Search
  • Follow NativePlanet
Share
» »కొత్‌ఖై - యాపిల్ తోటల ఊరు !

కొత్‌ఖై - యాపిల్ తోటల ఊరు !

By Mohammad

యాపిల్ పండ్లు ... ఎవ్వరికైనా ఇష్టమే ..! అందునా కాశ్మీర్, షిమ్లా యాపిల్ పండ్లంటే మహామోజు. దీనికి కారణం ఆ పండ్లు తియ్యగా, రుచిగా ఉండటమే! చాలా మంది ఈ రెండు పండ్ల రుచి చూసుంటారు. మరి ఎప్పుడైనా కొత్‌ఖై యాపిల్ పండ్ల రుచి తిని చూశారా ??

కొత్‌ఖై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పట్టణం. షిమ్లా నుండి 60 కి. మీ. దూరంలో సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం కలదు. కోట్ అనగా 'కోట' అని ఖాయి అనగా 'శిఖరం' అని అర్ధం. ఈ ప్రదేశానికి ఉన్న సహజ సౌందర్యము, చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం వల్ల సుదూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకి వస్తుంటారు.

ఇది కూడా చదవండి : హిమాచల్ ప్రదేశ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

కొత్‌ఖై పట్టణం కూడా కాశ్మీర్, షిమ్లా వలె యాపిల్ తోటలకు ప్రసిద్ధి. కొన్ని వేల హెక్టార్లలో యాపిల్ ను పండిస్తుంటారు. తోటలో దిగి, యాపిల్ పండు కొరికి చూస్తే రుచిలోనూ, తియ్యదనంలోనూ అచ్చం ఆ రెండు పండ్ల వలె (కాశ్మీర్, షిమ్లా) ఉంటుంది. తోట కనిపించింది కదా అని డైరెక్ట్ గా వెళ్ళకండి .. యజమాని అనుమతి తీసుకొని వెళ్లండి.

కొత్‌ఖై లో సందర్శించటానికి కేవలం తోటలే కాదు ... ఉద్యానవనాలు, రాజభవనాలు, మందిరాలు, వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి. షిమ్లా కు టూర్ వచ్చేవారు తప్పకుండా మీ పర్యటనలో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి.

కియాలా ఫారెస్ట్

కియాలా ఫారెస్ట్

కియాలా ఫారెస్ట్ కొత్‌ఖై లో ప్రముఖ యాత్రా స్థలం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదకరంగా, చల్లటి వాతావరణం తో ముడిపడి ఉంటాయి. సంవత్సరం పొడవునా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

చిత్ర కృప : Fraz Khalid

కొత్‌ఖై ప్యాలెస్

కొత్‌ఖై ప్యాలెస్

కొత్‌ఖై లో చూడదగ్గ మరో పర్యాటక ఆకర్షణ, పర్వత శిఖరం మీద రాజా రాణాసాబ్ నిర్మించిన కొత్‌ఖై ప్యాలెస్. దీనిని స్థానికులు 'బస్స' అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ టిబెట్ తరహా వాస్తు నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇక్కడి నుంచి క్రిందకు చూస్తే పర్వత ప్రాంతాల దిగువన పారే 'గిరి గంగా' నది దృశ్యాలను గమనించవచ్చు.

చిత్ర కృప : Saurabh Mehta

ధిలాన్ తటాకం

ధిలాన్ తటాకం

కొత్‌ఖై అడవుల్లో ఉన్న ప్రముఖ దర్శనీయ ప్రదేశం ధిలాన్ తటాకం. ఈ తటాకం లోని నీరు అత్యంత పవిత్రమైనదిగా స్థానికులు, భక్తులు భావిస్తుంటారు. స్థానికులే వసతి సదుపాయాలను ఇక్కడికి వచ్చే సందర్శకులకు కల్పిస్తుంటారు.

చిత్ర కృప : Munish Chandel

నేరా ఘాటి

నేరా ఘాటి

నేరా ఘాటి, కొత్‌ఖై లో ప్రసిద్ధి చెందిన పిక్నిక్ స్పాట్. పగటి పూట ఈ ప్రదేశంలో సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. అద్భుత దృశ్యాలు, అందమైన పచ్చటి సోయగాలు, పక్షులు మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా ఆకర్షిస్తాయి.

చిత్ర కృప : liz west

మహామాయి మందిరం

మహామాయి మందిరం

పచ్చటి పచ్చిక మైదానాల మధ్య నెలకొని ఉన్న మహామాయి మందిరం కొత్‌ఖై లో చూడదగ్గది. సుదూర ప్రాంతాల నుండి ప్రార్థన ల కొరకై వచ్చే యాత్రికులతో ఈ మందిరం సంవత్సరం పొడవునా కిటకిటలాడుతుంటుంది.

చిత్ర కృప : Gaurav Dinesh

లంక్రా వీర్ మందిర్

లంక్రా వీర్ మందిర్

కొత్‌ఖై లో నెలకొని ఉన్న మరొక ఆలయం లంక్రా వీర్ మందిర్. ఈ గుడి ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలు ఈ ప్రదేశానికి మరింత వన్నె తెచ్చిపెట్టాయి.

చిత్ర కృప : Richard Lamprecht

కొత్‌ఖై ఎలా చేరుకోవాలి ?

కొత్‌ఖై ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం - సమీపాన 60 కి. మీ. దూరంలో షిమ్లా విమానాశ్రయం కలదు.
రైలు మార్గం - సిమ్లా రైల్వే స్టేషన్. అక్కడి నుండి క్యాబ్ / ట్యాక్సీ లలో ప్రయాణించి కొత్‌ఖై చేరుకోవచ్చు
బస్సు / రోడ్డు మార్గం - షిమ్లా నుండి కొత్‌ఖై కు నేరుగా ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కలవు.

చిత్ర కృప : Ashish Gupta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X