Search
  • Follow NativePlanet
Share
» »సహ్యాద్రి పర్వతాల అందం ... ఇగాత్ పురి !

సహ్యాద్రి పర్వతాల అందం ... ఇగాత్ పురి !

By Mohammad

ఇగాత్ పురి మహారాష్ట్రలో ఆసక్తికలిగించే ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సహ్యాద్రి పర్వతశ్రేణులలో కలదు. ఉత్తర మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉన్న ఇగాత్ పురి పురాతన దేవాలయాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తున ఉండే ఈ పర్వత ప్రాంతం అద్భుత ప్రకృతి దృశ్యాలను, వంపుసొంపుల జలపాతాలను, ఆకుపచ్చని అడవులను అందిస్తుంది.

మీకు ఏ మాత్రం కొద్దిపాటి సెలవుదొరికినా బ్యాగు సర్దుకొని కుటుంబసభ్యలతో ఇగాత్ పురి లో వాలిపోవచ్చు. ఈ పట్టణం ముంబై నుండి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో కలదు. మాన్సూన్, శీతాకాలము సమయాల్లో ఈ ప్రదేశం పర్యాటకులను రారమ్మని పిలుస్తుంటుంది.

భట్సా రివర్ వాలీ

భట్సా రివర్ వాలీ

భట్సా రివర్ వాలీ అద్భుత ప్రదేశం. ఇక్కడ మీ మైండ్ ని ఫ్రెష్ చేసుకోవచ్చు. లోయ ఆకుపచ్చని ప్రదేశాలను, చిన్న చిన్న కొండలను చూపిస్తుంది. వాలీ పరిసరాలు కాలుష్యరహిత గాలులు అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులు మరిచిపోలేని గొప్ప అనుభూతిని పొందవచ్చు.

చిత్ర కృప : Gargi Gore

ఘటన్ దేవి మందిర్

ఘటన్ దేవి మందిర్

ఘటన్ దేవి మందిర్ లో ఘటన్ దేవి అమ్మవారు కొలువై ఉంటుంది. అమ్మవారు ఇక్కడి కొండలను సంరక్షిస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడి నుండి పశ్చిమ కనుమల శిఖరాలను గమనించవచ్చు.

చిత్ర కృప : Piyushshelare

ట్రింగల్ వాడి సరస్సు

ట్రింగల్ వాడి సరస్సు

ప్రత్యేకించి ఈ సరస్సును వర్షాకాలంలో సందర్శించాలి. సరస్సు వద్దకు పర్యాటకులు సాయంత్రం కుటుంబసభ్యులతో సేదతీరేందుకు వస్తుంటారు. సరస్సు వద్ద నుండి కోట, పర్వతాల దృశ్యాలను చూడవచ్చు.

చిత్ర కృప : ParikshitNashik

కేమెల్ వాలీ

కేమెల్ వాలీ

కేమెల్ అన్నా కదా అని ఒంటెలు ఉంటాయనుకుంటే మీరు పొరబడినట్లే! దీని పేరు అలా పెట్టారు. నిజానికి చెప్పాలంటే ఇదొక సాహస క్రీడల ప్రదేశం. రివర్ రాప్టింగ్, రివర్ క్రాసింగ్ వంటివి చేపట్టవచ్చు. వందల మీటర్ల ఎత్తు నుండి పడే జలపాతాలు ఇక్కడ అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Kashif Pathan

వైతరణి డ్యామ్

వైతరణి డ్యామ్

వైతరణి డ్యాం, వైతరణి నది మీద కట్టబడింది. ఇక్కడ నుంచి పర్యాటకులు పశ్చిమ కనుమల అందాలను చూడవచ్చు. బ్యాక్ వాటర్ దృశ్యాలు మరువలేనివి.

చిత్ర కృప : Kashif Pathan

ట్రింగల్ వాడి కోట

ట్రింగల్ వాడి కోట

ట్రింగల్ వాడి కోట సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. కోట పై నుండి లోయలు, సరస్సులు, ఇగాత్ పురి పట్టణాన్ని చూడవచ్చు. తరచూ ట్రెక్కర్లు ఈ కోటను చేరుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.

వలావల్కర్ శివాజీ మ్యూజియం

వలావల్కర్ శివాజీ మ్యూజియం

ఈ మ్యూజియంలో ఛత్రపతి శివాజీ కి సంబంధించిన అనేక అంశాలను భద్రపరిచారు. శివాజీ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం వద్ద చూడవచ్చు. లోపల గోడల మీద అనేక చిత్రపటాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Yash Bhavsar

ఇగాత్ పురి ఎలా చేరుకోవాలి ?

ఇగాత్ పురి ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం : నాసిక్, ముంబై నుండి తరచూ ఇగాత్ పురి కి బస్సులు నడుస్తాయి.

రైలు మార్గం : కాసర, ముంబై రైల్వే స్టేషన్ లు సమీపాన కలవు.

వాయు మార్గం : ముంబై సమీప ఎయిర్పోర్ట్.

చిత్ర కృప : Kashif Pathan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X