Search
  • Follow NativePlanet
Share
» »లాహౌల్ నేషనల్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ !!

లాహౌల్ నేషనల్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ !!

విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు.

By Mohammad

ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. లాహౌల్, స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు, పర్వత ప్రాంతాలు 1960లో కలపబడి లాహౌల్ & స్పితి అనే ఒకే జిల్లాగా ఏర్పడ్డాయి. ఇక్కడి వారు తెల్లటి మేని ఛాయతో, తేనె రంగు కళ్ళతో ఇండో-ఆర్యన్, టిబెటన్ జాతికి చెందిన వారు. ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. లడఖ్, టిబెట్ లో లాంటి భాషనే ఇక్కడా మాట్లాడతారు. విహారాలపై రెపరెపలాడే ప్రార్ధనా జండాలు ఈ ప్రాంతానికి ముఖ్య చిహ్నాలు. ఈ విహారాలన్నీ ఇక్కడి ప్రజల ధార్మిక ధోరణిని ప్రతిబింబిస్తాయి.

పిన్ వాలీ నేషనల్ పార్క్

పిన్ వాలీ నేషనల్ పార్క్

చిత్రకృప : Ra.manimtech

అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి. ఇక్కడ వృక్ష సంపద తరిగిపోవడంతో టిబెటన్ దుప్పి, ఆర్గలి, కియాంగ్, మస్క్ జింక, మంచు చిరుతలు లాంటి జంతువులను ప్రమాదంలో వున్న జాతులుగా ప్రకటించారు.

విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు.

కిబ్బర్

హిమాచల్ ప్రదేశ్ లోని లాహోర్ సమీపంలో సముద్ర మట్టానికి 4270 మీటర్ల ఎత్తున ఉన్న చిన్న గ్రామం కిబ్బర్. ఒక సున్నపు రాతి కొండపైన ఉండే ఈ గ్రామ౦వెంట ఒక ఇరుకైన లోయ ఉంది. టాబోకు చెందిన సేర్కాంగ్ రింపోచే నిర్మించిన విహారం కిబ్బర్ వన్యప్రాణి అభయారణ్యం ఇక్కడి రెండు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. వేసవిలో బస్సులు వెళ్ళే కాజా నుంచి ఈ గ్రామం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచం మొత్తంలో రోడ్డు ద్వారా చేరుకోగల ఎత్తైన గ్రామంగా కిబ్బర్ పేరుగాంచింది.

కీ మొనాస్టరీ

కీ మొనాస్టరీ

చిత్రకృప : Ajith U

వ్యవసాయంతో పాటు, గుర్రాలకు మారుగా ఎద్దులను మార్పిడి చేసుకోవడం, లేదా వాటిని నగదుకు అమ్మడం మీద ఈ ప్రాంతపు ఆర్ధిక రంగం ఆధారపడి ఉంది. వీళ్ళు పరంగ్ లా నుంచి లడఖ్ కు వ్యాపారం కోసం మూడు రోజులకు పైగా ప్రయణిస్తారు.

కిబ్బర్ గ్రామంలో 80 ఇళ్ళు ఉన్నాయి. ఇవి టిబెటన్ నిర్మాణశైలి లో నిర్మించారు. ఇవన్నీ రాళ్ళు, చెక్కతో కలిపి కట్టారు. ఇక్కడ ఒక ప్రజా వైద్యశాల, పోస్టాఫీసు, ఉన్నత పాఠశాల, సార్వజనిక టెలివిజన్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి : తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !!

కుంజుం పాస్

టిబెట్ లోని కుంజుం లా గా పిలువబడే కుంజుం పాస్ కుంజుం పర్వత శ్రేణులలో ఉన్న ఎత్తైన పర్వత మార్గం. మనాలీ నుంచి 122 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4590 మీటర్ల ఎత్తులో ఈ మార్గం ఉంది. ఈ మార్గం కులూ లోయను, లాహౌల్ లోయను హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయకు కలుపుతుంది. దైవభక్తి గల యాత్రీకులు ఈ మార్గం పైనున్న దుర్గాదేవి గుడిని కూడా సందర్శించవచ్చు.

త్రిలోకినాథ్ టెంపుల్

త్రిలోకినాథ్ టెంపుల్

చిత్రకృప : Anks

రోహతంగ్ పాస్ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాక గ్రంపూ దగ్గర కుడివైపు తిరిగితే కుంజుం పాస్ వస్తుంది. ఈ మార్గం గుండా వెళ్ళేటపుడు యాత్రికులు ప్రపంచంలోని రెండో అతిపెద్ద మంచుఖండం బారా-సిగ్రి ని కూడా చూడవచ్చు. బటాల్ సి.బి. లేదా చంద్ర-భాగా, మనాలీ, కీలాంగ్, దార్చ, బరలచ లా, సార్చు, టాంగ్ లాంగ్, పంగి లోయ కుంజుం పాస్ చుట్టుపక్కల ఉన్న ఇతర ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : షోజా - లోయలో దాగిఉన్న అందమైన ప్రదేశం !!

లాహౌల్ ఎలా చేరుకోవాలి ?

న్యూడిల్లీ, షిమ్లా లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడిన భుంటార్ లాహౌల్ కి సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుంచి లాహౌల్-స్పితి చేరడానికి టాక్సీలు, కాబ్ లు తేలిగ్గా దొరుకుతాయి. జోగీందర్ నగర్ ఇక్కడికి సమీపంలోని చిన్న రైల్వే స్టేషన్ కాగా, ప్రధాన రైల్వే స్టేషన్ చండీఘర్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. రోహతంగ్ పాస్, కున్ జుమ్ పాస్, కిన్నౌర్ ల గుండా రోడ్డు మార్గం లో లాహౌల్ చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X