Search
  • Follow NativePlanet
Share
» »కుఫ్రి లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !!

కుఫ్రి లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !!

By Mohammad

కుఫ్రి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం. ఇది ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా నుండి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కుఫ్రి సముద్ర మట్టానికి సుమారుగా 2743 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కుఫ్రి అనగా సరస్సు అని అర్థం. ఇక్కడ చూడటానికి ఎన్నో ఆకర్షణలు ఉండటం వల్ల పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తుంటారు.

కుఫ్రి లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు

మహాసు పీక్, గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్ మరియు ఫాగు మొదలైనవి కుఫ్రి లో చూడవలసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. సుందరమైన పర్వత శ్రేణులతో నిండిన ఈ ప్రదేశంలో మతపరమైన సైట్ లు కూడా కలవు. దీనికి దగ్గరిలో ఉన్న కొన్ని ఆలయాల్లో కొయ్య బొమ్మలను ఆరాధిస్తారు.

ఇది కూడా చదవండి : ఢిల్లీ - మనాలి వయా సిమ్లా !

కుఫ్రి ప్రదేశం హైకింగ్, కాంపింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి వివిధ సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందినది. సాహస ఔత్సాహికులు మంచుపై జారడం, గుర్రపు స్వారీ చేయటం వంటి వివిధ క్రీడలను ఆడవచ్చు. సాహసోపేత కార్యక్రమాలకు గుర్రాలు కూడా చేరలేని ప్రాంతాలకు వెళ్ళటానికి గో -కార్టింగ్ ను ఉపయోగిస్తారు.

అంతేకాకుండా కుఫ్రి లో వసతి కొరకై ఏర్పాటు చేసిన శిబిరాలలో ప్రయాణీకులు ఒక రాత్రి గడపాలంటే లైట్ లతో కాంతిని ఏర్పాటు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా సాహస యాత్రికులు ఫాగు ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. అక్కడ ఫిబ్రవరి నెలలో జరిగే స్కై ఉత్సవాలలో పాల్గొంటారు.

ఫాగు, కుఫ్రి

ఫాగు, కుఫ్రి

కుఫ్రి కి 6 కి.మీ. దూరంలో, సిమ్లా కి 23 కి.మీ. దూరంలో గల ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఫాగు. ఇది సముద్రమట్టానికి 2509 మీటర్ల ఎత్తులో కలదు. ఇక్కడ అందమైన పర్వత ప్రదేశాలను, పండ్ల తోటలను మరియు అడవులను చూసి ఆనందించవచ్చు. ట్రెక్కర్లు ఈ ప్రదేశంలో కలియతిరుగుతూ గిరివాలీ అందాలను చూడవచ్చు.

చిత్ర కృప : Rckr88

మహాసు శిఖరం, కుఫ్రి

మహాసు శిఖరం, కుఫ్రి

మహాసు శిఖరం కుఫ్రి ప్రాంతంలో ఉన్న ఎత్తైన శిఖరం. ఈ శిఖరం నుండి యాత్రికులు బద్రినాథ్ & కెదర్నాథ్ ప్రాంతాల పొలిమేరల్ని చూడవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, మంచు మీద నుండి జారటం, వాకింగ్ వంటి క్రీడలను ఆడవచ్చు. ఆసక్తి గలవారు సొంతంగా గానీ లేదా అద్దెకు కానీ క్రీడా పరికరాలను తీసుకొని క్రీడల్లో పాల్గొనవచ్చు.

చిత్ర కృప : Amit Kumar

ఇందిరా పర్యాటక పార్క్, కుఫ్రి

ఇందిరా పర్యాటక పార్క్, కుఫ్రి

కుఫ్రి లో చూడవలసిన మరొక ప్రాంతం ఇందిరా పర్యాటక పార్క్. ఈ పార్క్ లో యాక్ మరియు పోనీ సవారీలు అదనపు ఆకర్షణలు. ఈ పార్క్ సిమ్లా కి 19 కి. మీ. దూరంలో, ఫాగు కి 6 కి. మీ. దూరంలో ఉన్నది. పార్క్ లోపల ఆకలెస్తే తినటానికి, తాగటానికి రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్ లు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Andrés Gallo

స్కీయింగ్, కుఫ్రి

స్కీయింగ్, కుఫ్రి

కుఫ్రి లో బాగా ప్రసిద్ధి పొందిన క్రీడ స్కీయింగ్. శీతాకాలంలో పర్యాటకులు మహాసు బ్రిడ్జ్ వాలు వద్ద కప్పబడిన మంచు దుప్పటి మీద స్కీయింగ్ ను ఆడటానికీ తరచూ వస్తుంటారు. ఔత్సాహికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే స్కీయింగ్ పోటీలు, స్కై ఉత్సవాలలో క్రమం తప్పకుండా పాల్గొంటారు.

చిత్ర కృప : India Hops

తోబోగ్గనింగ్, కుఫ్రి

తోబోగ్గనింగ్, కుఫ్రి

కుఫ్రిలో తోబోగ్గనింగ్ అంటే మంచు గడ్డలపై జారుచూ పోవు చక్రములు లేని బండి అని అర్థం. మొదట్లో మంచు గడ్డలపై జారుచూ పోవు చక్రములు లేని బండిని మంచుతో కప్పబడిన పర్వతాలలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంనకు రవాణా కొరకు ఉపయోగించేవారు. తరువాత ఇది రానురాను కుఫ్రి లో అత్యంత ప్రాచుర్యం పొందిన శీతాకాలంలో జరిగే క్రీడలలో ఒకటిగా నిలిచింది.

చిత్ర కృప : ReflectedSerendipity

ట్రెక్కింగ్, కుఫ్రి

ట్రెక్కింగ్, కుఫ్రి

కుఫ్రి లో ట్రెక్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవ్వరైనా ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ కి దాసోహం అవ్వకమానరు. యాత్రికులు ఎటువంటి గైడ్ సహాయం లేకుండా వారే సొంతంగా అన్ని ప్రాంతాలను అన్వేషించవచ్చు.

చిత్ర కృప : arnabk

గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్, కుఫ్రి

గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్, కుఫ్రి

గ్రేట్ హిమాలయన్ ప్రకృతి పార్క్ 2600 మీటర్ల ఎత్తులో ఉండి, 90 హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నది. చెట్లలో అనేక రకాలైన ఓక్, ఫిర్, స్ప్రూస్, నీలం దేవదారు చెట్టు వంటివి ఈ ప్రాంతంలో ఉన్నాయి. కస్తూరి జింక, బ్రౌన్ ఎలుగుబంటి, మోనాల్, గోరల్స్, థార్, భరల్, సెరో, కలిజ్, కోక్లాస్ సహా అనేక జంతువులు ఉంటాయి. ఈ ప్రకృతి పార్క్ అంతరించిపోతున్న కొన్ని మొక్కలు మరియు జంతువుల జాతులను రక్షిస్తుంది.

చిత్ర కృప : TARSEM SAJPAL

ఆలయాలు, కుఫ్రి

ఆలయాలు, కుఫ్రి

యాత్రికులు ఫాగు దగ్గర బంతియా దేవతా మందిరం, మహాసు శిఖరం వద్ద నాగ దేవతా ఆలయం మరియు పలు అందమైన దేవాలయాలను చూడవచ్చు. ఈ దేవాలయ గోడలపై స్థానిక కొయ్య చెక్కడం హిమాచల్ శిల్పుల యొక్క కళాత్మకత ను వర్ణిస్తాయి.

చిత్ర కృప : Jayasree Sengupta

కుఫ్రి ఎలా చేరాలి ??

కుఫ్రి ఎలా చేరాలి ??

విమాన మార్గం

కుఫ్రి కి సమీప విమానాశ్రయం 22 కి.మీ. దూరంలో ఉన్న సిమ్లా లోని జుబ్బార్ హత్తి విమానాశ్రయము. ప్రముఖ ఎయిర్లైన్స్ ఢిల్లీ మరియు ఇతర ప్రధాన నగరాల నుండి ఈ విమానాశ్రయానికి సాధారణ విమానాలు అందుబాటులో ఉంటాయి. జుబ్బార్ హత్తి విమానాశ్రయము నుండి కుఫ్రిని చేరుకోవటానికి టాక్సీలు మరియు క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

కుఫ్రి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది నారో గేజ్ రైలు మార్గం ద్వారా సిమ్లా కు అనుసంధానించబడింది. యాత్రికులు సిమ్లా లో దిగి కుఫ్రి కి బస్సు లో కానీ లేదా ఇతర ప్రవేట్ వాహనాల్లో కానీ ఎక్కిరావచ్చు.

రోడ్డు మార్గం

కుఫ్రి కి సిమ్లా, నర్తండ మరియు రాంపూర్ నుండి నేరుగా బస్సులు లభిస్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు మరియు ప్రైవేట్ డీలక్స్ బస్సులు సిమ్లా నుండి కుఫ్రి కి సులభంగా అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : charu chhitwal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X