Search
  • Follow NativePlanet
Share
» »పునలూర్ లో సమీపంలో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

పునలూర్ లో సమీపంలో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

పునలూర్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నగరానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పునలూర్ గుండా కల్లాడ నది ప్రవహిస్తుంది. ఈ పట్టణాన్ని 'పడమటి కనుమల ఒడి' అని పిలుస్తుంటారు. తమిళ మరియు మళయాళ భాషల్లో పునలూర్ అంటే అర్థం నీటి ఊరు అని. దీనిని సింపుల్‌గా ది టౌన్ ఆఫ్ వాటర్ గా అభివర్ణిస్తుంటారు యాత్రికులు.

అబ్బా ..!! అంతగా చూసే విధంగా పునలూర్ పట్టణంలో ఏమి ఉన్నాయో ... అనేగా మీ ప్రశ్న ?? అదే ... అదే తొందరపడమాకండి ఆ విషయానికే వస్తున్నాను. బొత్తిగా ఓపిక లేకుండా పోయింది. సరే చెప్పేస్తున్నాను ఇక్కడి ప్రధాన ఆకర్షణ వ్రేలాడే వంతెన. దీని మీద రైళ్లు చుక్ ... చుక్ .. చుక్ ... అంటూ కూత పెట్టుకుంటూ తిరుగుతుంటాయి. అవేవో బొమ్మల రైళ్లు అనుకొనేరు కాదండి బాబోయ్ ..! మనం ప్రయాణించే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ వంటి రైళ్లు.

సమయం ఉంటే ఇది కూడా చదవండి : తిరువనంతపురం - ది వండర్ లాండ్ ఆఫ్ కేరళ !

పునలూర్ లో ఇదొక్కటేనా లేక ఇంకేమైనా ఉన్నాయా ? అనే మీ సందేహానికి కాస్త పులుస్టాప్ పెట్టండి. ఇక్కడ ఇదొక్కటే కాదు చూడటానికి చాలానే ఉన్నాయి. సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో తేన్మల అనే హిల్ స్టేషన్ ఉన్నది. ఇక్కడ తేనె (నోరూరు తుంది కదూ!) సహజ సిద్ధంగా దొరుకుతుంది. ఈ తేనె లో చాలా ఔషధగుణాలు ఉన్నాయని వైద్యులు సైతం చెబుతుంటారు.

సైట్ సీయింగ్ ప్రియులకు పునలూర్ ఒక చక్కటి ప్రదేశం. ఇక్కడ హైకింగ్, లాంగ్ జంపింగ్, మౌంటెన్ బైకింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటివి చేయవచ్చు. అలాగే పాలరువి జలపాతం, ఎకో టూరిజం ప్రాజెక్ట్ లోని జోన్లను చూడవచ్చు. ఎడ్వెంచర్ లేదా విశ్రాంతి ఏదైనప్పటికీ యాత్రికులకి మాత్రం ఈ ప్రదేశం స్వర్గం వలె ఉంటుంది. పునలూర్ లో సమీపంలో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ...

పట్టాజీ దేవి దేవాలయం, పునలూర్

పట్టాజీ దేవి దేవాలయం, పునలూర్

శబరిమలై దర్శనానికి వెళ్లే భక్తులు అందరూ పునలూర్ పట్టణ సౌందర్యాన్ని తప్పక సందర్శిస్తారు. ఇక్కడ పురాతన దేవాలయమైన పట్టాజీ దేవి దేవాలయం ఒక ఆకర్షణీయమైన ప్రదేశం. పండుగల సమయాల్లో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసి ఉంటుంది.

చిత్ర కృప : PUNALUR NANDHAN

వ్రేలాడే వంతెన, పునలూర్

వ్రేలాడే వంతెన, పునలూర్

పునలూర్ లో మొట్టమొదట మీరు చూడవలసినది వ్రేలాడే వంతెన. దీనిని క్రీ.శ.1877 వ సం. లో బ్రిటీషర్ ఆల్బర్ట్ హెన్రీ నిర్మించాడు. అప్పట్లో ఈ వంతెనను నిర్మించడానికి 6 సంవత్సరాలు పట్టిందట. ఆ తరువాత బ్రిడ్జ్ ని వాహనాల రాకపోకలు కొరకు ఉపయోగించారు.

చిత్ర కృప : Jpaudit

వ్రేలాడే వంతెన, పునలూర్

వ్రేలాడే వంతెన, పునలూర్

మొదట పునలూర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడవాలంటే ప్రజలు భయపడేవారు. ఇది గమనించిన హెన్రీ ఆ భయం పోగొట్టేందుకు తానే రంగంలోకి దిగి, బ్రిడ్జ్ మీద అరడజను పైగా ఏనుగులను నడిపించాడు. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి వంతెన కింద బోట్ షికారు చేశాడు. దాంతో ప్రజలు భయాన్ని వీడి వంతెన మీద వాహనాలను నడపటానికి సిద్ధమయ్యారు.

చిత్ర కృప : Sandeep545

వ్రేలాడే వంతెన ఎందుకు కట్టించారు ?

వ్రేలాడే వంతెన ఎందుకు కట్టించారు ?

వన్యజంతువులు పునలూర్ పట్టణంలో రాకుండా నివారించడానికి వ్రేలాడే వంతెనలు నిర్మించారు. కాంక్రీట్ వంతెంలైతే జంతువులు వస్తాయని, వ్రేలాడే వంతెన అయితే కదిలి భయపడిరావని నిర్మించారు. ఈ వంతెనను 100 అడుగుల లోతుగల బావుల ఆధారంగా కట్టించినారు. దీంతో పాటు ఎకో టూరిజం ప్రాజెక్ట్ లో భాగమైన శంధురాని అడవి మరొక ప్రధాన ఆకర్షణగా ఉంది.

చిత్ర కృప : Sktm14

ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, పునలూర్

ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, పునలూర్

పునలూర్ లో ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ కలదు. దీనిని 2001 వ సంవత్సరంలో 3500 చ. కి. మీ. విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. ఇక్కడ సుమారు 2000 పైచిలుకు రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వినియోగిస్తారు. పులులు, ఆసియా ఖండపు ఏనుగులు, మరియు నీలగిరి తాహ్ర్ జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయు.

చిత్ర కృప : VS Ramachandran

తేన్మల, పునలూర్

తేన్మల, పునలూర్

పునలూర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేన్మల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం తేనె (హనీ) కి ప్రసిద్ధి. ఈ తేనెలో ఎన్నో ఔ షధ గుణాలున్నాయని స్థానికులు నమ్ముతారు. వైద్యులు సైతం ఈ తేనె వాడకాన్ని సమర్ధిస్తారు. అందుకే కాబోలు ఈ ప్రదేశానికి హిల్ ఆఫ్ హనీ గా పేరొచ్చింది.

చిత్ర కృప : Pappadi

తేన్మల, పునలూర్

తేన్మల, పునలూర్

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తేన్మల ఎకో టూరిజాన్ని ఏర్పాటుచేశారు. దీనిని 5 ప్రధాన జోన్ లుగా విభజించారు. అవి కల్చరల్ జోన్, అడ్వెంచర్ జోన్, విశ్రాంతి జోన్, డీర్ సంరక్షణ శాఖ మరియు బోటింగ్ జోన్ లుగా కలవు.

చిత్ర కృప : Enjo Mathew

తేన్మల లో ఆనందించాల్సినవి

తేన్మల లో ఆనందించాల్సినవి

తేన్మల హిల్ స్టేషన్ అనేక సాహస క్రీడలకు, వినోదాలకు నిలయంగా ఉన్నది. బోటింగ్, రోప్ బ్రిడ్జ్, ట్రెక్కింగ్, పర్వతారోహణ బైకింగ్ మరియు మ్యూజికల్ ఫౌంటేన్ వంటివి ఇక్కడ ఆనందించాల్సిన క్రీడలు.

చిత్ర కృప : anulal

లేళ్ళ పార్కు, తేన్మల

లేళ్ళ పార్కు, తేన్మల

తేన్మల లో గల లేళ్ళ పార్కు పూలనూర్ లో గల అదనపు ఆకర్షణ. ఇక్కడ అనేక రకాల లేళ్లు చూడవచ్చు. పార్కులో నిర్మించిన చెట్టు నివాసాలు మీకు ఒక మంచి విశ్రాంతి నివాసంగా అనిపిస్తాయి.

చిత్ర కృప : Bimal K C

పాలరువి జలపాతాలు, తేన్మల

పాలరువి జలపాతాలు, తేన్మల

పాలరువి జలపాతాలు గురించి చెప్పాలంటే, అదొక పాలధార అనే చెప్పాలి. కేరళ - తమిళనాడు సరిహద్దులలో ఈ జలపాతాలు వుంటాయి. నురగలు కక్కే ప్రవాహాలు వెండి రంగులో చల్లని ధారలతో చూచే వారికి ఒక అద్భుతంగా అనిపిస్తుంది.

చిత్ర కృప : anulal

పాలరువి జలపాతాలు, తేన్మల

పాలరువి జలపాతాలు, తేన్మల

పాలరువి జలపాతాలు, కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే 4 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాలి. సందర్శకులకు చుట్టూ ఉండే జలపాతాలు, అడవులు ఎల్లప్పుడూ పచ్చగా కనిపిస్తాయి. ఎంతో ఆకర్షణీయమైన ఈ ప్రదేశం యువకులకు, జంటలకు మరియు కుటుంబాలకు తగిన విహార ప్రదేశం.

చిత్ర కృప : Sajith's Impressions

ట్రెక్కింగ్, తేన్మల

ట్రెక్కింగ్, తేన్మల

ఆనందోత్సాహాలతో వుండే వారికి సాహస ప్రియులకు ట్రెక్కింగ్ అనే పదం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 రోజుల ట్రెక్కింగ్ టూర్లు కలవు. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్ టూర్లు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.

చిత్ర కృప : Sen SD

పక్షి సందర్శన, తేన్మల

పక్షి సందర్శన, తేన్మల

చెండురూనీ అభయారణ్యంలో పక్షి సందర్శకులకు పక్షులను సందర్శించే అవకాశం కలదు. పర్యాటకులు పక్షి సందర్శనను కూడా బాగా ఆనందించగలరు. తేన్మల నేషనల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ నిర్వహించే ట్రెక్కింగ్ లో కూడా పర్యాటకులు పాల్గొనవచ్చు.

చిత్ర కృప : Frozen With Time

బైక్ ప్రియులకు ...

బైక్ ప్రియులకు ...

మిరిస్తిక స్వామ్ప్ కు 4 కి. మీ. కల చిన్న ట్రెక్కింగ్ దూరం పర్యాటకులను ఉత్సాహభారితులను చేయటమే కాక ఎన్నోప్రాంత వివరాలను అందిస్తుంది. బైకర్లు ఈ ప్రాంతాన్ని వారి సాహసకార్యాలకు ఎంతో ఇష్టపడతారు. బైకింగ్ చేసే సమయంలోనే బర్డ్ వాచింగ్ కూడా చేయవచ్చు.

చిత్ర కృప : Sreejith Bharathan

కుతులపూజ, తేన్మల

కుతులపూజ, తేన్మల

కులతుపూజ కొల్లం జిల్లా కు చెందిన ఒక అందమైన గ్రామం. తేన్మల హిల్ స్టేషన్ కి ఇది సమీపంలో ఉంటుంది. కులుతుపూజ దాని శాస్త దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ బాల శాస్త దేవి అంటే హరిహర ప్రియ ప్రధాన దైవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించే ప్రధాన పండుగ విష్ణు మహోత్సవం భక్తులను మరియు పర్యాటకులను ఒకే రకంగా ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : keralapilgrim centers.com

కుతులపూజ, తేన్మల

కుతులపూజ, తేన్మల

కుతులపూజ గ్రామంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 1000 కి.మీ. ల విస్తీర్ణంలో కలదు. కులతుపూజ కు సమీపంలో రాక్ వుడ్ ఎస్టేట్ మరియు శెండురిని వైల్డ్ లైఫ్ శంక్చురి లు ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామంలో ఇంకా చూడాలంటే మూడు అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Arun nambiar

ఆర్యంకావు, తేన్మల

ఆర్యంకావు, తేన్మల

ఆర్యంకావు తేన్మల లోని ఒక లోతైన లోయ ప్రాంతం. ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అని అంటారు. ఇక్కడి శాస్త దేవాలయంలో స్వామి అయ్యప్ప ప్రధాన దైవం. ఇక్కడ జరిగే మండల పూజ సమయంలో భక్తులు వేలకొలది వస్తుంటారు.

చిత్ర కృప : Biju CR

ఆర్యంకావు, తేన్మల

ఆర్యంకావు, తేన్మల

ఆర్యంకావు గ్రామం చేరువలో కమదనపర శాండాల్ ఫారెస్ట్ (గంధపు అడవి) ఉన్నది. అలాగే 11 కి. మీ. దూరంలో ఉన్న రోజ్ మేళ మరో ఎకో టూరిజం ప్రదేశం.

చిత్ర కృప : Enjo Mathew

పునలూర్ డామ్

పునలూర్ డామ్

పునలూర్ లో పైనాపిల్స్, ఫ్లైవుడ్, పెప్పర్ మరియు కలప కు బాగా ప్రసిద్ధి. దీనితో పాటు ఇక్కడ చూడవలసిన మరో ప్రదేశం కల్లాడ నది పై నిర్మించిన డామ్.

చిత్ర కృప : Kumar Mullackal

పునలూర్ ఎలా చేరుకోవాలి ?

పునలూర్ ఎలా చేరుకోవాలి ?

పునలూర్ కి రోడ్డు, రైలు మరియు విమాన సౌకర్యాలు చక్కగా ఉన్నాయి.

విమాన మార్గం

పునలూర్ కి సమీప విమానాశ్రయం 75 కి. మీ. దూరంలో ఉన్న తిరువనంతపురం విమానాశ్రయం. ఇక్కడి నుండి పునలూర్ చేరేందుకు టాక్సీ లు, బస్సులు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

పునలూర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది కొల్లాం - మధురై రైలు మార్గంలో కలదు. ఇక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలకు మరియు చెన్నై, మధురై, బెంగళూరు, తిరువనంతపురం నగరాలకు సైతం రైళ్లు బయలుదేరుతాయి.

రోడ్డు మార్గం

పునలూర్ చక్కటి రోడ్డు వ్యవస్థను కలిగి ఉంది. ఈ పట్టణం గుండా పోయే రహదారి కేరళ రాష్ట్రంలోనే అతి పొడవైనది. పునలూర్ ను కొల్లం - తిరుమంగళం రోడ్డు రహదారి నెంబర్ 208 ద్వారా కూడా చేరవచ్చు.

చిత్ర కృప : anup devaraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X