Search
  • Follow NativePlanet
Share
» »ఫోర్ట్ కోచి లో పర్యాటక ఆకర్షణలు !

ఫోర్ట్ కోచి లో పర్యాటక ఆకర్షణలు !

ఫోర్ట్ కోచి బ్రిటిష్ పాలనా కాలంలో ప్రధానంగా ఒక మత్స్యకారుల గ్రామం. నేడు ఇది ఒక గొప్ప టూరిస్ట్ కేంద్రం అయ్యింది. ఇక్కడ కల సముద్రం లోని వ్యాపారం కొరకు పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, అరబ్బులు మొదలైన వారు ఈ నగరానికి రావటంతో ఈ సిటీ లో అన్ని రకాల సంస్కృతులు కనపడతాయి. ఈ ప్రదేశం ప్రతి మూల పర్యాటకులకు ఎదో ఒక ఆకర్షణ కనపడుతుంది. అందమైన బీచ్ విహారం చేయవచ్చు. లేదా టవున్ లో కల వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు చూడవచ్చు.

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

శాంతా క్రజ్ బాసిలికా - శాంతా క్రజ్ బాసిలికా ఒక అందమైన 500 సంవత్సరాలనాటి చర్చి. పోర్చుగీస్ వారు ఈ దేశానికి వచ్చిన క్రీ.శ. 1500 సంవత్సరం నాటిది. ఇండో గోతిక్ శిల్ప శైలి లో కల ఈ చర్చి ముచ్చటైన దాని అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

Pic Credit: Sudheesh S

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి
ఇండియాకు వచ్చినపుడు యూరోపియన్ లు ఈ చర్చిని నిర్మించారు. చర్చి నిర్మాణం చాలా అందంగా వుంటుంది. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన కోచి ప్రజల జ్ఞాపకార్ధం ఒక స్మారకం కలదు. ప్రసిద్ధ నావికా అన్వేషకుడు వాస్కో డా గామా భౌతిక కాయం మొదటగా ఇక్కడ సమాధి చేయబడినది. తర్వాత పోర్చుగల్ కు తీసుకు వెళ్ళారు.

Pic Credit: Adam Jones

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

డచ్ స్మశానం
సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి సమీపంలో డచ్ స్మశానం కలదు. ఈ స్మశానం దేశంలోనే పురాతనమైనది. ప్రవేశ ద్వార స్తంభానికి క్రీ.శ.1724 లో నిర్మించబడి నట్లు చెక్కబడి వుంది. ఇక్కడ కల సమాధులు, స్మారకాలపై మరణించిన డచ్, బ్రిటిష్ వారి వివరాలు కలవు.

Pic Credit: Wikki Commons

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

బిషప్ హౌస్
కోచి లో కల బిషప్ నివాసం ఒక చిన్న కొండపై పెరేడ్ గ్రౌండ్ సమీపం గా కలదు. దీనిని 1506 లో పోర్చుగీస్ గవర్నర్ నివాసం కొరకు నిర్మించారు. 1888 లో దీనిని 27 వ బిషప్ నివాసంగా మార్చారు. పచ్చటి ఈ తోటలో కల ఈ భవనం విజిటర్ లను స్వాగతిస్తూ వుంటుంది.

Pic Credit: Fraboof

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

ఇండో పోర్చుగీస్ మ్యూజియం
ఇండో పోర్చుగీస్ మ్యూజియం బిషప్ హౌస్ సమీపంలో కలదు. దీనిలో వివిధ చర్చిల నుండి సేకరించబడిన కళాకృతులు ఉంచబడ్డాయి. ఫోర్ట్ కోచి లో పోర్చుగీస్ వారి వారసత్వం కనపడుతుంది.

Pic Credit: Wikki Commons

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

ఫోర్ట్ కోచి బీచ్
ఫోర్ట్ కోచి బీచ్ చాలా ఆకర్షనీయమైనది. ఇక్కడ కనపడే చైనీస్ ఫిషింగ్ నెట్స్, చెట్లు, పచ్చటి పరిసరాలు బీచ్ అందాలకు మరింత ఆకర్షణ ఇస్తాయి. కోచి కార్నివాల్ పండుగ ఈ బీచ్ లలో చేస్తారు. సముద్రపు ఆహారాలు, వాస్కో డా గామా స్క్వేర్, లైట్ హౌస్ ఇతర ఆకర్షణలు.

Pic Credit: Connie Ma

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

చైనీస్ చేపల వలలు
అతి పెద్ద గా వుండే చైనీస్ చేపల వలలు ఫోర్ట్ కోచి కి ఒక ట్రేడ్ మార్క్ వంటివి. వీటిని చైనా పర్యాటకుడు జంగ్ హాయ్ ఇక్కడ ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. వీటిని క్రీ. శ. 1350 - 1450 లలో మన దేశంలో ప్రవేశ పెట్టారు. బీచ్ లో సూర్యాస్తమయం చాలా ఆకర్షనీయం.

Pic Credit: Chandika Nair

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

రాజకుమారి వీధి
ఫోర్ట్ కోచి లో రాజకుమారి వీధి అతి పురాతనమైనది. ఈ వీధిలో యూరోప్ శైలిలో వరుసగా అనేక భవనాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ కల లోఫర్ కార్నర్ నుండి చూస్తె వీధి చాలా అందంగా కనపడుతుంది.

Pic Credit: Oliver Wilks

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

మట్టన్ చెర్రీ పాలస్
మట్టన్ చెర్రీ పాలస్ ను డచ్ పాలస్ అంటారు. ఈ పాలస్ లో హిందూ దేవాలయాల కుడ్య చిత్రాలు, కళలు, కాన్వాస్ లు, కోచి రాజు కు సంబందించిన వస్తువులు అనేకం చూడవచ్చు.

Pic Credit: Mark Hills

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

పరదేశి వస్తువుల షాప్
కోచి లో ఇది ఒక అతి పురాతన మార్కెట్. ఇది పురాతన కోచి లో ని యూదుల పట్టణంలో కలదు. దీనిలో అనేక గోల్డ్ క్రౌన్ లు, బెల్జియన్ గ్లాస్ చాంద్ లీర్లు, బ్రాస్ వస్తువులు లభిస్తాయి.

Pic Credit: Wikki Commons

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

ఆహారాలు
కోచి లో స్థానిక ఆహారాలు, కేరళ, డచ్, పోర్చుగీస్ ల మిశ్రమ సంస్కృతి కలిగి వుంటాయి. కేరళ లోని ఇతర టవున్ ల వాలే కాక, ఇక్కడి ఆహారాలు విభిన్నంగా వుంటాయి. కొబ్బరి అధికంగా వంటలలో వాడతారు. స్థానిక మసాలాలు వేస్తారు. కాని వంటల విధానం పూర్తిగా యూరో పియాన్ స్టైల్ లో వుంటుంది.

Pic Credit: b+c+c+f

గొప్ప టూరిస్ట్ కేంద్రం

గొప్ప టూరిస్ట్ కేంద్రం

కోచి లో షాపింగ్
షాపింగ్ ప్రియులకు కోచి లో అనేక ప్రదేశాలు కలవు. మీ కనీస మరియు ఇతర అవసరాలకు తగిన వివిధ రకాల వస్తువులు సముద్రపు ఒడ్డున కల దుకాణాలలో లభ్యం అవుతాయి. డచ్, పోర్చుగీస్ తయారీలు అధికంగా కల కొన్ని పురాతన శైలి వస్తువుల షాపులు ఎంతో ఆకర్షణీయ శైలి లో పర్యాటకులను కొనుగోలు చేసేలా చేస్తాయి.

Pic Credit: Arun Katiyar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X