Search
  • Follow NativePlanet
Share
» »పితోర్ గర్ .. భారతదేశంలో మరో కాశ్మీరం !

పితోర్ గర్ .. భారతదేశంలో మరో కాశ్మీరం !

By Mohammad

అక్కడికి వెళితే ఉదయం వేళ ధగధగ మెరిసే హిమాలయ పర్వతాలు కనువిందుచేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో విస్తరించి ఉన్న పచ్చదనం మనసును ఆహ్లాదపరుస్తుంది. చరిత్రకు సాక్షంగా నిలిచిన కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... వంటి ఎన్నెన్నో ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం ... 'పితోర్ గర్'.

ఇది కూడా చదవండి : ఉత్తరకాశి - వినాయకుడు జన్మించిన ప్రదేశం !

పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం కూడా కావాలనుకుంటే పితోర్ గర్ కు వెళ్లాల్సిందే! ఈ ప్రాంతం గొప్పవైన హిమాలయ పర్వత శ్రేణుల ప్రవేశానికి ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ ప్రదేశం అందమైన సాయర్ వాలీలో కలదు. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను 'మినీ కశ్మీర్'గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్లు !

అర్జునేస్వర్ టెంపుల్

అర్జునేస్వర్ టెంపుల్

అర్జునేస్వర్ టెంపుల్ ప్రధాన ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున కలదు. పితోర్ ఘర్ నుండి ఇది 10 కి.మీ.ల దూరం కలదు. ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి. ఈ టెంపుల్ శివుడి కి చెందినది. జానపదుల మేరకు, ఈ టెంపుల్ ను పాండవులలో ఒకరైన అర్జున నిర్మించాడని చెపుతారు.

చిత్ర కృప : Lalitgupta isgec

చండక్

చండక్

పితోర్ గర్ కు 8 కి.మీ.ల దూరంలో చండక్ కలదు. ఇక్కడకు చేరాలంటే సాయర్ వాలీ యొక్క ఉత్తర భాగంలో గల ఒక అందమైన కొండ ఎక్కాలి. ఈ ప్రదేశం హాంగ్ గ్లైడింగ్ ఆనందాలు అందిస్తుంది. ఇక్కడే మను టెంపుల్ కలదు.

చిత్ర కృప : Ashok singh negi 41

కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయం

కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయం

సోయార్ వాలీలో కపిలేశ్వర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధ క్షేత్రం. ఇది ఒక గుహలో పది మీటర్ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ఒక శివాలయం. పురాణాల మేరకు మహర్షి కపిలుడు ఇక్కడ ధ్యానం చేసాడని చెపుతారు. ఈ టెంపుల్ టవున్ కు ౩ కి.మీ.ల దూరంలో వుండి హిమాలయ పర్వత శ్రేణులను చక్కగా చూపుతుంది.

చిత్ర కృప : L. Shyamal

పితోర్ ఘర్ కోట

పితోర్ ఘర్ కోట

పితోర్ ఘర్ కోట పితోర్ ఘర్ టవున్ కు సమీపంలో వుంటుంది. ఈ కోట నుండి కుమావొన్ యొక్క అందాలను పర్యాటకులు ఆనందించవచ్చు. ఈ కోటను పట్టణంపై దండెత్తిన తర్వాత గూర్ఖాలు 1789లో నిర్మించారు.

నకులేస్వర్ టెంపుల్

నకులేస్వర్ టెంపుల్

నకులేస్వర్ టెంపుల్ పితోర్ ఘర్ టవున్ కు 4 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ టెంపుల్ ఖజురాహో శిల్పశైలిలో నిర్మించారు. దీనిలో 38 రాతి మూర్తులు వివిధ హిందూ దేవుళ్ళు మరియు దేవతలవి వుంటాయి. ఇతిహాసం మేరకు ఈ టెంపుల్ ను పాండవులలోని నకుల మరియు సహదేవులు నిర్మించినట్లు చెపుతారు.

చిత్ర కృప: Bhandarinitin

ధ్వజ్ టెంపుల్

ధ్వజ్ టెంపుల్

ధ్వజ్ టెంపుల్ పితోర్ ఘర్ కు సమీపంలో కలదు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తున కలదు. మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులను అనేక సుందర దృశ్యాలను ఇక్కడనుండి చూడవచ్చు. ఈ టెంపుల్ లో భగవానుడు శివుడు, అమ్మవారు జయంతి విగ్రహాలుంటాయి.

చిత్ర కృప : Lalitgupta isgec

జౌళ్ జిబి

జౌళ్ జిబి

పితోర్ ఘర్ పట్టణానికి 80 కి.మీ.ల దూరం లో కల జౌళ్ జిబి ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈప్రదేశంలో రెండు నదులు కలుస్తాయి. అవి గోరి మరియు కాళి నదులు. ఇక్కడ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి గొప్ప ఉత్సవం జరుపు తారు. జౌళ్ జిబి నుండి 10 కి.మీ.ల దూరంలో కాలాపానీ హిల్, వ్యాస్ గుహ టూరిస్ట్ ప్రదేశాలు కలవు.

చిత్ర కృప : pithoragarh.nic.in

కోట్ గారి దేవి టెంపుల్

కోట్ గారి దేవి టెంపుల్

కోట్ గారి దేవి టెంపుల్ తాల్ కు 9 కి.మీ.ల దూరంలో కలదు. అన్యాయం జరిగిన భక్తులు ఇక్కడకు వస్తారు, తమ న్యాయమైన కోరికలను తీర్చమని భగవంతుడిని కోరతారు.

చిత్ర కృప : telugu native planet

మున్ష్యారి

మున్ష్యారి

మున్ష్యారి ఒక చిన్న పట్టణం. ఇది పితోర్ ఘర్ కు 127 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టవున్ సమీపం లో మిల్లం, నామిక్, రాళం మంచు పర్వతాలు కలవు. ఈ పట్టణం చుట్టూ మహేశ్వర్ కుండ్ , తమరి కుండ్ చెరువులు కలవు. మున్ష్యరి భుగ్యాల్ అనే ఒక పూల మైదానం పట్టణం చుట్టూ వుంటుంది.

చిత్ర కృప: telugu native planet

స్కీయింగ్

స్కీయింగ్

పితోర్ ఘర్ పర్యాటకులు సాధారణంగా స్కీయింగ్ అంటే మక్కువ చూపుతారు. ఇక్కడ కల బెతులి దార్ వాలు ప్రదేశం స్కీయింగ్ కు అనుకూలం. సముద్ర మట్టానికి 3090 మీటర్ల ఎత్తునకల చిప్లా కోట్ లో కూడా స్కీయింగ్ చేయవచ్చు. ఇంతేకాక, ఖాలియా టాప్, అందమైన ఆల్పైన్ మైదానాలు కూడా స్కీయింగ్ కు అనుకూలమే.

చిత్ర కృప : L. Shyamal

పితోర్ గర్ లో ఏం కొనాలి?

పితోర్ గర్ లో ఏం కొనాలి?

పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి. ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు. స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి.

చిత్ర కృప : Balbir Dasila

పితోర్ గర్ లో ఏం చేయాలి?

పితోర్ గర్ లో ఏం చేయాలి?

సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను తీర్థయాత్రలపై ఆసక్తిగల వారు ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు.

చిత్ర కృప : Lalitgupta isgec

పితోర్ గర్ ఎలా చేరుకోవాలి?

పితోర్ గర్ ఎలా చేరుకోవాలి?

ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Shyamal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X