అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఫతేపూర్ సిక్రీ - అక్బర్ కట్టించిన సుందర నగరం !

Written by:
Published: Thursday, July 28, 2016, 13:03 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా కు చెందిన ఒక నగరం. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించబడిన ఫతేపూర్ సిక్రీ మొఘల్ సంస్కృతి, నాగరికతలకు సాక్ష్యంగా నిలుస్తుంది.

ఫతేపూర్ సిక్రి లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఇక్కడి ఎరుపు ఇసుక రాయితో నిర్మించిన ప్రసిద్ధ కట్టడాలన్ని హిందూ, పర్షియన్, భారత-ముస్లిం సంప్రదాయాలను తమ నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి. బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని కట్టడాలు దివాన్-ఏ-ఆమ్, దౌలత్ ఖానా, జామా మసీదు, బులంద్ దర్వాజా, ఇబాదత్ ఖానా, అనూప్ తలావ్, హుజ్రా-ఏ-అనూప్ తలావ్, మరియం-ఉజ్-జామాని భవనం మొదలైనవి చూడవచ్చు.

ఇది కూడా చదవండి : అందాల తాజ్ ... చిత్రాలు !

ఇది కూడా చదవండి : తాజ్ మహల్ ను పోలిన 6 సుందర కట్టడాలు !

బులంద్ దర్వాజా

బులంద్ దర్వాజా ను గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన 15 అంతస్తుల రాతి నిర్మాణం సాధారణ పర్షియన్-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ప్రశాంతమైన దృశ్యాలను, గోడలపై ఉన్న అందమైన కళను చూసి ఆనందించడానికి అనేక మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు.

చిత్ర కృప : bhanuk2009

జమా మసీదు

జమా మసీదు రాజభాన సమూహాలలో ఇది మొదటిదని భావించవచ్చు. మసీదులోని కుడ్యాల వ్రాతల ద్వారా మసీదు నిర్మాణం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. మసీదు నిర్మాణం పూర్తి అయిన ఐదు సనత్సరాల తర్వాత బులంద్ గేట్ నిర్మించబడింది. జుమా మసీదు ఇండియన్ మసీదు శైలిలో నిర్మించబడింది.

చిత్ర కృప : Diego Delso

సలీం చిష్టి సమాధి

షేక్ సలీం చిష్తి సమాధి 16 శతాబ్దం ప్రారంభంలో కట్టిన అందమైన, అద్భుతమైన కట్టడం. ఈ అందమైన చతురస్రాకారపు చలువరాయి సమాధి భారతదేశంలోని మొఘల్ నిర్మాణశైలికి ఉత్తమ ఉదాహరణ. బులంద్ దర్వాజాకి ఎదురుగా జానానా రౌజా దగ్గరలో ఈ సమాధి ఉంది.

చిత్ర కృప : Marcin Białek

దివాన్-ఐ-ఆం

రాజభవ సముదాయంలో సభామంటపం పేరు దివాన్-ఐ-ఆం. రాజు కొలువుతీర్చడానికి నిర్మించబడే ఇటువంటి సభామండపాలను అన్ని రాజభవనాలలో చూడవచ్చు.విశాలమైన పలు ప్రవేశాద్వారాలు కలిగిన దీర్ఘచతురస్రాకార భవనం ఇది. సభామండపం ఎదుట విశాలమైన ఖాళీ ప్రాంగణం ఉంటుంది.

చిత్ర కృప : Swift David

దివాన్-ఐ-ఖాస్

దివాన్-ఐ-ఖాస్ లేక సభా మండపం. విశాలమైన భవనం. ఈ సభా మండపం అద్భుత శిల్పచాతుర్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ అక్బర్ వివిధ మతాలకు చెందిన మతప్రతినిధులతో కలిసి మతసంబంధిత విశ్వాసాలను చర్చిస్తుంటారు.

చిత్ర కృప : Daniel Mennerich

ఇబాదత్ ఖానా

ఇబాదత్ ఖాన లేదా "ప్రార్ధనా మందిరం" ఫతేపూర్ సిక్రీ లోని తన భవనంలో అక్బర్ కట్టించిన ప్రార్ధన లేదా సమావేశ మందిరం. ఇక్కడ అక్బర్ చక్రవర్తి తీన్-ఇ-లాహి అనే కొత్త మతం స్థాపించాడు.

చిత్ర కృప : PROSENJIT DEY

అనుప్ తలాయో

అనుప్ తలాయో అనేది ఈతకొలను. ఈతకొలను మద్యలో వేదిక ఉంది. వేదికను చేరడానికి నాలుగు వంతెనలు ఉన్నాయి. అప్పటి రోజుల్లో, నిరంతరం మంచినీటి ప్రవాహం ఉండేలా ప్రత్యేకంగా దీనిని నిర్మించారు.

చిత్ర కృప : Ekabhishek

హుజరా-ఐ-అనుప్ -తలాయో

హుజరా-ఐ-అనుప్ -తలాయో అనేది అక్బర్ ముస్లిం భార్య మందిరం. అయితే మరీ చిన్న ప్రాంగణమైనందున ఆమె ఇక్కడ బస చేసిందా లేదా అనే విషయంలో చరిత్రకారులలో సరైన స్పష్టత లేదు.

చిత్ర కృప : Sanyam Bahga

మరియం-ఉజ్-జమానీ-భవనం

మరియం-ఉజ్-జమానీ-భవనం అనేది అక్బర్ భార్య మరియం-ఉజ్-జమానీ కొరకు నిర్మించబడిన భవనం . ఇది గుజరాతీ శైలిలో నిర్మించబడిన భవనం. ఏకాంతంగా నివసించడం కొరకు విశాలమైన ప్రాంగణంతో ప్రత్యేకశ్రద్ధతో నిర్మించబడిన భవనమిది.

చిత్ర కృప : Sanyam Bahga

నౌబత్ ఖానా

నౌబత్ ఖానాను దీనిని నక్కర్ ఖానా(డ్రం హౌస్) అని కూడా పిలువబడుంది. ఇక్కడ ఢంకా వాయిస్తూ మహారాజు ప్రవేశించే ముందు రాజు వస్తున్నాడని ప్రకటినచబడుతుంది. ఇది హతీ పోల్ ద్వారం లేక ఎలిఫెంట్ గేట్ ముందుగా ఉంటుంది.

చిత్ర కృప : Swift David

 

పచిసి కోర్ట్

పచిసీ అంటే సాహిత్యపరంగా చదరంగ౦ వంటి ఆట అనే అర్ధం ఉంది. ఫతేపూర్ సిక్రీ లో పచిసీ మందిరం దివాన్-ఏ-ఆమ్ కి దగ్గరగా ఉంది. తెలుపు, నలుపు చదరాల కలయికతో నిర్మించినందున ఈ ప్రాంగణంలోని మైదానం అసలైన చదరంగం పలక వలె ఉంటుంది.

చిత్ర కృప : Diana Bradshaw

పాంచ్ మహల్

పంచ్ మహల్ అక్బర్ చక్రవర్తి వినోదం పంచడానికి కట్టించిన విశాలమైన, నిలువువరసలు ఉన్న ఐదు అంతస్తుల భవనం. ఆయన విశ్రాంతికి, సేదతీరడానికి, వినోదం నిమిత్తం కూడా దీనిని వాడేవాడు.

చిత్ర కృప : Sunrider007

బీర్బల్ గృహ్

మొఘలుల కాలంలోని ప్రధాన భవనాలలో ఫతేపూర్ సిక్రీ లోని బీర్బల్ భవనాన్ని ఒకటిగా పరిగణిస్తారు. ఈ భవనం ప్రత్యేకమైంది కారణం దీనిలో ఉన్న హిందూ-మొఘలుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ భవనం లోపలి, వెలుపలి రంగు, ఆకారం, చెక్కడాలు ఇది నిజమనడానికి స్పష్టమైన నిదర్శనాలు.

చిత్ర కృప : JOHN BAILEY BSc MA FRICS

ఫతేపూర్ సిక్రీ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ఫతేపూర్ సిక్రీ అగ్రా నుండి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలో ఉన్న విమానాశ్రయం ఆగ్రా విమానాశ్రయం (ఆగ్రాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖజారియా విమానాశ్రయం).

రైలు మార్గం : సమీపంలోని రైల్వే స్టేషను ఫతేపూర్ సిక్రీకి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఫతేపూర్ సిక్రీ రైల్వేస్టేషను.

రోడ్డు మార్గం : ఫతేపూర్ సిక్రికి ఆగ్రాతో బాటుగా ఢిల్లీతో సహా పరిసర కేంద్రాల నుండి కూడా రాష్ట్ర రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం నిరంతర౦ ఉంటుంది.

చిత్ర కృప : http://indiarailinfo.com

English summary

Places To See in Fatehpur Sikri

Fatehpur Sikri situated in Agra District Of Uttar Pradesh. It was built by mughal emperor Akbar in 1569 AD. Fatehpur Sikri is now a World Heritage Site.
Please Wait while comments are loading...