Search
  • Follow NativePlanet
Share
» »ప్రతి ఏటా రుతుస్రావము ఆచరించే దేవత !

ప్రతి ఏటా రుతుస్రావము ఆచరించే దేవత !

By Mohammad

తూర్పు భారతదేశ పర్యటనలంటే చాలామంది ఆసక్తికనబరచరు. కారణం రవాణా సౌకర్యాలు. అదొక్క కారణంతోనే సగానికి పైగా డ్రాప్ అవుతుంటారు. అంతే కాదు భాష పరంగా కూడా ఇబ్బందులొస్తుంటాయి. ఎందుకంటే అక్కడి ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఇవే కాదు ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, ఒక్క ప్రదేశం మాత్రం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది .... అదే గౌహతి.

గౌహతి / గువాహటి ... ఈశాన్య భారతదేశపు అతిపెద్ద నగరాలలో ఒకటి. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ నగరం బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉన్నది. అన్ని రకాల రవాణా వసతులు (రోడ్డు, రైలు మరియు విమాన) కలిగిన ఈ పట్టణం ఈశాన్య రాష్ట్రాలకి ఒక 'ద్వారం' లాంటిదని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : ఈశాన్య భారతం - పర్యాటక ప్రదేశాలు !

గౌహతి నగరం గురించి మహాభారతంలో ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే, ఒకప్పటి 'ప్రగ్జ్యోతిష్పూర్' గా పిలువబడే గౌహతిని రాక్షసరాజు నరకాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవాడట ..! ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు వాణిజ్య కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ఈ నగరం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్నది.

అస్సాం స్టేట్ మ్యూజియం

అస్సాం స్టేట్ మ్యూజియం

అస్సాం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే అస్సాం స్టేట్ మ్యూజియాన్ని తప్పక సందర్శించాలి. మ్యూజియంలో పురావస్తు శాస్త్రం, శిలాశాసన శాస్త్రం, నాణేల సేకరణ శాస్త్రం తో పాటుగా ఐకనోగ్రాఫీ కి చెందిన అద్భుత శిల్పకళాఖండాలను ప్రదర్శిస్తుంటారు. సందర్శన సమయం మంగళవారం నుండి ఆదివారం వరకు, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.

చిత్ర కృప : PJ Fanning

రీజనల్ సైన్స్ సెంటర్

రీజనల్ సైన్స్ సెంటర్

సైన్స్ మీద ఆసక్తి ఉన్నవారు గౌహతి లో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్ తప్పక సందర్శించాలి. ఇక్కడ ఎన్నో అరుదైన వాయిద్యాలు - యంత్రాలు, ఇంకా విజ్ఞాన శాస్త్రాన్ని వివరించే పత్రాలు, ప్రదర్శనలు, క్యాంప్ లు, సెమినార్లు ఉన్నాయి. ప్రీ హిస్టారిక్ పార్క్, 3డి సైన్స్ మూవీస్, మిర్రర్ మేజిక్, సైన్స్ షౌస్, బట్టర్ ఫ్లై కార్నెర్, డిజిటల్ ప్లానెటోరియం మరియు ఎన్నో అక్వరియం లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

చిత్ర కృప : guwahaticity

జూలాజికల్ గార్డెన్

జూలాజికల్ గార్డెన్

గౌహతి లో ఉన్న మరో పర్యాటక ఆకర్షణ జూలాజికల్ గార్డెన్. 130 హెక్టార్ల మేర విస్తరించిన ఈ గార్డెన్ అరుదైన జంతు మరియు వృక్ష జాలాల కు స్థావరం. జూ లో ప్రధానంగా చూడదగ్గది కొమ్ములు తిరిగిన భారతీయ ఖడ్గమృగం మరియు రెండు కొమ్ములు కలిగిన ఆఫ్రికన్ ఖడ్గ మృగం. ఇవే కాక వివిధ రకాలైన పక్షులు సైతం కనిపిస్తుంటాయి.

చిత్ర కృప : telugu native planet

పోబిటోరా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

పోబిటోరా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

గౌహతికి 50 కి. మీ. దూరంలో, 30.8 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పోబిటోరా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ కలదు. ఇక్కడ కూడా ఖడ్గ మృగాలు ఎక్కవగా తారసపడతాయి. ఒక్కోసారి ఇవి స్యాంక్చురీ స్థలం సరిపోక బయట తిరుగుతుంటాయి. సంవత్సరానికోసారి వచ్చే వలస పక్షులు, చిరుతలు, ఆసియాటికిల్ బఫెలో లు మొదలగు జంతువులు ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : telugu native planet

గౌహతి ప్లానిటోరియం

గౌహతి ప్లానిటోరియం

గౌహతి ప్లానిటోరియం, నగరం నడి బొడ్డున ఎంజి రోడ్డు లో కలదు. ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్న పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతరిక్ష రహస్యాల ను తెలుసుకోవటానికి ఉపయోగించే పరికరం జపనీస్ గోటో జిఎక్స్ ను ప్రజల సందర్శనార్థం ఉంచారు.

చిత్ర కృప : Vikramjit Kakati

మానాస్ నేషనల్ పార్క్

మానాస్ నేషనల్ పార్క్

గౌహతిలో యునెస్కో సంస్థ చేత వరల్డ్ న్యాచురల్ హేరిటేజ్ సైట్ గా గుర్తించబడ్డ మానాస్ నేషనల్ పార్క్ కలదు. ఈ పార్క్ లో మూడు రిజర్వ్ ప్రదేశాలు కలవు. అవి టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ మరియు ఎలిఫెంట్ రిజర్వ్. జంతువులతో పాటు ఉభయ చరాలు, పక్షులు, క్షీరాదాలు, సరీశృుపాలు ఇక్కడ ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర

శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర

ఆర్ట్ గ్యాలేరీ, మ్యూజియం మరియు ఓపెన్ ఎయిర్ థియేటర్ లతో పాటు వైష్ణవ దేవాలయాన్ని కలిగిన ప్రదేశం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రం. ఇందులో సాహిత్య భవన్ లైబ్రరీ అనే గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అస్సామీ గ్రామం లా కనిపించేటట్టు ఏర్పాటు చేసిన కృతిమ గ్రామం.

చిత్ర కృప : telugu native planet

భువనేశ్వరి ఆలయం

భువనేశ్వరి ఆలయం

గౌహతి లోని నిలచల్ కొండ మీద ఉన్న ప్రముఖ ఆలయం భువనేశ్వరి ఆలయం. క్రీ.శ. 7 వ శతాబ్ధం నుండి 9 వ శతాబ్ధం లో నిర్మించారని చెప్పబడుతున్న ఈ ఆలయంలో మహావిద్యాదేవతలలో ఒకటైన నాల్గవ అమ్మవారు కొలువై ఉంటారు. ఇక్కడ లభించే ప్రశాంతత కోసం పర్యాటకులు, భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : telugu native planet

కామాఖ్య ఆలయం

కామాఖ్య ఆలయం

నగరం నుండి 7 కి. మీ. దూరంలో నీలచల్ కొండ పై ఉన్న మరొక ఆలయం కామాఖ్య ఆలయం. ఈ గుడి చూడకపోతే మీ గౌహతి పర్యటన వేస్ట్. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ప్రతి సంవత్సరం కాళికా మాత మరో రూపమైన కామాఖ్య అమ్మవారి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకొని ' అంబాబూచి మేళా' ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ వేడుకలే ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఏటా మే - జూన్ నెలలో జరుగుతుంది.

చిత్ర కృప : nirmal Deka Baruah

నవగ్రహ ఆలయం

నవగ్రహ ఆలయం

చిత్రాసల్ కొండ పై ఉన్న నవగ్రహ ఆలయం తొమ్మిది శివలింగాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతి శివలింగం ఒక్కో రంగు బట్ట తో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ శిల్పు ఖురి అనబడే ట్యాంక్.

చిత్ర కృప : telugu native planet

ఉగ్రతర ఆలయం

ఉగ్రతర ఆలయం

ఉజాన్ బజార్ లోని ఉగ్రతర ఆలయం కాళీమాత కు అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయం గర్భగుడి లో దేవతామూర్తి ఉండదు. నీళ్ళు కలిగిన చిన్న గుంటని దేవత గా పరిగణించి పూజిస్తారు.

చిత్ర కృప : telugu native planet

శుక్రేశ్వర్ ఆలయం

శుక్రేశ్వర్ ఆలయం

అస్సాం చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిన శుక్రేశ్వర్ ఆలయాన్ని సందర్శకులు తప్పక సందర్శించాలి. ఈ మందిరం మహా శివునికి అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకి మెట్లదారి గూండా బ్రహ్మపుత్ర కి చేరుకోవడం అత్యంత ఆసక్తికరమైన అంశం. పర్యాటకులు ఈ నదీ ప్రదేశం లో సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : telugu native planet

ఉమానంద ఆలయం

ఉమానంద ఆలయం

బ్రహ్మపుత్ర నదిపైన పీకాక్ ద్వీపం పై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణం. మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయ గోడలపై సూర్య, శివ, గణేశా మరియు దేవి చెక్కడాలు గమనించవచ్చు. శివరాత్రి పర్వ దినాన ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. పడవలు మరియు మోటార్ లాంచ్ ల ద్వారానే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Yathin S Krishnappa

వశిష్ట ఆశ్రమం

వశిష్ట ఆశ్రమం

సంధ్య, కాంత మరియు లలితా అనబడే మూడు నదుల సంగమం వద్ద ఈ సంధ్యచల్ కొండలపై వశిష్ట ఆశ్రమం ఉంది. ఆశ్రమానికి చేరే దారిలో ఈ నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. వశిష్ట ఆశ్రమ సందర్శన మరువరానిది. ప్రశాంతమైన ఈ వాతావరణం హాయిని కలిగిస్తుంది.

చిత్ర కృప : Kalyan Mohan Paul

జనార్థన ఆలయం

జనార్థన ఆలయం

జనార్థన ఆలయం, హిందూ మరియు బౌద్ధ నిర్మాణ శైలిని ప్రతిబింబించే అద్భుత కట్టడం. ఈ ఆలయం బుద్ధుడికి అంకితం ఇవ్వబడింది. ఎంతో అందంగా ఉండే ఆలయ పరిసరాలు భక్తులను మరియు యాత్రికులను కనువిందు చేస్తాయి.

చిత్ర కృప : Vkramjit Kakati

గౌహతి ఎలా చేరుకోవాలి ?

గౌహతి ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

గౌహతి లో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలకు నిత్యం విమాన సర్వీసులు నడుస్తుంటాయి.

రైలు మార్గం

గౌహతి లో ఉన్న రైల్వే స్టేషన్ అతి పెద్దది మరియు ఈశాన్య భారతదేశంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ కూడా. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు మార్గం

గౌహతి గుండా జాతీయ రహదారి 37 పోతుంది. ఈ రహదారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : SAGAR PRADHAN

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X