Search
  • Follow NativePlanet
Share
» »గోపాల్పూర్ - పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి !

గోపాల్పూర్ - పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి !

By Mohammad

గోపాల్పూర్ ఒరిస్సా లోని ప్రముఖ కోస్తా తీర పట్టణం. ఈ ప్రదేశం బంగాళాఖాతం సముద్రానికి చేరువలో కలదు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మూడు పర్యాటక ప్రదేశాలలో దీనిని ఒకటిగా భావిస్తారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తుంటారు.

గోపాల్పూర్ ఇదివరకు మత్స్య కారుల గ్రామం గా ఉండేది. బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత, ఈ ప్రదేశం వారికి వర్తక, వాణిజ్య కార్యక్రమాలకు కేంద్రం గా మారిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుకు ఈ ప్రదేశం చేరువలో ఉండటం ఆంధ్రా పర్యాటకులు వారాంతంలో, సెలవుదినాలలో పిల్లలతో, కుటుంబసభ్యులతో ఇక్కడికి వస్తుంటారు.

షాపింగ్

గోపాల్పూర్ పట్టణంలోని సిటీ మార్కెట్ ప్రాంతం కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి బాగుంటుంది. సముద్రపు గవ్వలు, చేతికళా వస్తువులు, పట్టుచీరలతో పాటు అనేక అందమైన వస్తువులను స్థానికులు అమ్మకానికి పెడతారు.

ఇది కూడా చదవండి : కలహంది : ఒక పురాతన యాత్రా స్థలం !

గోపాల్పూర్ లోనూ మరియు దాని చుట్టుపక్కల సందర్శించదగిన కొన్ని పర్యాటక ప్రదేశాలు ఒకసారి గమనిస్తే ..!

ఆర్యపల్లి బీచ్

ఆర్యపల్లి బీచ్

ఆర్యపల్లి బీచ్ ఒరిస్సా లో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ సాయంకాల సమయంలో భారీ అలల దృశ్యాలు తప్పక సందర్శించాలి. ఈ బీచ్ వద్దకి సందర్శకులు విశ్రాంతి తీసుకోవటానికి, రీఫ్రెష్ అవ్వటానికి వస్తుంటారు. సర్ఫింగ్, సూర్యస్నానం, ఈత వంటివి బీచ్ వద్ద ఆచరించవచ్చు.

చిత్ర కృప : Supratim Das

గోపాల్పూర్ బీచ్

గోపాల్పూర్ బీచ్

సెలవులలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సందర్శించటానికి గోపాల్పూర్ బీచ్ సూచించదగినది. ఇక్కడ పర్యాటకులు అనేక వినోద భరిత క్రీడలను ఆడుకోవచ్చు. గుర్రం సవారీ, క్రూయిసింగ్, బాడీ మసాజ్ తదితర కార్యక్రమాలను ఈ బీచ్ అందిస్తున్నది. బీచ్ ఒడ్డున కొబ్బరి బొండాలు, ఐస్ క్రీములు, పల్లీలు, శనగలు మొదలైనవి అమ్ముతుంటారు.

చిత్ర కృప : Weekend Destinations

సోనేపూర్ బీచ్

సోనేపూర్ బీచ్

సోనేపూర్ బీచ్ ఒరిస్సాలోని ఉత్తమ బీచ్ లలో ఒకటి. ఈ బీచ్ యొక్క సముద్ర ప్రవాహాలు, వాటి నుండి వీచే చల్లని గాలులు పర్యాటకులను ప్రకృతి పరవశం లోకి తీసుకెళ్తాయి. మోటారు బోట్లు, గుర్రపు సవారీ వంటివి ఆనందాన్ని కలిగించే వినోదాలు.

చిత్ర కృప : Biswajit_Dey

మా తారా తరణి హిల్ మందిరం

మా తారా తరణి హిల్ మందిరం

గోపాల్పూర్ లోని మా తారా తరణి హిల్ ఆలయాన్ని దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా భావిస్తారు. ఇది గోపాల్పూర్ పట్టణం నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో రిషికుల్య నది ఒడ్డున ఉన్న కుమారి హిల్స్ పై కలదు. ఈ ఆలయంలో మా తారా, మా తరణి అనే ఇద్దరు దేవతామూర్తులు కొలువై ఉన్నారు.

చిత్ర కృప : Nayansatya

పంచమ, గోపాల్పూర్

పంచమ, గోపాల్పూర్

పంచమ గ్రామంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సిద్ధివినాయక ఆలయం ఉన్నది. ఈ ఆలయం మహిమ కలదని భక్తుల విశ్వాసం. ప్రతిఏటా జరిగే గణేష్ చతుర్దశి ఉత్సవాల రోజున భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.

చిత్ర కృప : Darshan Sancheti

గోపాల్పూర్ ఎలా చేరుకోవాలి ?

గోపాల్పూర్ ఎలా చేరుకోవాలి ?

వాయుమార్గం : గోపాల్పూర్ కు సమీపాన 165 km ల దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : గోపాల్పూర్ కు 15 కిలోమీటర్ల దూరంలో బెర్హంపూర్ రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు / బస్సు మార్గం : భువనేశ్వర్, కోణార్క్, బెర్హంపూర్, గంజాం తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు గోపాల్పూర్ కు వెళుతుంటాయి.

చిత్ర కృప : Nayansatya

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X