Search
  • Follow NativePlanet
Share
» »చంబా - ఉత్తర భారతదేశంలో అత్యుత్తమ ప్రదేశం !!

చంబా - ఉత్తర భారతదేశంలో అత్యుత్తమ ప్రదేశం !!

హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి. డాల్హౌసీ మరియు కజీహియార్ ఉత్తర ప్రాంత మైదాన వాసులకు ఈ జిల్లాలోని హిల్ స్టేషన్లు సెలవులను గడిపే గమ్యాలుగా ప్రసిద్ధి చెందాయి.

By Mohammad

హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి. ఈ జిల్లాకు చంబా పట్టణం కేంద్రంగా ఉంది. డాల్హౌసీ మరియు కజీహియార్ ఉత్తర ప్రాంత మైదాన వాసులకు ఈ జిల్లాలోని హిల్ స్టేషన్లు సెలవులను గడిపే గమ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 500 నుండి చరిత్రను ఆధారాలతో వ్రాతపూర్వకంగా నమోదుచేసిన ప్రాంతమిదే అని భావిస్తున్నారు. అత్యంత ఎత్తైన పర్వశ్రేణులు ఇక్కడ శతాబ్దాలుగా ఉన్న శిథిలాలలు మరియు అనేక శిలాశాసనాలను సంరక్షిస్తున్నాయి.

ఇది హిమాచల్ ప్రదేశ్ వాయవ్య ప్రాంతంలో ఉంది. 1000 సంవత్సరాలకు పూర్వం చంబా మహారాజు నిర్మిచిన ఆలయాలలో ఇప్పటికీ ఆరాధన నిర్వహించబడుతూ ఉంది. ఆలయాలకు భూమిదానం చేసిన తామ్రపత్రాలు ఇప్పటికీ సంరక్షించబడుతూ చట్టబద్ధమైన విలువను కలిగి ఉన్నాయి.

పర్వతాలకు రారాణి ... కులు మనాలి !పర్వతాలకు రారాణి ... కులు మనాలి !

చరిత్ర

ఈ ప్రాంతంలో ముందుగా కొలియన్ ప్రజలు నివసించారని తెలుస్తుంది. తర్వాత ఈ ప్రాంతం ఔదుంబరాలు, గుప్తులు, ఠాకూరులు మరియు రాణాలు పాలనలో ఉందని భావిస్తున్నారు. దీని గురించి రామాయణ మరియు మహాభారతం మొదలైన పురాణా కావ్యాలలో, వేదాలలో విస్తారంగా వర్ణించబడింది.

విష్ణుమూర్తి ప్రధానదైవం

విష్ణుమూర్తి ప్రధానదైవం

లక్ష్మీనారాయణ ఆలయం చంబా జిల్లాలలో ఇది ఒక పర్యాటక ఆకర్షిత ప్రాంతం. ఇక్కడ విష్ణుమూర్తి ప్రధాన దైవం గా మూడు ఆలయాలు ఉన్నాయి. శివుడు ప్రధానదైవంగా మూడు ఆలయాలు ఉన్నాయి.

చిత్రకృప : Kundansen

కుడ్యశిల్పాలు ప్రఖ్యాతి

కుడ్యశిల్పాలు ప్రఖ్యాతి

దుర్గాదేవి ప్రధానదైవంగా ఉన్న ఆలయం బ్రజేశ్వరి దేవి ఆలయం. ఆలయ కుడ్యశిల్పాలు ప్రఖ్యాతి చెందాయి. ఆలయ నిర్మాణశైలి ఆలయానికి ప్రత్యేకత తీసుకువచ్చింది. శిఖరశైలికి కూడా ప్రత్యేకత ఉంది. ఆలయగోపురం మీద కొయ్యతో చేసిన అమలక ఉంది.

చిత్రకృప : Varun Shiv Kapur

ఉగ్రరూపం

ఉగ్రరూపం

ఈ లోయ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో చాముండా దేవి ఆలయం ఒకటి. ఆలయ ప్రధాన దైవం చాముండాదేవి. చాముండాదేవి అంటే దూర్గాదేవి ఉగ్రరూపం. ఆలయంలో జంతువులు మరియు పూలతో చేసిన కొయ్య శిల్పాలతో కూడిన పైకప్పు ఉంది.

చిత్రకృప : Varun Shiv Kapur

చాముండా దేవి

చాముండా దేవి

పర్వతశిఖరంలో ఉన్న ఈ ఆలయం నుండి చంబా లోయ సుందరదృశ్యం కనిపిస్తూ ఉంటుంది. భక్తులు తమ కోరిక తీరిన తరువాత ఇత్తడి గంటలను దేవికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాముండాదేవి పాదముద్రలు ఉన్నాయి.

చిత్రకృప : Varun Shiv Kapur

సుయీ మాతా ఆలయం

సుయీ మాతా ఆలయం

సుయీ మాతా ఆలయం చంబాదేవి ఆలయం మరియు బ్రజేశ్వరి ఆలయం మద్య ఉంది. ఆలయప్రధాన దైవం సుయీమాత. ఆలయకుడ్యాల మీద చిత్రించిన వర్ణరంజితమైన చిత్రాలు సుయీమాత కథను వివరిస్తుంటాయి.

చిత్రకృప : Vjdchauhan

గాంధీ గేట్

గాంధీ గేట్

బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కర్జన్ 1900లో ఆరంజ్ గేట్ వద్ద మనఃపూర్వక స్వాగతం అందుకున్నాడు. ఇది చంబా లోయకు ప్రధాన ద్వారం.

చిత్రకృప : Kondephy

భూరి సింఘ్ మ్యూజియం

భూరి సింఘ్ మ్యూజియం

భూరి సింఘ్ మ్యూజియంలో పలు పహారి పెయింటింగ్స్ మరియు శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ 18-19 శతాబ్ధాలకు చెందిన బసోహి మరియు కాంగ్రా పెయింటింగ్స్ మొదలైన ప్రఖ్యాత చుత్రాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Kothanda Srinivasan

భూరి సింఘ్ మ్యూజియం

భూరి సింఘ్ మ్యూజియం

7వ శతాబ్ధానికి చెందిన రుమాయి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనిని రాజా భూరీసింగ్ నిర్మించి తన కుటుంబ సేకరణ వస్తువులను ఈ మ్యూజియానికి ఇచ్చాడు. ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసిన చంబా రుమాళ్ళు ఉన్నాయి. వీటిని గృహిణులు తయారుచేస్తారు.

చిత్రకృప : Abhishekjoshi

పండుగలు మరియు ఉత్సవాలు

పండుగలు మరియు ఉత్సవాలు

చంబా జిల్లాలో పలు ఉత్సవాలు జరుగుతుంటాయి. చంబాప్రజల కొరకు ఆత్మాహుతి చేసిన సుయీ రాజకుమార్తె స్మారకార్ధం సుయీమాత ఆలయం మార్చి - ఏప్రిల్ మాసాలలో 4 రోజుల కాలం నిర్వహించబడుతుంది.

చిత్రకృప : ROHEWALMS

చౌరాసి ఆలయం

చౌరాసి ఆలయం

చౌరాసి ఆలయం రావి నదీతీరంలో ఉంది. చంబా పట్టణంలో ఉన్న ఈ ఆలయం 1000 సంవత్సరాల పూర్వం నాటిదని విశ్వసిస్తున్నారు. చంబా నగరం రావినది కుడి తీరంలో ఉన్న పీఠభూమిలో దౌలధార్ మరియు జంస్కర్ పర్వతశ్రేణి మద్య ఉంది.

చిత్రకృప : Ashish Sharma

మానవసమాజం విలసిల్లిన ప్రదేశం

మానవసమాజం విలసిల్లిన ప్రదేశం

చంబా పట్టణాన్ని 10వ శతాబ్దంలో రాజాసాహి వర్మన్ నిర్మించాడు. రాజాసాహి వర్మ కుమార్తె చంపావతి చంబా దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. 1000 సంవత్సరాల నుండి కొనసాగుతున్న నాగరికత, సాంస్కృతిక మరియు అభివృద్ధి చెందిన మానవసమాజం విలసిల్లిన ప్రదేశం ఇది.

చిత్రకృప : Bodhisattwa

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

అసమానమైన నివాసితగృహాల నిర్మాణం మరియు ఆలయాలలోని అద్భుతమైన కొయ్య మరియు లోహ శిల్పాలు, ప్రపంచ ప్రసిద్ధ రుమల్ మరియు చప్పల్ మరియు పహారి పెయింటిగ్స్ ఈ పట్టణ ప్రత్యేకతలు. చంబా పట్టణంలో పలు ఆలయాలు, ప్రత్యేక శైలి భవనాలు మరియు పలు ఆసక్తికరమైన వస్తువులు ఉన్నాయి.

చిత్రకృప : Varun Shiv Kapur

11వ శతాబ్దం కాలం నాటిది

11వ శతాబ్దం కాలం నాటిది

జిల్లాలో చంద్రగుప్తుని రాధాకృష్ణ ఆలయం, శివాలయం మరియు గరీశకర్ ఆలయం ఉన్నాయి. హరిరాయ్ ఆలయం ప్రధాన దైవం విష్ణుమూర్తి. ఇది 11వ శతాబ్దం కాలం నాటిది.

చిత్రకృప : Varun Shiv Kapur

చంబా ఎలా చేరుకోవాలి ?

చంబా ఎలా చేరుకోవాలి ?

విమానాశ్రయం : 185 కి. మీ ల దూరంలో ధర్మశాల లో ఉన్న గగ్గల్ ఎయిర్ పోర్ట్. ఇది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తో చక్కగా అనుసంధానించబడింది.

రైలు మార్గం : పఠాన్కోట్ చంబా సమీపంలో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడికి ఢిల్లీ, శ్రీనగర్, రిషికేష్ తదితర ప్రాంతాల నుంచి రైళ్ళు వస్తుంటాయి.

బస్సు/ రోడ్డు మార్గం : చంబా దాని పొరుగు ప్రాంతాలైన డల్హౌసీ, ఢిల్లీ, సిమ్లా తదితర ప్రాంతాల నుంచి ప్రభుత్వ / ప్రవేట్ బస్సు సదుపాయాలను కలిగి ఉన్నది.

చిత్రకృప : Sabyk2001

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X