Search
  • Follow NativePlanet
Share
» »పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

By Mohammad

చుట్టూ జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండకోనల్లో, ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో ... నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయె ప్రాంతంలో ... సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది.

క్షేత్రం విశిష్టత

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం గురించి కొన్ని మాటల్లో ... శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్యకస్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యాడు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయబ్రాంతులు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధమొహన సౌందర్యం ఆయనని శాంతపరిచింది. స్వామి పెళ్ళిచేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. ఆమెను పెనవేసుకొని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు. ఆ శిల వెలసిన ప్రాంతం 'పెనుశిల కోన' అయ్యింది. కాలక్రమేణా అదికాస్తా 'పెంచలకోన' గా అవతరించింది.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ నవ నరసింహ స్వామి క్షేత్రాలు !

తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతంలో వెలసిన స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తుంటారు. మామూలు రోజుల్లో అయితే చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్న ప్రశాంతంగా ఉంటుంది అదే వేసవి కాలం అయితే భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇప్పుడొస్తున్న ఈ వేసవి కాలంలో ఒకవేళ నెల్లూరులో ఉన్నట్లయితే లేదా రాజంపేట పరిసరాల్లో ఉన్నట్లయితే పెంచలకోన తప్పక చూడండి.

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన చేరుకోవటానికి రోడ్డు వ్యవస్థ ప్రధాన రవాణా మార్గం గా ఉన్నది. వాయు, రైలు మార్గాల సౌకర్యం కూడా ఈ క్షేత్రానికి ఉన్నాయి.

వాయు మార్గం

పెంచలకోన కు సుమారు 100 కి. మీ. దూరంలో ఉన్న తిరుపతి రేణిగుంట విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని రోడ్డు మార్గం ద్వారా పెంచలకోన సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 2 గంటలు.

చిత్ర కృప : Sameer Chhabra

ఇది కూడా చదవండి : అభయారణ్యంలో వేంకటేశ్వరుని దర్శనం !

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

పెంచలకోన కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ రాజంపేట రైల్వే స్టేషన్. ఇది 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమీపాన ఉన్న మరొక ప్రధాన రైల్వే స్టేషన్ గూడూరు రైల్వే జంక్షన్. ఇది 70 కి.మీ. దూరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ లో దిగి ప్రవేట్ ట్యాక్సీ లు లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి పెంచలకోన వెళ్ళవచ్చు.

చిత్ర కృప : Madan kumar 007

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

పెంచలకోన కు ప్రధాన రవాణా మార్గం రోడ్డు వ్యవస్థే. కడప (138 కి.మీ) , నెల్లూరు (80 కి.మీ), వెంకటగిరి (60 కి.మీ), గూడూరు(70 కి.మీ), రాజంపేట ( 34 కి.మీ) ప్రాంతాల నుండి పెంచలకోన కు ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. నెల్లూరు నుండి ప్రతి గంటలకు ఒక బస్సు పెంచలకోన బయలుదేరుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో నెల్లూరు, రాజంపేట, గూడూరు నుండి ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : ChanduBandi

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

ఆంధ్రా నుండి వచ్చేవారు ?

విజయవాడ, వైజాగ్, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల నుండి వచ్చే వారు నెల్లూరు వరకు రైల్లో ప్రయాణించవచ్చు. ఆ తరువాత నెల్లూరు బస్ స్టాండ్ చేరుకొని పెంచలకోన చేర వచ్చు. నెల్లూరు (75 కి.మీ) నుండి పెంచలకోన కు ప్రతి గంట కు ఒక బస్సు బయలుదేరుతుంది. ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి.

చిత్ర కృప : Vinayaraj

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

తిరుపతి. తమిళనాడు నుండి వచ్చే వారు

తిరుపతి (115 కి.మీ) చుట్టుప్రక్కల ప్రాంతాల వారైతే వెంకటగిరి - రాపూరు మీదుగా పెంచలకోన చేరుకోవచ్చు. చెన్నై, చుట్టుప్రక్కల పట్టణాల నుండి వచ్చేవారైతే నెల్లూరు లోని గూడూరు రైల్వే జంక్షన్ వద్ద దిగి, అక్కడి నుండి రాపూరు మీదుగా బస్సులో చేరుకోవచ్చు. గూడూరు నుండి పెంచల కోన 65 కి. మీ. దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Shashi Bellamkonda

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

పెంచలకోన ఎలా చేరుకోవాలి ?

కర్నూలు, కడప, అనంతపురం నుండి వచ్చేవారు

కర్నూలు, కడప, అనంతపురం చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చేవారు రాజంపేట వరకు బస్సులో లేదా రైల్లో ప్రయాణించవచ్చు. ఆ తర్వాత రాజంపేట నుండి రాపూరు కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి. రాపూరు (30 కి. మీ) నుండి ప్రతి అరగంట కు ఒక బస్సు పెంచలకోన బయలుదేరుతుంది.

చిత్ర కృప :Vinayaraj

పెంచలకోన ఆలయం

పెంచలకోన ఆలయం

పెంచలకోన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కలదు. ఇక్కడ వెలసిన నరసింహ స్వామిని పెంచల స్వామి గా ఆరాధిస్తుంటారు భక్తులు.

ఆలయ సందర్శన : ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

చిత్ర కృప : Sri Penusila Lakashmi Narasimha Swamy Devasthanam

పెంచలకోన ఆలయం

పెంచలకోన ఆలయం

వైష్ణవ క్షేత్రాల్లో పెద్దదైన పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడి సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని భక్తుల వాదన. పూర్వం కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసాడని ఆశ్రమం పక్కనే ఉన్న ఏరుని కన్వలేరు గా పిలిచేవారని అదికాస్త కండలేరు గా మారిపోయిందని చరిత్ర కధనం.

చిత్ర కృప : Sri Penusila Lakashmi Narasimha Swamy Devasthanam

పెంచలకోన ఆలయం

పెంచలకోన ఆలయం

ఇక్కడకు రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి యాత్రికులు స్వామి వారి అనుగ్రహం పొందటానికి వస్తుంటారు. దట్టమైన అటవీప్రాంతమైన సరే..! భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆలయ ప్రాంగణంలోనే రాత్రిపూట బస కూడా చేస్తుంటారు.

చిత్ర కృప : YVSREDDY

పెంచలకోన ఆలయం బ్రహ్మోత్సవాలు

పెంచలకోన ఆలయం బ్రహ్మోత్సవాలు

పెంచలకోన క్షేత్రంలో వేసవి కాలం అంటే ఏప్రియల్ - మే నెలల మధ్యలో ప్రతి సంవత్సరం వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడకు స్పెషల్ బస్సులు వేస్తుంటారు.

చిత్ర కృప : Sri Penusila Lakashmi Narasimha Swamy Devasthanam

ఆదిలక్షి అమ్మవారి ఆలయం

ఆదిలక్షి అమ్మవారి ఆలయం

శ్రీహరి చెంచులక్ష్మి ని వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి దేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి ఆల్లంత దూరంలో ఏటి అవతల గట్టు కు వెళ్లిపోయినట్లు కథనం. దాంతో అక్కడ కూడా అమ్మవారికి కూడా ఆలయాన్ని నిర్మించారు.

చిత్ర కృప : YVSREDDY

ఆదిలక్షి అమ్మవారి ఆలయం

ఆదిలక్షి అమ్మవారి ఆలయం

ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

చిత్ర కృప : YVSREDDY

ఆశ్రమాలు, ఆలయాలు

ఆశ్రమాలు, ఆలయాలు

పెంచలకోనలో మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ లలితాపరమేశ్వరి ఆలయం ఉంది. ప్రపంచంలో అరుదైన శ్రీచక్ర పీఠం ఇక్కడే ఉండటం అరుదైన విషయం. ఇక్కడ విజయేశ్వరి దేవి ఆశ్రమం కూడా ఉన్నది. ఆమె ఇక్కడ 30 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది.

చిత్ర కృప : YVSREDDY

గుండాలు/ తీర్థాలు

గుండాలు/ తీర్థాలు

పెంచలకోన క్షేత్రం లో సప్తతీర్థాలు కొలువుదీరి ఉన్నాయి. కొండమీద నుంచి దిగువన ఉన్న కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ప్రవహిస్తుంటాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు పోయి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : penchalakona Nellore

పెంచలకోన జలపాతం

పెంచలకోన జలపాతం

పెంచలకోన జలపాతం, పెంచలకోన పరిసరాల్లో కలదు. ఈ జలపాతం చూడటానికి బహుముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే కాక, ప్రక్కనే ఉన్న తమిళనాడు, కర్నాటక వాసులు కూడా వస్తుంటారు. ఈ జలపాతం ప్రతి శని, ఆది వారాలలో సందడిగా ఉంటుంది. చూడటానికి ఏమో అనిపించినా సౌండ్ మాత్రం అదిరిపోతుంది.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లోని మరిన్ని జలపాతాలు !

చిత్ర కృప : Chandu3782

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

సాహసికులు పెంచలకోన క్షేత్రంలో ట్రెక్కింగ్ చేస్తూ ఆనందించవచ్చు. అడవుల్లో కాలినడకన సంచరించవచ్చు. జలపాతాల వద్దకు నడుచుకుంటూ వెళ్ళి పై నుంచి పడే ఆ జలాధార క్రింద స్నానమాచరించవచ్చు.

చిత్ర కృప : Sri Penusila Lakashmi Narasimha Swamy Devasthanam

వసతి

వసతి

పెంచలకోన లో ఉండటానికి కొన్ని సత్రాలు ఉన్నాయి. కానీ అవి అంతగా అనుకూలంగా ఉండవు. అంతగా ఉండాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోనే రాత్రి పడుకోవచ్చు. భోజనాలు, టిఫిన్ ల కొరకై కాకా హోటళ్లు, తోపుడుబండీ లు ఆలయం ఆరుబయట దర్శనమిస్తాయి.

చిత్ర కృప : Chandu3782

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X