Search
  • Follow NativePlanet
Share
» »పెంపుడు జంతువులను అనుమతించే హోటళ్ళు ?

పెంపుడు జంతువులను అనుమతించే హోటళ్ళు ?

పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు హోటళ్లకు రావటమా ? ఖచ్చితంగా ! ఈ ఆలోచన మన ఇండియాలో కొత్తది అయినప్పటికీ విదేశీ హోటళ్ళలో పాతదే. మన దేశంలో కూడా అనేక హోటళ్ళు ఇపుడు పెంపుడు జంతువులను అనుమతించి మర్యాదలు చేస్తున్నాయి. పెంపుడు జంతువులను అమితంగా ప్రేమించే ఫారిన్ టూరిస్ట్ లు ఇపుడు ఇండియా కు వారి పెట్స్ తో సహా వచ్చేస్తున్నారు. అయితే, వాటితో కలసి ఏ హోటల్లో దిగాలి అనేది వారికి సమస్యగా వుంది. ఇప్పటి వరకు హోం స్టే లలో దిగి వాటి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం హోటళ్ళు, రిసార్ట్ లు కూడా 'పెట్ వెకేషన్ ' అనే పేరుతో వాటికి అతిధి మర్యాదలు చేస్తున్నాయి. సాధారణంగా, మనం ఎక్కడికైనా వెళ్ళేటపుడు, మన ఇంటి పెంపుడు జంతువులను, అమితంగా ప్రేమిస్తున్న కారణంగా, లేదా, మనం వదలి వచ్చేస్తే, చూసే వారు లేక, వాటిని ఇంటి వద్దే వదల్లేము.

picture by Moyan Brenn

ఇక ఇపుడు మీరు మీ పెంపుడు కుక్క లేదా పిల్లి వంటి వాటితో హ్యాపీ గా ఇండియాలో తిరిగేయవచ్చు. ట్రైన్ ల లో తిప్పవచ్చు, హోటల్ లో మీతో పాటు కూర్చో పెట్టుకోవచ్చు. దానికి ఆహారం ఇస్తూ స్వేచ్చగా వదిలేయవచ్చు. మీ పెంపుడు జంతువులకు కూడా వెకేషన్ కావాల్సిందే.

స్వగ్రామం బెంగుళూరు నగరమా ? బెంగుళూరు నగరం ఎంతో విలాసం అయినప్పటికీ గ్రామీణ వాతావరణం కూడా కొన్ని ప్రదేశాలలో కలిగి వుంటుంది. మీరు ఒక పక్క బెంగుళూరు అందించేస్తూ వుంటే, మీతో పాటు ఇక్కడి పరిసరాలను మీ పెట్స్ కూడా ఆనందిన్చేస్తాయి. ఆవులకు పాలు తీయటం, ఎద్దు బండ్ల రవాణా, వంటివి కూడా ఇక్కడ కనపడతాయి.

కేరళ లో హౌస్ బోట్స్
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, అలెప్పి లలో కల హౌస్ బోట్లు ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులకు ప్రవేశ అనుమతినిస్తున్నాయి. మీ పెంపుడు జంతువులను కూడా మీతో తీసుకు వెళ్లి, పూర్తి ఆనందం అనుభవించవచ్చు. ఈ హౌస్ బోటులలో వాటికి నిద్ర, ఆహారం వంటి సౌకర్యాలుంటాయి.

డీ మార్క్స్ హోటల్ అండ్ రిసార్ట్స్, న్యూ ఢిల్లీ
ఈ హోటల్ లో లక్సరీ మరియు మీ బడ్జెట్ రెండూ సరితూగుతాయి. డీ మార్క్స్ హోటల్ మరియు రిసార్ట్లు లు మీతో పాటు ఒక పెంపుడు జంతువుకు కూడా వసతి నిస్తాయి. పెట్ కేర్ కి అంటూ అదనపు చార్జీలు వుండవు. ఇది ఒక త్రీ స్టార్ లక్సరీ హోటల్.

మ్యావ్ లు, భౌ భౌ లు కూడా హోటళ్లకు వచ్చేస

picture by Victor

బెయన్ రామన్ కాటేజ్ లు, గోవా
ఈ కాటేజ్ లు చాలా సింపుల్ గా వుంటాయి. మీరు బీచ్ లో ఆనందిస్తూ వుంటే, కాటేజ్ సిబ్బంది మీ పెట్ కేర్ తీసుకుంటారు. గోవా లోని కాలాన్ గూటే బీచ్ సమీపంలో కల రామన్ కాటేజ్ లు మీ పెట్ విశ్రాంతికి చక్కని వసతి కాగలదు.

క్యాంపు దెల్లా రిసార్ట్, లోనావాలా
ఇది ఇండియా లో మొట్ట మొదటి పెట్ ఫ్రెండ్ లీ రిసార్ట్ ఇక్కడ మీ పెట్ కు అవసరమైన సౌకర్యాలన్నీ వుంటాయి. అవసరం అనుకుంటే, మరొక కుక్క సాహచర్యం కూడా దొరుకుతుంది. మీ పెట్ ను సిబ్బందికి వదిలేసి, మీరు ఆనందంగా బంగీ జుంపింగ్ లేదా ఆక్వా జోర్బింగ్ లు చేసుకోవచ్చు.

పైన పేర్కొన్నవే కాక, ఇండియాలో పెట్ ఫ్రెండ్ లీ హోటళ్ళు, కాటేజ్ లు ఇంకా కలవు. మీ ప్రియతమ పెంపుడు జంతువులను ఇకపై ఇంటివద్దే వదిలేసి, వాటిపై మీరు ఎలా వుందో ? అంటూ బెంగలు పెట్టుకొనవసరం లేదు. మరింత సమాచారం కొరకు కొన్ని వెబ్ సైట్ లు చూడండి. మీ పెట్ లను కూడా మీతో విహరింప చేసి, వాటికి ఆనందాలను కల్పించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X