Search
  • Follow NativePlanet
Share
» »ఊటీ తోటలు - ఆనందాల నిలయం!

ఊటీ తోటలు - ఆనందాల నిలయం!

ఊటీలో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలు హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఊటీ సమ్మర్ ఫెస్టివల్‍‌కు పెట్టింది పేరు. అలాగే మే నెలలో ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఊటీ పరిసర ప్రాంతాలలో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్‌ డాన్స్‌, వెక్‌ హిల్స్‌, స్నోడెన్‌ పీక్‌, కూనూరు, డాల్ఫిన్స్‌ నోస్‌, లాంబ్స్‌ రాక్‌, లాన్‌ ఫాల్స్‌, సెయింట్‌ కేధరిన్‌ ఫాల్స్‌, సిమ్స్‌ పార్క్‌, సిమ్స్‌ పార్క్‌, కోటగిరి, కొడనాడ్‌ పాయింట్ తదితరాలు మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు.

ఊటీ చరిత్రను చూస్తే.. పూర్వకాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆ తరువాత గంగరాజులు, 12వ శతాబ్దంలో హొయసాలల వంశ రాజైన విష్ణువర్ధనుడి సామ్రాజ్యాలలో భాగమయ్యాయి. చివరగా టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి ఆ తరువాత 18వ శతాబ్దంలో తెల్లవారి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి.ఊటీ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడకు ప్రతి ఏటా లక్షలాది పర్యాటకులు వచ్చి ఆనందిస్తారు. నీలగిరి హిల్స్ చే చుట్టుముట్టబడిన ఊటీ పట్టణం ఒక సుందర దృశ్యాల హిల్ స్టేషన్ ప్రకృతి యొక్క అనేక అద్భుత దృశ్యాలను చూపుతుంది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రదేశం ఒక మనసును రంజింప చేసే టూరిస్ట్ స్పాట్. బహుశా. మీరు కురుంజి పూవుల గురించి వినే వుంటారు. ఈ కురుంజి పూవులు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూతకు వస్తాయి. ఈ కొండలన్నీ ఇక్కడ కల ప్రత్యేక కురింజి పూవులు పూస్తే, కొండలు నీలపు రంగులోకి మారిపోతాయి. చూసే వారికి కన్నుల పండుగగా వుంటుంది. ఈ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శనకు వస్తారు.

కురుంజి పూవులు

ఇక్కడ కల సుందర ప్రదేశాలు మరియు ఊటీ సరస్సు మాత్రమే కాక, కొన్ని సుందరమైన కురుంజి పూల తోటలు కూడా కలవు. మన ఈ వ్యాసంలో అటువంటి అందమైన గార్డెన్ లు ఏవో పరిశీలిద్దాం. సుమారు 22 హెక్టార్ల విస్తీర్ణం కల ఈ ప్రదేశం దోడ్డ బెట్ట శిఖర వాలులలో నిర్మించ బడింది. ఇది ఊటీలో మరొక ఆకర్షణ కాగలదు. ఈ గార్డెన్ లో ఎన్నో వెరైటీల వృక్షాలు కలవు. అరుదైన లిల్లీ మొక్కలు, పూల మొక్కలు, అరుదైన చెట్లు కలవు. వాటిలో మంకీ పజిల్ త్రీ ఒకటి. దీనికి ఈ పేరు అక్కడ కల కోతులు కూడా ఈ హిల్ ఎక్కకపోవటం వలన వచ్చింది. ఈ గార్డెన్ ను వివిధ భాగాలుగా చేసారు. అవి దిగువ గార్డెన్, కొత్త గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, ఫౌంటెన్ టెర్రస్ మరియు నర్సరీలు. ప్రతి ఒక్క భాగానికి ఒక ప్రత్యేకత కలదు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయినప్పటికీ, విశాలమైన ఈ పచ్చటి ప్రదేశంలో, కొత్త జంటలు తమ ప్రైవసీ కొరకు ఇక్కడకు వస్తారు.

రోజ్ గార్డెన్

ఊటీ లోని అందమైన ఈ గార్డెన్ ఇండియాలోనే అతి పెద్దది. సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం రంగు రంగుల మొక్కలతో సుమారు నాలుగు హెక్టార్ల భూమిలో విస్తరించి వుంది. ఊటీ ఉష్ణమండల పర్వత వాతావరణం కలిగి వుండటం వలన, ఈ ఉష్ణోగ్రతలు గులాబీల పెంపకానికి అనుకూలం. సుమారు 1900 వెరైటీలతో మొదలు పెట్టబడిన ఈ గార్డెన్ లో నేడు, సుందరమైన 20,000 గులాబీ రకాలు కలవు. ఇక్కడ రోజ్ ప్లాంట్ లు మాత్రమే కాక, అనేక రోజ్ క్రీపర్ లు, రోజ్ టన్నెల్స్, పెర్గోలాస్ బౌవార్స్ కూడా కలవు. ఇక్కడ సేకరించబడిన ప్రత్యేక రోజ్ లలో హైబ్రిడ్ టీ రొసెస్, పపగేనా, ఫ్లోరిబుండా, మినియచార్ రొసెస్, రామ్బ్లార్స్. కలవు.

ఊటీ తోటలు - ఆనందాల నిలయం!

థ్రెడ్ గార్డెన్

రోజ్ గార్డెన్ ఇక్కడ ఒక సహజ వండర్ అనుకుంటే, ఊటీ లోని థ్రెడ్ గార్డెన్ ఒక మానవ నిర్మిత అద్భుతం. ఈ గార్డెన్ ప్రపంచంలోని ఒక ప్రత్యేకం. దీనిలో అనేక రకాల, పూవులు, మొక్కలు, లోటస్ కొలనులు, పాకే థీ పూల చెట్లు వంటివి థ్రెడ్, వైర్ మరియు కాన్వాస్ లతో చేయబడి వుంటాయి. అరుదైన ఈ కలాక్రుతులను తయారు చేసేందుకు ఏ రకమైన మెషినరీ ఉపయోగించ లేదు. నాలుగు తాళాల చేతి

పని ఎంబ్రా యిడరి అనే ప్రత్యేకంగా కనిపెట్టబడిన టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ గార్డెన్ ఎంతో సహజంగా కనపడుతుంది. సందర్శకులు ఈ హ్యాండ్ మేడ్ కళా వస్తువులను అంటే, గోడల చిత్ర పటాలు, పక్షులు, పూవుల, గుత్తులు, మొదలైనవి కొనుగోలు కూడా చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X