Search
  • Follow NativePlanet
Share
» »పాలము, వన్య జంతువులు, కోట ల నగరం !

పాలము, వన్య జంతువులు, కోట ల నగరం !

జార్ఖండ్ రాష్ట్రంలోని గొప్ప పర్యాటక ఆకర్షనలలో పాలము నగరం ఒకటి. ఈ ప్రదేశం అనేక వన్య జంతువులు కల ప్రకృతి సంపద కలిగి వుంది. ఇక్కడ కల బలమైన కోట ప్రస్తుతం శిధిలావస్థలో కలదు. అయితే, ప్రక్రుతి దృశ్యాలు మాత్రం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. వన్య జంతు ప్రియులకు, ప్రకృతి ప్రియులకు, హైకర్లకు, ఫోటోగ్రాఫర్ లకు, మోటార్ బైకింగ్ చేసేవారికి ఈ ప్రదేశం ఒక స్వర్గం వలె వుంటుంది. కేమ్పింగ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశం అనుకూలమైనది.

పాలము ప్రదేశం లో ఏమి చూడాలి ?

పాలము కోట, పాలము టైగర్ రిజర్వ్ మరియు బెట్లా నేషనల్ పార్క్ ప్రసిద్ధ ఆకర్షణలు.

పాలము ఎలా చేరాలి ?

వాయు మార్గం

పాలము పట్టణానికి రాంచి సమీప ఎయిర్ పోర్ట్. ఇది సుమారు 186 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఇండియా లోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి వుంది.

ట్రైన్ మార్గం

డాల్టన్ గంజ్ పాలము కు సుమారు 18 కి. మీ. ల దూరంలో గల ఒక రైలు స్టేషన్. 18 6 కి. మీ. ల దూరంలో రాంచి మరొక రైలు స్టేషన్. ఇక్కడ నుండి తరచుగా రైళ్ళు లభిస్తాయి.

రోడు ప్రయాణం

పాలము కు రోడ్డు మార్గం చక్కగా వుంటుంది. సమీప నగరాల నుండి తరచుగా ఇక్కడకు బస్సులు నడుస్తాయి.

బెట్ల నేషనల్ పార్క్ పాలము

Photo Courtesy: Kristine Deppe

పాలములో కల బెట్లా నేషనల్ పార్క్ తప్పక చూడ దాగిన పర్యాటక ఆకర్షణ. ఇది జార్ఖండ్ లోని చోతానగర్ పడమటి భాగం లో కలదు. ఇక్కడ మీరు ఏనుగులు, పులులు, సంభార్ లు, నీల గాయి, కాకర్, లేడి, అడవి ఎలుగు బంతి, మొదలైనవి చూడవచ్చు. పక్షుల పట్ల ఆసక్తి కలవారికి ఇది ఒక స్వర్గం వలే వుంటుంది. ఇక్కడ నెమళ్ళు కూడా చూడవచ్చు. ఈ పార్క్ అంతా ఒక సఫారి జీప్ లో చూడవచ్చు.

పాలము, వన్య జంతువులు

పాలము టైగర్ రిజర్వ్

Photo Courtesy: Tambako

ది జాగర్

పాలములో ప్రధాన పర్యాటక ఆకర్షణ పాలము టైగర్ రిజర్వ్. ఇది దేశంలో అతిపురాతన టైగర్ రిజర్వ్ గా చెప్పబడుతుంది. జార్ఖండ్ లో ఇది ఒక టైగర్ రిజర్వ్ మాత్రమే కలదు. ఇక్కడ కల పులుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, పులులను చూసేందుకు వచ్చే వారికి ఇది ఒక అద్భుత ప్రదేశం. ఈ అభయారణ్యంలో పులులే కాక ఇతర జంతువులు ఏనుగు, చిరుత, గౌర్, సాంబార్ మరియు అడవి కుక్కలు మొదలైనవి కూడా వుంటాయి.

పాలము, వన్య జంతువులు

పాలము కోటలు

Photo Courtesy: Marlisco

పాలము వెళ్ళిన పర్యాటకులు చూడవలసిన మరొక ప్రదేశం పాలము కోటలు. ఇక్కడ కల రెండు కోటలు ఇస్లాం మత శిల్ప శైలి కలిగి ఒక దాని సమీపంలోనే మరొకటి వుంటాయి . ఈ కోటలను షీరో రాజ వంశీకులు తమను శత్రువుల బారి నుండి రక్షించుకోనేటందుకు నిర్మించారు. ఈ కోటలను సందర్శించే వారు వాటి నిర్మాణ శైలి తప్పక ప్రశం సిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X