Search
  • Follow NativePlanet
Share
» »చత్ర - సుందర దృశ్యాల పట్టణం !

చత్ర - సుందర దృశ్యాల పట్టణం !

By Mohammad

చత్ర .. నగరాన్ని 'జార్ఖండ్ ప్రవేశ ద్వారం' అని కూడా పిలుస్తారు. ఈ నగర వాతావరణం బిజీ లైఫ్ కు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటుంది. సాహస ప్రియులకు, ఫోటో గ్రాఫర్ లకు ఇక్కడి అడవులు, జలపాతాలు, సుందర దృశ్యాలు, ఫౌంటెన్ లు చక్కటి అనుభూతులను ఇస్తాయి.

ఇది కూడా చదవండి : ధన్ బాద్ - భారతదేశపు బొగ్గుల రాజధాని !

చత్ర చుట్టుపక్కల ప్రదేశాలు

చత్ర లో చూడటానికి ఎన్నో అటవీ అందాలు, జలపాతాలు కలవు. వాటిలో బిచికిలియా, దౌరి, ఖాయా బనురూ, కేరిడా, మలూడా, బరుప షరీఫ్ మరియు గోగ్రి ముఖ్యమైనవి. ఇంకనూ ఇక్కడ మీరు భాడులి, తామసిన్ మరియు కొల్హు హిల్ చూడవచ్చు . ఔషధ తయారీలో వాడే అనేక మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. చత్ర అడవుల్లో అనేక జంతువులను చూసి ఆనదించవచ్చు. ఇక పోతే, 'వేడినీటి బుగ్గ' ఇక్కడి ప్రధాన ఆకర్షణ లలో ఒకటిగా ఉన్నది.

ఇది కూడా చదవండి : గిరిదిహ్ - కొండలు, గుట్టలు గల భూమి !

బిచికీలియా జలపాతాలు

బిచికీలియా జలపాతాలు

గలగల పారే బిచికీలియా జలపాతాలు ఎంతో దూరంలో ఉండే పర్యాటకులను సైతం ఆకర్షిస్తాయి. కేవలం ప్రకృతి ప్రియులకే కాదు, సహస ప్రియులను కూడా ఈ ప్రదేశం ఆకట్టుకుంటుంది.

చిత్ర కృప : Aniket Prabhakar

బిచికీలియా జలపాతాలు

బిచికీలియా జలపాతాలు

సమీపంలోని కొండ పై కి ట్రెక్కింగ్ చేస్తూ ... అద్భుతమైన సుందర దృశ్యాలను చూస్తూ ఆనందించవచ్చు. జలపాతాలు చత్ర పట్టణానికి 11 కి. మీ. దూరంలో ఉంటాయి.

చిత్ర కృప : shymal nandy

కొల్హు హిల్

కొల్హు హిల్

కొల్హు హిల్ చత్ర ఆకర్షణలలో ఒకటి. ఇక్కడి కొండ పై నుండి ప్రకృతి దృశ్యాలు అందంగా కనిపిస్తాయి. సంవత్సరానికి రెండు సార్లు జరిగే కొల్హుమేళా ఇక్కడ ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Anjan Malik

కౌలేశ్వరి దేవి ఆలయం

కౌలేశ్వరి దేవి ఆలయం

భక్తులు కౌలేశ్వరి దేవి ఆలయాన్ని చేరుకోవటానికి ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది. కొల్హు హిల్ పై ఉండే ఈ ఆలయాన్ని క్రీ.శ. 10 వ శతాబ్దంలో నిర్మించినట్లు అక్కడి రాతి శాశనాల ద్వారా తెలుస్తుంది.

చిత్ర కృప : swetank kumar sharma

కౌలేశ్వరి దేవి ఆలయం

కౌలేశ్వరి దేవి ఆలయం

కౌలేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించటానికి హిందువులే కాక, బౌద్ధులు, జైనులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవతను జార్ఖండ్ రాష్ట్రంలోని కోయతెగ (గిరిజన తెగ) వారు అధికంగా పూజిస్తారు. వసంత పంచమి, శ్రీ రామ నవమి ఉత్సవాలు గుడి లో బ్రహ్మాండంగా జరుగుతాయి

చిత్ర కృప : Loupiote

కుండా కేవ్

కుండా కేవ్

చత్ర లో 'కుండా' ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి కొద్ది దూరంలో కుండా గుహల శిధిలాలు కానవస్తాయి. ఈ గుహలు క్రీ.శ. 17 -క్రీ.శ. 18 వ శతాబ్దానికి చెందినవిగా పురావస్తువేత్తలు గుర్తించారు.

చిత్ర కృప : Anudinam.org

చత్ర ఎలా చేరుకోవాలి ?

చత్ర ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - రాంచి ఎయిర్ పోర్ట్ (150 కి. మీ )

సమీప రైల్వే స్టేషన్ - గయ రైల్వే స్టేషన్ (90 కి. మీ). ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం - చత్ర కు సమీప నగరాల నుండి , పట్టణాల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు దొరుకుతాయి. రాంచి నుండి కూడా ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తేలికగా లభిస్తాయి.

చిత్ర కృప : monu explorer

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X