అతి కొద్ది ఆలయాలలో ఒకటి. బ్రహ్మకు ప్రత్యేక రూపం లేక శివలింగం రూపంలోనే, నాలుగువైపులా అందంగా చెక్కబడిన నాలుగు బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు.

Photo Courtesy: Adityamadhav83

శిల్ప సంపద

శిల్ప సంపద

కాలగర్భంలో ఎన్నో ఆలయాలు భూమిలో కలిసిపొయినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభవాన్ని చాటిచెప్పే దేవాలయాలింకా ఇక్కడ ఉన్నాయి. పల్లవ, చాళుక్యుల, చోళుల శిల్ప కళా వైభవానికి ఇక్కడి ఆలయాలు వేదికగా ఉన్నాయి.

Photo Courtesy: Adityamadhav83

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం

సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.

Photo Courtesy: teluguvignanamvinodam

గర్భగుడి

గర్భగుడి

ఇక ఆలయ గర్భగుడి విషయానికి వస్తే, నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగుల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు.

Photo Courtesy: teluguvignanamvinodam

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం

అప్పట్లో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాన్ని ఏనుగుల మీద ఎర్రటి ఇసుకను తీసుకొనివచ్చి కట్టారన్నది చారిత్రక కథనం. ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళుతుంటారు. కోనేరులో స్వామి వారి దేవాలయం ఉన్నా నేటికీ చెక్కుచెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.

Photo Courtesy: teluguvignanamvinodam

మరో 9 ఆలయాలు...

మరో 9 ఆలయాలు...

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయసముదాయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్రహమూర్తులు, నాగేశ్వరాలయాలు, ఒక నంది విగ్రహం పక్కపక్కనే ఉన్నాయి.

Photo Courtesy: teluguvignanamvinodam

మరో 9 ఆలయాలు...

మరో 9 ఆలయాలు...

ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ... బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.

Photo Courtesy: teluguvignanamvinodam

భీమేశ్వర ఆలయం

భీమేశ్వర ఆలయం

క్రీ.శ. రెండవ శతాబ్ధంలో నిర్మించారని భావిస్తున్న బీమేశ్వర ఆలయానికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడే పన్నెండడుగుల నటరాజ విగ్రహం కూడా ఉండేదట..!

Photo Courtesy: teluguvignanamvinodam

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయ సముదాయంలో గల పురాతన శివుని ఆలయం

Photo Courtesy: Adityamadhav83

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయ సముదాయంలో గల రాజ్యలక్ష్మి ఆలయం

Photo Courtesy: Adityamadhav83

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

శివాలయ గోపురము మరియు ధ్వజ స్తంభం

Photo Courtesy: Adityamadhav83

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

ఆలయ దృశ్యాలు మరిన్ని ఫొటోలతో...

కోనేరు నిండినపుడు బ్రహ్మేశ్వర ఆలయ దృశ్యం

Photo Courtesy: Pavandpr

చేబ్రోలు ఎలా చేరుకోవాలి ??

చేబ్రోలు ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

చేబ్రోలు కు 62 కి. మీ. దూరంలో గల విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల మీద చేబ్రోలు కి చేరుకోవచ్చు.

రైలు మార్గం

చేబ్రోలులో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి విజయవాడ, గుంటూరు వంటి దగ్గరి నగరాలకు ప్రయాణించవచ్చు. లేకుంటే 32 కి. మీ. దూరంలో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ లో గాని, 60 కి. మీ. దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో గాని దిగి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుండి బస్సులు చేబ్రోలు కి వస్తుంటాయి. గుంటూరు బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. తెనాలి నుండి కూడా చేబ్రోలు కి బస్సులో ప్రయాణించవచ్చు.

Photo Courtesy: GSarkar

ముగింపు

ముగింపు

ఇటువంటి అద్భుత కళాఖండాలను, కనుమరుగైన సంస్కృతి - సంప్రదాయాలను గుర్తుకు తెప్పించే ఈ చేబ్రోలు (101 గుడులు) ను పరిరక్షించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం.

Photo Courtesy: Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X