Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని ప్రముఖ పెన్ హాస్పిటల్స్ !

ఇండియాలోని ప్రముఖ పెన్ హాస్పిటల్స్ !

By Mohammad

రోగం వస్తే ఎక్కడికి వెళతారు ? హాస్పిటల్. అదే జంతువులకు వస్తే పశువైద్యశాలకు వెళతారు కదా ! మరి పెన్నులకు రోగం వస్తే ? పెన్ హాస్పిటల్ కు వెళ్ళారా ??! ఆసక్తికరంగా ఉంది కదూ, ఎప్పుడూ వినలేని ఈ పెన్ హాస్పిటల్ గురించి ఒక లుక్ వేద్దాం పదండి.

మీ వద్ద పెన్ను ఉంది అది పాతది. ఎప్పుడో జమాన కాలం నాటి ఆ పెన్నులు ఇప్పుడు దొరకడం చాలా కష్టం. వాడేవారు కూడా తక్కువే. నాటి జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలంటే మరోసారి ఆ పెన్ను పట్టుకొక తప్పదు. కానీ, పెన్నెమో పనిచేయటం లేదు. మరి ఎం చేయాలి ?

పెన్నుకు రోగం వస్తే పెన్ హాస్పిటల్ కు వెళ్ళాలి. అక్కడ మీ పెన్నులను రిపేర్ చేసే వారు ఉంటారు. ఇండియాలో ఇలాంటి హాస్పిటల్ లు కొన్నే ఉన్నాయి. అవి మీ పాత పెన్నులను అందంగా తీర్చిదిద్దుతాయి. మరి ఆలస్యం చేయకుండా మీ జబ్బుపడిన పెన్నుని ఈ హాస్పిటల్ కు తీసుకెళ్లండి. మీ పాత జ్ఞాపకాలను మరోసారి తిరగరాయండి.

ఫౌంటన్ ఇంక్ పెన్ను

చిత్ర కృప : mpclemens

హానెస్ట్ పెన్ హాస్పిటల్, త్రిశూర్

త్రిశూర్ లోని పాలస్ రోడ్ కు సమీపాన విశాలమైన మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్ మధ్యలో హానెస్ట్ పెన్ హాస్పిటల్ కలదు. ఇదొక చిన్న షల్టర్ హాస్పిటల్. ఫ్రాక్చర్ అయిన పెన్నులను మరియు అనారోగ్యం పాలైన (పాడైపోయిన) పెన్నులను ఇక్కడ బాగు చేస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోర్డ్ మీద రాసిన పదాలు. అదేమిటంటే - 'విరిగిన ఫౌంటన్ ఇంక్ పెన్నుని రెండు ఇంక్ పెన్నులు కలిసి స్ట్రేచ్చర్ మీద తీసుకొని వెళతాయి' అని.

ఇది కూడా చదవండి : త్రిస్సూర్ వేడుకలు - ఏనుగుల పండుగ !

త్రిశూర్ లోని పెన్ హాస్పిటల్

త్రిశూర్ లోని పెన్ హాస్పిటల్

ఇక్కడున్న డాక్టర్ పేరు మిస్టర్ నాజర్. ఇతను విరిగిన మరియు పాడై పోయిన ఫౌంటన్ పెన్నులకు సర్జరీ (రిపేర్) చేస్తాడు. విదేశాల నుండి దిగిమతి అయిన పెన్నులను కూడా అందంగా మారుస్తాడు. ఈ హాస్పిటల్ యొక్క టైమ్ బయట బోర్డ్ మీద రాసి ఉంటారు. ఒకవేళ నాజర్ కొద్ది పాటి బ్రేక్ తీసుకుంటే "పది నిమిషాలు వేచి ఉండండి" అని మరో బోర్డ్ తగిలిస్తాడు. ఈ కళ ను నాజర్ తన తండ్రి నుండి నేర్చుకున్నాడు. ఇతనికి సుమారు ౩౦ సంవత్సరాల పైబడి అనుభవం ఉన్నది. హాస్పిటల్ ను 1937 వ సంవత్సరంలో నాజర్ తండ్రి స్థాపించాడు.

పెన్ హాస్పిటల్ సంప్రదించువేళలు, త్రిశూర్

పెన్ హాస్పిటల్ సంప్రదించువేళలు, త్రిశూర్

చిత్ర కృప : Joseph Thomas

ఫౌంటన్ పెన్ హాస్పిటల్, కలకత్తా

కలకత్తా లో క్రీ.శ. 1946 వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఫౌంటన్ పెన్ హాస్పిటల్ పాత పుస్తకాలు మరియు ఇతర స్టేషనరీ వస్తువులను అమ్మే బిజీ స్ట్రీట్ లో కలదు. పెన్నులను రీపేరు చేస్తారు మరియు కొత్త పెన్నులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడ ఫౌంటన్ పెన్ లను మరియు పురాతన ఫౌంటన్ పెన్ లను రీపేరు చేసే నైపుణ్యకారులు ఉన్నారు. మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోండి, మీ నాన్న గారు బహుమతిగా ఇచ్చిన ఆ అమూల్యవైన పెన్నుతో రాయటం ప్రారంభించండి.

ఇది కూడా చదవండి : కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !

ఫౌంటన్ పెన్ హాస్పిటల్, కలకత్తా

చిత్ర కృప : Lorenzo

పెన్ హాస్పిటల్, భువనేశ్వర్

భువనేశ్వర్ లోని ఖరబేలానగర్ లో పెన్ హాస్పిటల్ ఉన్నది. ఇక్కడ ఇప్పటికీ పెన్నులను రిపేరి చేయించుకోవటానికి కస్టమర్ లు వస్తుంటారు. ఈ హాస్పిటల్ పెన్నులను సొంతంగా తయారుచేస్తుంది మరియు సప్లై చేస్తుంది. ఇవేకాక, ఇక్కడ గిఫ్ట్ లను, ఇతర స్టేషనరీ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : భువనేశ్వర్ - పర్యాటక ప్రదేశాలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X