అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

బాంధవ్ ఘర్ - పాండవులు వేటాడిన ప్రాంతం !

Written by:
Published: Thursday, May 19, 2016, 17:27 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

పులులకు దేశంలో ఎన్ని స్థావరాలు ఉన్నప్పటికీ, బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్) వాటన్నింటికంటే ప్రత్యేకమైనది. ఒకసారి చరిత్ర లోకి తొంగి చూస్తే .. రేవా మహారాజా యొక్క వేట ప్రాంతం ఈ బాంధవ్ ఘర్. పూర్వం రాజులు తీరిక వేళల్లో, ఖాళీ సమయాల్లో 'వేట' అనే సాహస క్రీడను ఆడేవారు. ఇది రాజుల ఆచారం కాబోలు ..! బహుశా రాజులై ఉండటం వల్లనేనేమో .. ! అలనాడు పాండవులు కూడా అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో 'వేట' కై వచ్చేవారని తెలుస్తుంది. దీనికీ కారణం పన్నా(182 కి.మీ) అయి ఉండవచ్చు.

మీకు మరింత సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి : పాండవుల గుహలు, జలపాతాలు !

రేవా మహారాజు 'వేట' చేసాడనటానికి నిదర్శనం అక్కడ కనిపించే కోట (అప్పట్లో రాజులు అడవుల్లో గెస్ట్ హౌస్ లు, కోటలు నిర్మించుకోనేవారు). బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ కాకమునుపు, ఇది వేటగాళ్ళ కు స్థావరంగా ఉండేది. ఆ తరువాత దీన్ని భారత ప్రభుత్వం 1968 లో నేషనల్ పార్క్ గా ప్రకటించి 'జంతువుల వేట' పై నిషేధం విధించింది. పులుల సంరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టి, వాటి సంఖ్యను అధికం చేసింది. ఇప్పుడు మనముందు భాంధవ్ ఘర్ ని పులుల స్థావరంగా, దేశంలో గర్వించదగ్గ నేషనల్ పార్క్ గా నిలబెట్టింది.

బాంధవ్ ఘర్ - సందర్శనీయ స్థలాలు

బాంధవ్ ఘర్ లో చూడటానికి పార్క్, అందులోని కోట మాత్రమే కాదు ... చుట్టుపక్కల చూడటానికి ఎన్నో స్థలాలు ఉన్నాయి. మ్యూజియం, గుహలు, వ్యూ పాయింట్ లు, జలపాతాలు వాటిలో కొన్ని .. !

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్, వింధ్యా పర్వతాల వద్ద సుమారు 400 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. పార్క్ లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎత్తుపల్లాల అడవులు, ఏటవాలు గట్లు, మైదానాలు కనిపిస్తాయి. అలా ఇంకొద్ది దూరం లోపలి నడుచుకుంటూ వెళితే ఒక్కోప్రాంతం .. ఒక్కో టూరిస్ట్ స్పాట్ ను తలపిస్తుందనుకోండీ ..!

చిత్ర కృప : meenakshi madhavan

 

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ - వన్య సంపద

బాంధవ్ ఘర్ పార్క్ పులుల స్థావరం. వందల సంఖ్యలో ఇక్కడ పులులు సంచరిస్తుంటాయి. హైనా, ఆసియా నక్క, రాతెల్, స్లోత్ బియర్, గ్రీ మంగూస్ మరియు చిరుత మొదలైనవి గమనించవచ్చు. 22 రకాల కంటే ఎక్కువ క్షీరదాలు, 250 రకాల పైగా పక్షులు ఈ నేషనల్ పార్క్ లో ఉన్నాయి.

చిత్ర కృప : JP Bennett

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ - సఫారీ

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ ని సందర్శించటానికి ముందుగా అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఏనుగు లేదా జీప్ సఫారీ ల ద్వారా పార్క్ అంతా చుట్టిరావచ్చు.

చిత్ర కృప : Adam Whittaker

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ - సఫారీ సమయం

సఫారీ రోజుకు రెండు సార్లే ..!

ఉదయం షిఫ్ట్

5:30 - 6:30 మధ్యలో మొదలై 10:00 -11:00 మధ్యలో ముగుస్తుంది.

సాయంత్రం షిఫ్ట్

మధ్యాహ్నం 2:30 - 3:30 మధ్యలో మొదలై సాయంత్రం 5:30 - 6:30 మధ్యలో ముగుస్తుంది.

చిత్ర కృప : Fission Xuiptz

 

 

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ - వసతి

నేషనల్ పార్క్ లో అడవుల మధ్య ఒక రోజు రాత్రి విశ్రాంతి పొందేందుకై రిసార్ట్ లు ఉన్నాయి. ఇక్కడ మీకు అన్ని రకాల వసతులు లభిస్తాయి. హెరిటేజ్ రిసార్ట్, మహారాజా రిసార్ట్, జంగల్ లాడ్జ్, కింగ్స్ లాడ్జ్, సల్వన్ రిసార్ట్ మరియు ట్రీ హౌస్ రిసార్ట్ లు మొదలైన రిసార్ట్ లు చక్కని వసతిని అందిస్తాయి.

చిత్ర కృప : Bhavin Toprani

బాంధవ్ ఘర్ ఫోర్ట్

బాంధవ్ ఘర్ కోట ఫలానా వారు కట్టించారని ఎక్కడా పేర్కొనలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం నాటిదాని భావిస్తారు. ఈ కోట ఎందరో రాజవంశాల కు ఆహ్వానం పలికింది. కోటలోని వృక్ష, జంతు జాలాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. టైగర్ రిజర్వ్ ఏరియా లో ఉన్నందున ప్రస్తుతం కోట, పులి పిల్లల స్థావరం అయి ఉండవచ్చని తెలుస్తుంది.

చిత్ర కృప : Vaibhav Gokhale

బాంధవ్ ఘర్ కొండ

రిజర్వ్ ఫారెస్ట్ లోని బాంధవ్ ఘర్ కొండ సముద్ర మట్టానికి 807 మీటర్ల ఎత్తులో కలదు. ఇక్కడ నుండి ఎన్నో జలపాతాలు పుట్టాయి, ప్రవహిస్తున్నాయి. సహజ సిద్ధ సౌందర్యానికి, చల్లటి వాతావరణానికి బాంధవ్ ఘర్ కొండలు ప్రసిద్ధి చెందినాయి.

చిత్ర కృప : McShug

బాగెల్ మ్యూజియం

బాగెల్ మ్యూజియం, ఈ ప్రాంతపు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇందులో మహారాజు వాడిన వస్తువులు, అతనికి సహాయపడిన మోహన్ అనే పేరుగల తెల్ల పులి శరీరాన్ని ప్రదర్శనకై ఉంచారు. బాంధవ్ లోని ఆటవిక జీవనం మరియు రాచరిక జీవన విధానాన్ని తెలుసుకొనేందుకు పర్యాటకులు మ్యూజియానికి తరలివస్తారు.

చిత్ర కృప : monknneupsy

క్లైమ్బర్స్ పాయింట్

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ లోని క్లైమ్బర్స్ పాయింట్ ఒక చక్కని వ్యూ పాయింట్. సాహసికులు కొండపై ఎక్కి చుట్టూ ఉన్న ప్రకృతిని, వన్య మృగాలను చూస్తూ ఆనందం పొందవచ్చు. ఈ పాయింట్ సముద్ర మట్టానికి 13000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

చిత్ర కృప : Samir Singh

బాంధవ్ ఘర్ పురాతన గుహలు

బాంధవ్ ఘర్ కొండ పై ఉన్న ఇసుక రాతి తిప్పల పై బాంధవ్ ఘర్ పురాతన గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 5 కి. మీ ల పొడవున్న 39 గుహలను చూడవచ్చు. గుహలపై బ్రహ్మలిపి లో రాసిన శాశనాలు, ఏనుగు, గుర్రం, పులి చెక్కడాలను గమనించవచ్చు. ప్రస్తుతం ఈ గుహలు గబ్బిలాలకు మరియు ఇతర పక్షి, జంతు జాలాలకు స్థావరంగా ఉన్నది.

చిత్ర కృప : Larry Probst

శేషశయ్య

65 అడుగుల ఎత్తున్న మహా విష్ణు విగ్రహం ఈ శేషశయ్య. బాంధవ్ గర్ కొండలపై ఉన్న ఈ ప్రాంతానికి కేవలం నడక ద్వారానే చేరుకోగలరు. పేరులో సూచించినట్లుగా శేష నాగు అనబడే ఏడు పడగల పాము పై శ్రీ మహా విష్ణువు శయనిస్తున్న భంగిమలో కనిపిస్తారు. విష్ణుమూర్తి పాదాల వద్ద నుండి చరమగంగా నది ఉద్భవించిందని, ఆ నీరు పవిత్రమైనదని పురాణాల గాధ.

చిత్ర కృప : mp travelogue

ఘర్పురి డ్యాం

బాంధవ్ ఘర్ నుండి 10 కి. మి. ల దూరంలో నీటి పక్షులతో కనువిందు చేసే ఘర్పురి డ్యాం కలదు. బ్లాకు ఐబిస్, సారస్ క్రేన్, ఎగ్రేట్, పైడ్ వాగ్ టైల్, రెడ్-వాట్ట్లేడ్ లాప్వింగ్, లెస్సెర్ అడ్జుతంట్ స్తోర్క్, ఇండియన్ పాండ్ హెరాన్ మరియు కామన్ అండ్ పైడ్ కింగ్ ఫిషర్ వంటి నీటి పక్షులని తరచూ ఈ ప్రాంతం లో గమనించవచ్చు.

చిత్ర కృప : Shivangi Sinha

ఘోరడేమాన్ జలపాతం

బాంధవ్ ఘర్ రిజర్వ్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఈ జలపాతం ఒకటి. నిశబ్దంగా ఉండే అడవి పరిసరాల్లో ఈ జలపాత శబ్దాలు ఒకింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇది చూడకపోతే బాంధవ్ ఘర్ పర్యటన అసంపూర్తిగా ఉంటుంది.

చిత్ర కృప : wildflower resort

తాలా గ్రామం

తాలా గ్రామం వైల్డ్ లైఫ్ రిజర్వ్ లో లోయస్ట్ పాయింట్. ఈ గ్రామం రొమాంటిక్ స్పాట్ గానే కాకుండా సాహసోపేతమైన ట్రెక్కింగ్ ప్రదేశంగా పేరుగాంచింది. హాలి డే లలో ఈ గ్రామంలో గడిపితే ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పొందవచ్చు.

చిత్ర కృప : Akhilesh Bharos

బాంధవ్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బాంధవ్ ఘర్ కు 169 కి.మీ ల దూరంలో జబల్పూర్ విమానాశ్రయం కలదు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, భోపాల్ తదితర నగరాల నుండి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ / టాక్సీ లలో ప్రయాణించి బాంధవ్ ఘర్ చేరుకోవచ్చు

రైలు మార్గం

100 కి.మీ ల దూరంలో ఉన్న 'కత్ని' బాంధవ్ ఘర్ కు సమీప రైల్వే స్టేషన్. ఢిల్లీ, వడోదర, లక్నో, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి నిత్యం రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

బాంధవ్ ఘర్ కు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు మరియు ప్రవేట్ బస్సులు అందుబాటు ధరల్లో లభిస్తాయి.

చిత్ర కృప : Scott Reinhard

 

English summary

tiger reserves bandhavgarh national park madhya pradesh

Making a magnificent trip to Bandhavgarh will definitely take you to the lush greenery of the forested regions that are incredibly the natural abode of the variant of wild species.
Please Wait while comments are loading...