Search
  • Follow NativePlanet
Share
» »రుద్రనాథ్ - ఒక పవిత్ర యాత్ర !

రుద్రనాథ్ - ఒక పవిత్ర యాత్ర !

By Mohammad

రుద్రనాథ్ పవిత్ర కేదార్నాథ్ యాత్రలో భాగంగా దర్శించే ఆలయాలలో మూడవది. ఈ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో సందూరమట్టానికి 2286 మీటర్ల ఎత్తులో కలదు. ఇక్కడి నుండి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత శ్రేణులను చూడవచ్చు. రుద్రనాథ్ అంటే "కోపంగా ఉన్నవాడు" అని అర్థం. రుద్రనాథ్ లో హిందూ దేవుడైన శివుడికి పూజలు జరుపుతారు. ఈయన్ను ఇక్కడ 'నీలకంఠ మహాదేవ' అని పిలుస్తారు.

పురాణ గాధ

పాండవులు దుష్టులైన కౌరవులను యుద్ధంలో చంపి శివుడి దర్శనానికై రుద్రనాథ్ చేరుకుంటారు. అయితే, శివభగవానుడు వారిని కలవటానికి ఇష్టపడడు. పైగా శివుడు నంది రూపంలో మారి గర్వాల్ లో దాక్కుంటాడు. విషయం తెలుసుకున్న పాండవులు నందిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమవుతారు. వెంటనే శివుడు శరీరం 5 ప్రదేశాలలో కనపడుతుంది. ఆ ప్రదేశాలే ప్రస్తుతం పంచ కేదార్నాథ్ యాత్రలో భాగంగా దర్శించే ఆలయాలు.

ఇది కూడా చదవండి : ఛోప్త - ఒక 'మినీ స్విజర్లాండ్' !

ఇది కూడా చదవండి : రుద్రప్రయాగ - పవిత్ర పుణ్య క్షేత్రం !

రుద్రనాథ్ ఆలయం

రుద్రనాథ్ ఆలయం

శివుడి ముఖం పడిన ప్రదేశంలో రుద్రనాథ్ ఆలయం వెలసింది. దీనిని పాండవులు నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ శివభగవానుడు పూజలు అందుకుంటాడు . టూరిస్ట్ లు ఈ ఆలయాన్ని సాగర్ గ్రామం లేదా జోషిమట్ నుండి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Akshay Bharadwaj

నందికుండ్

నందికుండ్

నందికుండ్ చుట్టూ దట్టమైన మంచు శిఖరాలతో, ఆకుపచ్చని మైదానాలతో రమణీయంగా కనిపిస్తుంది. శివుడి వాహనం నంది ఈ సరస్సులోని నీటిని తాగేది. పవిత్ర కొలనులైన సూర్యకుండ్, చంద్రకుండ్, తర కుండ్, మన కుండ్ లు రుద్రనాథ్ ఆలయానికి సమీపంలో కలవు.

చిత్ర కృప : Nitin Pant

పనార్ బుగియాల్

పనార్ బుగియాల్

పనార్ బుగియాల్ రుద్రనాథ్ లో ఒక అందమైన అడవి పూవులు కల పచ్చిక మైదానం. రుద్రనాథ్ నుండి ఈప్రదేశం 8 కి.మీ.ల ట్రెక్కింగ్ లో చేరాలి. మార్గంలో పర్యాటకులు అనేక సుందర దృశ్యాలను చూడవచ్చు. సాగర్ గ్రామం నుండి కూడా మరొక ట్రెక్కింగ్ మార్గం కూడా కలదు. ఈ ప్రాంతానికి సమీపంలో ఒక గుడి కూడా కలదు.

చిత్ర కృప : Don't just "click" pictures; Shoot Stories!

పిత్రధర్

పిత్రధర్

పిత్రధర్ ఒక అందమైన లోయ. సముద్రమట్టానికి 4000 మీ. ఎత్తున కలదు. ఇక్కడ ట్రెక్కింగ్ కాస్త కష్టమే అయినా మార్గ మధ్యలో ఎన్నో కొలనులు, సరస్సులు, ఎత్తుపల్లాలు, పచ్చిక మైదానాలు అలసటను తీరుస్తాయి.

చిత్ర కృప : Himanshu Dutt

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

సందర్శకులు రుద్రనాథ్ సమీపంలో కల్పేశ్వర్ ఆలయం మరియు మధ్య మహేశ్వర్ ఆలయాన్ని దర్శించవచ్చు. రుద్రనాథ్ ప్రదేశం నుండి హాతీ పర్వత, నందా దేవి, నంద ఘంటి, త్రిశూల్ శిఖరాలను చూడవచ్చు.

చిత్ర కృప : Don't just "click" pictures; Shoot Stories!

రుద్రనాథ్ ఎలా చేరుకోవాలి ?

రుద్రనాథ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : డెహ్రాడూన్ లో గల జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రుద్రనాథ్ కు సమీప ఎయిర్ పోర్ట్

రైలు మార్గం : రుద్రనాథ్ కు రిషికేష్ సమీప రైల్వే స్టేషన్

రోడ్డు / బస్సు మార్గం : రిషికేష్, డెహ్రాడూన్, కోట్ ద్వార, హరిద్వార ల నుండి బస్సులు కలవు.

చిత్ర కృప : Bhavik Thaker

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X