Search
  • Follow NativePlanet
Share
» »పావగఢ్ - గుజరాత్ హిల్ స్టేషన్ !

పావగఢ్ - గుజరాత్ హిల్ స్టేషన్ !

By Mohammad

పావగడ, గుజరాత్ రాష్ట్రంలోని పంచ్ మహల్ జిల్లాలో గల అందమైన హిల్ స్టేషన్. వడోదర నుండి 46 కిలోమీటర్ల దూరంలో, గాంధీ నగర్ నుండి 162 కిలోమీటర్ల దూరంలో చంపానేర్ పక్కన కలదు. చంపానేర్ - పావగడ ఆర్కియోలాజికల్ పార్కు ను యునెస్కో సంస్థ 'ప్రపంచ వారసత్వ ప్రదేశం' గా 2004 వ సంవత్సరంలో ప్రకటించింది.

పావగఢ్ లో చూడదగ్గ స్థలాలు

పావగడ చంపానేర్ పక్కన కల ఒక కొండ ప్రాంతం. కొండపై మహాకాళి ఆలయం దర్శనం ఇస్తుంది. సోలంకి రాజవంశీయులు కట్టించిన ఖిల్లా మరియు అందులోని హిందూ దేవాలయం కొండపై కలదు.

మాన్సూన్ లో పావగఢ్ దృశ్యాలు

మాన్సూన్ లో పావగఢ్ దృశ్యాలు

చిత్ర కృప : DOMistry

మచి

పావగఢ్ సమీపంలోని 'మచి' అనే ప్రదేశం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గకుండా పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. హాలిడే హోం లు, చిన్న చిన్న హోటళ్లు మచి లో కలవు. మచి కు రోడ్డుమార్గాన చేరుకొనేటప్పుడు తేలియా తలావ్ మరియు దూథియా తలావ్ లు చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : సర్దార్ సరోవర్ డ్యాం - నర్మదా నది ఆభరణం (103 KM) !

పర్యాటకులను ఆకట్టుకొనే సాత్ కమాన్

పర్యాటకులను ఆకట్టుకొనే సాత్ కమాన్

చిత్ర కృప : Suman Wadhwa

మహాకాళి ఆలయం

మహాకాళి ఆలయం, పావగఢ్ కొండపై కలదు. దట్టమైన అడవులలో ఉన్న గుడి దేశంలోని 51 శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. గుడిని సందర్శించటానికి నేటికి భక్తులు వస్తూనే వుంటారు. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తున ఉన్న ఆలయానికి మెట్ల మార్గాన చేరుకోవాలంటే సుమారు గంట సమయం పడుతుంది లేదా రోప్ వే ఉపయోగించవచ్చు.

మహాకాళి ఆలయం

మహాకాళి ఆలయం

చిత్ర కృప : telugu native planet

ఇక్కడ కాళీమాత ఎర్రటి ముఖం మరియు శరీరం కలిగి వుంటుంది. టెంపుల్ లో మాత విగ్రహాలు, యంత్రాలు కలవు. టెంపుల్ భక్తుల కొరకు అధిక సమయం తెరచి ఉంచుతారు. ఈ టెంపుల్ రెండు అంతస్తులలో కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కాళీ విగ్రహం వుండగా, రెండవ అంతస్తులోని ప్రదేశాన్ని ముస్లిం భక్తులు వినియోగిస్తారు.

పావగఢ్ కోట

పావగఢ్ కోట సోలంకి సామ్రాజ్యానికి చెందినది. నేటికి ఈ కోట అవశేషాలు ఇక్కడ చూడవచ్చు. కోటలో పడవ శతాబ్దం నాటి ఒక హిందూ టెంపుల్ కలదు. ఇది చాలా పురాతనమైనది.

పావగఢ్ కోట

పావగఢ్ కోట

చిత్ర కృప : C.Chandra Kanth Rao

పావగఢ్ కోట చుట్టూ ఒక గేటు కలదు. ప్రధాన గేటు లు అంటే అవి అటాక్ గేటు, బుధియా గేటు, మచి గేటు , మోతీ మరియు సదన్ గేటు ళ్లు. షా గేటు గట్టి రాయిచే చేయబడినది.

ఇక్కడ ఇంకా హిందూ మరియు జైన్ టెంపుల్స్ కూడా కలవు. లకులిస టెంపుల్ ఒక హిందూ టెంపుల్. సుమారు 10 వ శతాబ్దానికి చెందినది. ఇప్పటికి దీనిని చూడవచ్చు.

ధబ దుంగ్రి

ధబ దుంగ్రి, శివ ఆలయానికి ప్రసిద్ధి చెందినది. ఇది హలోల్ - పావగఢ్ వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని విశ్వామిత్రుని యొక్క తపోభూమి గా అభివర్ణిస్తారు స్థానికులు.

పావగఢ్ ఆలయం

పావగఢ్ ఆలయం

చిత్ర కృప : Fr. Gaurav Shroff

'విరసత్ వన్' తోట సాయంత్రంపూట కాలినడకన వాకింగ్ చేయటానికి లేదా గార్డెన్ లో కూర్చొని కాలక్షేపం చేయటానికి సూచించదగినది. పావగఢ్ కు అడుగున ఉన్న' వడ తలావ్' మరియు 'కబూతర్ ఖానా' తప్పక చూడదగ్గవి.

పావగఢ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పావగఢ్ కు సమీపాన వడోదర ఎయిర్ పోర్ట్ (46 కిలోమీటర్ల దూరంలో) కలదు. గాంధీనగర్, జైపూర్, ముంబై, ఢిల్లీ ల నుండి విమాన సదుపాయాలు కలవు. క్యాబ్ లేదా టాక్సీ లలో పావగఢ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

పావగఢ్ కు సమీపాన వడోదర రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్ ల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. వడోదర స్టేషన్ బయట ఏదేని టాక్సీ లేదా బస్సును ఎక్కి పావగఢ్ చేరుకోవచ్చు.

కోట పై కి చేరుకొనే మార్గం

కోట పై కి చేరుకొనే మార్గం

చిత్ర కృప : Phso2

రోడ్డు మార్గం

పావగఢ్ చేరుకోవటానికి గుజరాత్ రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం ఉన్నది. సలహా ఏంటంటే, ముందుగా వడోదర చేరుకొని అక్కడి నుండి బస్సు మార్గాన పావగఢ్ చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X