Search
  • Follow NativePlanet
Share
» »పోర్ బందర్ - గాంధీ యుగం మొదలైన ప్రదేశం !!

పోర్ బందర్ - గాంధీ యుగం మొదలైన ప్రదేశం !!

పోర్ బందర్ అనే ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఇది ఒక పురాతన ఓడరేవు పట్టణం. దీనిని ఓడరేవు ప్రాంతం అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు కానీ గాంధీ పుట్టిన ప్రదేశం అంటేనే పిల్లలు సైతం గుర్తుపడతారు. ఈ పట్టణం కతిఅబార్ తీరాన కలదు. పోర్ బందర్ లో ఏముందిలే అనుకుంటే మీరు పొరబడినట్లే సుమి! ఇక్కడ మంచి బీచ్ ఒకటుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రధాన సందర్శనీయ ప్రదేశాలలో మొదటిదని చెప్పుకోకతప్పదు ఎందుకంటే ఈ బీచ్ అంత బాగుంటుంది మరి.

దీని గురించి ఒక చిన్న మాట ....

ఈ ప్రదేశం చాలా పురాతనమైనది దీని గురించి చెప్పాలంటే ఇది సుమారుగా ద్వారకా కాలం నాటిదే అని చెప్పాలి. ఈ ప్రదేశం శ్రీ కృష్ణుడి మంచి మిత్రుడు అయిన సుధాముడు జన్మించిన స్థలంగా పురాణాలు చెపుతాయి. అందుకే పోర్ బందర్ ని ‘సుధామ పురి ' అని కూడా పిలుస్తారు. ఇక్కడ జరిపిన తవ్వకాలు హరప్పా నాగరికతను వెల్లడించాయి. మొగలులు, పీశ్వాలు, బ్రిటిష్ వారి కింద పోర్ బందర్ ఒక ప్రధాన వాణిజ్య ఓడ రేవుగా ఓడలు ఈస్ట్ ఆఫ్రికా, అరబ్, పెర్షియన్ గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు చేసేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కథియవార్ ఐక్య రాష్ట్రం ఒప్పందాల మేరకు పోర్ బందర్ గుజరాత్ రాష్ట్రం లో విలీనం అయింది.

ఇక్కడ చూడవాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అందిస్తూ ...

కీర్తి మందిర్

కీర్తి మందిర్

కీర్తి మందిర్ భవనంలో మహాత్మా గాంధీ జన్మించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మూడు అంతస్తులు కలిగిన ఈ పోర్ బందర్ బ్లూ హవేలీ లో 1869 అక్టోబర్ 2 నాడు జన్మించారు. ఇపుడు ఇది కీర్తి మందిర్ గా ప్రసిద్ధి చెందినది. ఇపుడు దీనిని మ్యూజియంగా మార్చి గాంధీ జీవిత విశేషాలతో కల ఫోటోలు, వస్తువులు ఉంచారు. గాంధి ఫిలాసఫీ, సాధన లకు సంబంధించిన కొన్ని పుస్తకాలతో ఒక అందమైన లైబ్రరీ కూడా నిర్వహిస్తున్నారు.

Photo Courtesy: Jaydip3212

పోర్ బందర్ బర్డ్ సంక్చురి

పోర్ బందర్ బర్డ్ సంక్చురి

ఈ బర్డ్ సంక్చురి లో మిగిలిన వాటివలె కాక ప్రకృతి, పక్షులు కలసి జీవనం సాగిస్తాయి. అసలు ఇది ఒక అందమైన పచ్చటి చెట్లు, మొక్కలతో నీటి సరస్సుగా వుండేది. దీనిని 1988లో సంక్చురి గా ప్రకటించి నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పక్షులను మీరు ఇక్కడ చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశ సందర్శనకు వింటర్ అనుకూల సమయం. ఆ సమయంలో ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల పక్షులు వలసలు వస్తాయి.

Photo Courtesy: foto_morgana

బార్దా హిల్స్ వైల్డ్ లైఫ్ సంక్చురి

బార్దా హిల్స్ వైల్డ్ లైఫ్ సంక్చురి

అందమైన ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి రెండు జిల్లాలుకు చెందినది. అవి పోర్ బందర్ మరియు జం నగర్. ఈ సంక్చురి పోర్బందర్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ఒక రిజర్వు ఫారెస్ట్ కాగా 1979లో సంక్చురిగా ప్రకటించారు. అందమైన కొండ మార్గాలతో, మైదాన భూమితో, చిన్నపాటి నీటి వాగులతో, చుట్టూ పచ్చని అడవి మరియు వ్యవసాయ భూములు కలిగి వుంటుంది. అరేబియా సముద్రం నుండి 15 కి.మీ.ల దూరంలో వుంది. ఆ ప్రాంతానికి సముద్రపు ఉప్పు తగలకుండా కాపాడుతుంది. కనుమరుగవుతున్న అనేక జంతువులు, పక్షులు, పాములు , ఈ సంక్చురిలో కలవు. ఈ సంక్చురి సుమారు 192.31 చ.కి.మీల విస్తీర్ణం లో వుండి ఎన్నో ఔషధ మొక్కలను కూడా కలిగి వుంది. ఇక్కడ రెండు చిన్న నదులు కూడా ప్రవహిస్తున్నాయి.

Photo Courtesy: telugu nativeplanet

పోర్ బందర్ బీచ్

పోర్ బందర్ బీచ్

పోర్ బందర్ బీచ్ ని "చౌ పాటి" అని కూడా అంటారు. 2003 లో దీనిని పునరిద్ధరించారు. సందర్శకులు కూర్చుని విశ్రాంతి పొందేందుకు ఇక్కడ సీటింగ్ ఏర్పాట్లు కలవు. పిల్లలకు వినోద సౌకర్యాలు కలవు. ప్రతి సంవత్సరం చౌ పాటి లో కృష్ణాష్టమి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.

Photo Courtesy: Umang Dutt

హుజూర్ పాలస్

హుజూర్ పాలస్

హుజూర్ పాలస్ ను రానా నట్వర్ సింగ్ జి అంటే పోర్ బందర్ చివరి పాలకుడు నిర్మించాడు. దీనిని 20 శతాబ్దపు మొదటి భాగం లో టవున్ లోని మెరైన్ డ్రైవ్ సముద్రపు ఒడ్డున నిర్మించారు. ఈ మహల్ చూడటానికి బహు ముచ్చటగా ఉంటుంది. ఇక్కడికి నుంచి సముద్రపు అందాలను వీక్షించవచ్చు.

Photo Courtesy: Jethwarp

పోర్ బందర్ ఎలా చేరుకోవాలి ??

పోర్ బందర్ ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

పోర్ బందర్ కు కొత్త టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ప్రతి రోజూ ముంబై కు పోర్ బందర్ ఎయిర్ పోర్ట్ నుండి విమానాలు నడుస్తాయి.

రైలు ప్రయాణం

పోర్ బందర్ పట్టణం రైలు స్టేషన్ దేశం లోని అన్ని ప్రధాన స్టేషన్ లకు కలుపబడి వుంది. ఒఖా, రాజ్ కోట్, ముంబై , భం వాడ లకు ప్రతి రోజూ రైళ్ళు కలవు. ఢిల్లీ, మోతిహారి,హవురా లకు కూడా ట్రైన్ లు కలవు.

రోడ్డు ప్రయాణం

పోర్ బందర్ సిటీ రాజ్ కోట్ మరియు అహ్మదాబాద్ లకు నేషనల్ హై వే 8 బి ద్వారా కలుపబడి వుంది. ద్వారక, జామ్ నగర్ లకు ఉత్తర దిశలోనూ భావ నగర్, వేర్వాల్ లకు దక్షిణ దిశలో నేషనల్ హై వే 8 ఈ ఎక్స్టెన్షన్ ద్వారా కలుపబడి వుంది.

Photo Courtesy: gujarat.co.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X