Search
  • Follow NativePlanet
Share
» »పాలంపూర్ - టీ కాపిటల్ అఫ్ నార్త్ ఇండియా !

పాలంపూర్ - టీ కాపిటల్ అఫ్ నార్త్ ఇండియా !

By Mohammad

ఈ వేసవి సెలవులకు ఎటైనా వెళ్లి హాయిగా ప్రకృతి దృశ్యాలను, నీటి ప్రవాహాలను చూసిరావాలంటే ఉత్తర భారత దేశంలోని పాలంపూర్ వెళ్లాల్సిందే ..! పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా లోయలో దట్టమైన దేవదారు మరియు పైన్ వృక్షాలతో నిండిన ఆకుపచ్చని కొండ ప్రాంతం.

ఇది కూడా చదవండి : బిర్ - సాహస క్రీడల మజిలీ !

పాలంపూర్ దాని అందమైన ప్రకృతి దృశ్యాలకు, నిర్మలమైన వాతావరణానికి ఎంతగానో ప్రసిద్ధి చెందినది. ఈ కొండ ప్రాంతం అన్ని వైపులా తేయాకు తోటలు, ధౌలధర్ పర్వత శ్రేణులు మరియు దట్టమైన చెట్లతో కప్పబడి అందంగా ఉంటుంది. ఇక్కడ తేయాకు తోటలు సమృద్ధిగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని 'టీ క్యాపిటల్ అఫ్ నార్త్ ఇండియా' గా అభివర్ణిస్తుంటారు ప్రకృతి ప్రేమికులు. ఈ ప్రాంతంలో సందర్శించటానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి. వాటి విషయానికి వస్తే ...

టీ తోటలు

టీ తోటలు

పాలంపూర్ వచ్చే పర్యాటకులు మొదట చూడవలసింది టీ తోటలే ..! ఇవి వీటిని వివిధ రకాల బ్రాండ్ పేర్లతో పండిస్తుంటారు. ఇక్కడి 'కాంగ్రా టీ' బ్రాండ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Rajesh

అంద్రెట్ట

అంద్రెట్ట

అంద్రెట్ట, పాలంపూర్ కు 14 కి. మి. దూరంలో ఉన్న పర్యాటక స్థలం. ఇదొక కళాకారుల గ్రామం. ఇక్కడి గ్రామీణ కళలను నేర్చుకోవటానికి విద్యార్థులు సైతం వస్తుంటారు. కాంగ్రా నుండి తీసుకొచ్చే అద్భుతమైన చిత్రాలను, పెయింటింగ్ లను ప్రదర్శనకై ఇక్కడి గ్యాలరీలలో ఉంచుతారు.

చిత్ర కృప : 10 Year Itch (Madhu Nair)

ఆల్ - హిలాల్

ఆల్ - హిలాల్

ఆల్ - హిలాల్, పాలంపూర్ కు 12 కి. మి. దూరంలో ఉన్న మరొక పర్యాటక స్థలం. ఇదొక వ్యూ పాయింట్. ఇక్కడి నుండి పర్యాటకులు సుందర దృశ్యాలను చూడవచ్చు. ఈ స్థలానికి సమీపంలో, 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న 'తరగర్హ్ ఫోర్ట్' కూడా చూడవలసిన మరో ఆకర్షణ.

చిత్ర కృప : Jaideep Gupta

ధౌలధర్ నేషనల్ పార్క్

ధౌలధర్ నేషనల్ పార్క్

పాలంపూర్ నుండి 13 కి. మీ దూరంలో సుమారు 30 ఎకరాల్లో ధౌలధర్ నేషనల్ పార్క్ కలదు. వన్య ప్రాణుల ఔత్సాహికులను ఆకర్షించటానికి పెద్ద జంతువులు, చిన్న జంతువులు అనేకం ఇక్కడ ఉన్నాయి.

చిత్ర కృప : SEN

నేవ్గల్ ఖడ్

నేవ్గల్ ఖడ్

పాలంపూర్ పట్టణానికి సమీపంలో నేవ్గల్ ఖడ్ ఉన్నది. ఇక్కడ వీచే అద్భుతమైన చల్ల గాలుల్లో వేడి వేడి టీ లేదా కాఫీ ని రుచి చూస్తూ ఆనందించవచ్చు మరియు దగ్గరలోని అందమైన దృశ్యాలను చూడవచ్చు.

చిత్ర కృప : arpitkgoel

బండ్ల పగులు

బండ్ల పగులు

నేవ్గల్ ఖడ్ కు కొద్ది దూరంలో బండ్ల పగుల నుండి ప్రవహించే సన్నని నీటి ప్రవాహం ఉన్నది. వర్షాకాలంలో ఆ ప్రవాహం మరింత ఉదృతంగా ప్రవహిస్తూ రాళ్ళను,రప్పలను తనతో పాటు తీసుకెళుతుంది. దీని చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం సందర్శకులను తప్పక ఆనందాన్ని ఇస్తుంది.

చిత్ర కృప : Swami Balendu

సౌరభ్ వన్ విహార్

సౌరభ్ వన్ విహార్

సౌరభ్ వన్ విహార్, దౌలధర్ పర్వతాల్లో 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటకులు ఇక్కడ ఔషధ మొక్కలు, చిల్డ్రన్స్ పార్క్, హెల్త్ ట్రైల్స్, జలపాతాలు, టైగర్ హిల్ బ్రిడ్జి మొదలైనవి చూసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : arpitkgoel

షేర్బ్లింగ్

షేర్బ్లింగ్

పాలంపూర్ లోని షేర్బ్లింగ్ పర్యాటక స్థలం బుద్దిస్ట్ విహారాలకు, మఠాలకు ప్రసిద్ధి చెందినది. స్తూపాలు, బౌద్ధ మత కట్టడాలు మరియు పచ్చని చెట్లతో నిండిన ప్రకృతి ఇక్కడి ఆకర్షణలు. సమయముంటే తషి జోంగ్ మొనాస్టరీలో విహరించండి.

చిత్ర కృప : arpitkgoel

చాముండా దేవి ఆలయం

చాముండా దేవి ఆలయం

చాముండా దేవి ఆలయం పాలంపూర్ కి 10 కి. మి. ల దూరంలో, అలాగే ధర్మశాల నుండి 15 కి. మీ ల దూరంలో కలదు. దేశంలోని 51 శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. సుమారు 700 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం దుర్గామాతకు అంకితం చేయబడ్డది. చుట్టూ కొండలు, అడవులు, బెనార్ నది మరియు ఆలయ ప్రాంగణం లోని అందమైన పెయింటింగ్ చూడదగ్గవి.

చిత్ర కృప : Ashish3724

బండ్ల మాత దేవాలయం

బండ్ల మాత దేవాలయం

బండ్ల మాత దేవాలయం, ప్రఖ్యాత హిందూ మత పుణ్య స్థలం. ఈ ఆలయం పురాతనమైనది మరియు పవిత్రమైనది. అందమైన టీ తోటల మధ్య నిర్మించిన ఈ ఆలయం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం కట్టినట్లు పురావస్తు అధికారుల అంచనా.

చిత్ర కృప : Rakesh Dixit

బైజనాథ్ ఆలయం

బైజనాథ్ ఆలయం

బైజనాథ్ ఆలయం క్రీ. శ. 12 వ శతాబ్దం మొదట్లో గుర్తించారు. పాలంపూర్ నుండి 16 కి. మి. ల దూరంలో ఉన్న ఈ ఆలయం లో ప్రధాన దైవం శివ భగవానుడు. స్వయంభూ గా వెలసిన శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు.

చిత్ర కృప : Rakeshkdogra

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

పాలంపూర్ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సాహస క్రీడలను అందిస్తుంది. వాటిలో పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ లు కొన్ని. పర్యాటకులు దౌలధర్ పర్వతాలను అధిరోహిస్తూ చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Telugu native planet

పాలంపూర్ ఎలా చేరుకోవాలి ?

పాలంపూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పాలంపూర్ కు దగ్గరలో ధర్మశాల విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం 40 కి.మి. ల దూరంలో ఉండి ఢిల్లీ, ముంబై నగరాలతో చక్కగా అనుసంధానించబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి పాలంపూర్ కు సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

2 కి.మి.ల దూరంలో మరంద (నేరో గేజ్) మరియు 120 కి.మి. ల దూరంలో పతంకొట్ (బ్రాడ్ గేజ్) రైల్వే స్టేషన్ లు ఉన్నాయి.

రోడ్డు మార్గం

ఢిల్లీ, చండీఘర్, మనాలి, షిమ్లా, ధర్మశాల మరియు పతంకొట్ ల నుండి పాలంపూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సుల సౌకర్యం కలదు.

చిత్ర కృప : Jon Connell

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X