Search
  • Follow NativePlanet
Share
» »సికార్ - చారిత్రక గాధల నగరం !

సికార్ - చారిత్రక గాధల నగరం !

By Mohammad

సికార్, రాజస్తాన్ రాష్ట్ర౦లోని ఈశాన్యభాగం లో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పింక్ సిటీ జైపూర్ తరువాత బాగా అభివృద్ది చెందిన 2 వ ప్రాంతం. షెఖావతి రాజులు పాలించిన ఠికానా సికార్ రాజ్యానికి రాజధాని అయిన ఈ నగరాన్ని చారిత్రికంగా 'బీర్ భాన్ కా బాస్' గా పిలిచేవారు.

సికార్ లో మరియు చుట్టుపక్కల సందర్శించవలసిన ప్రదేశాలు

రాజస్తాన్ లోని ప్రధాన పర్యాటక కేంద్రం సికార్ ప్రత్యేకంగా లక్ష్మణ్ ఘర్ కు పేరుగాంచింది. ఈ కోట లోని కుడ్య చిత్రాలు, షెఖావతి నిర్మాణ శైలి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నగరం సావంత్ రామ్ చోఖని హవేలీ, వంశీధర్ రతి హవేలీ, సంగనేరియ హవేలీ, మిరిజమల్ క్యాల హవేలీ, చార్ చౌక్ హవేలీ, కేడియా హవేలీ లకు కూడా ప్రసిద్ది చెందింది. సికార్ లో పర్యటించేటప్పుడు పర్యాటకులు ఈ క్రింద పేర్కొన్న ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి : మెహ్రాన్ ఘర్ కోట - ఒక రాయల్ టూర్ !

జీన్ మాతా

జీన్ మాతా

జీన్ మాతా ఒక గ్రామం పేరు. దానికి ఆ పేరు అక్కడి 8 చేతులు గల జీన్ మాతా విగ్రహం వలన వచ్చినట్లు తెలుస్తుంది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 24 అందమైన స్తంభాలకు వివిధ బొమ్మలు చెక్కబడి ఉంటాయి. నవరాత్రి రోజున భక్తులు అధికసంఖ్యలో మాత ను దర్శిస్తారు.

చిత్ర కృప : karankills

ఖతు శ్యామ్ జీ ఆలయం

ఖతు శ్యామ్ జీ ఆలయం

ఖతు శ్యామ్ జీ ఆలయం సికార్ కు 90 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది శ్రీకృష్ణ భగవానుడికి చెందిన ఆలయం. గుడిలోని కొలనులో మునకవేయటం పవిత్రంగా భావిస్తారు. శ్యామ్ జీ తోట సుందర దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Niru786

గణేశ్వర్

గణేశ్వర్

గణేశ్వర్ గ్రామం వేడి గంధకం బుగ్గలకు ప్రసిద్ధి చెందినది. ఈ బుగ్గలో మునక వేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. 4000 సంవత్సరాల క్రితం నాటి పురాతన శిధిలాలను, బలేశ్వర్ లోని పాత శివాలయం చూడదగ్గవి.

చిత్ర కృప : rajiv kohli

రాంగర్

రాంగర్

రాంగర్ సికార్ పట్టణానికి 54 కి. మీ ల దూరంలో కలదు. ఈ ప్రదేశం హవేలీ లకు, ఆలయాలకు, హస్తకళలకు ప్రసిద్ధి చెందినది. పదుల శాఖలో హవేలీ లు, ఆలయాలను చూడవచ్చు. సంప్రదాయ ఆహారాలను రుచిచూడవచ్చు.

చిత్ర కృప : universal hotelsJaipur

మాధో నివాస్ కోఠి

మాధో నివాస్ కోఠి

మాధో నివాస్ కోఠి ని రాజస్థాన్ రాజు మాధవ్ సింగ్ ఎంతో ఇష్టంగా నిర్మించాడు. ఈ భవనం గోడలపై బంగారు చిత్రాలను గమనించవచ్చు.

చిత్ర కృప : Saumil Shah

హరస్నాథ్

హరస్నాథ్

హర్ష అని కూడా పిలువబడే హరస్నాథ్ పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. క్రీ. శ. 10 వ శతాబ్దంలో నిర్మించిన హరస్నాథ్ ఆలయం తో పాటుగా మరో రెండు శివాలయాలను చూడవచ్చు. క్రీ. శ. 9 వ శతాబ్దం నాటి శాశనాలు కూడా ఇక్కడ కలవు.

చిత్ర కృప : Ashish Choudhary

సికార్ ఎలా చేరుకోవాలి ?

సికార్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు/ బస్సు మార్గం : ఢిల్లీ, షెఖావతి, జైపూర్, బికనీర్, జోధ్ పూర్ తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు సికార్ మీదుగా తిరుగుతుంటాయి.

రైలు మార్గం : సికార్ లో రైల్వే స్టేషన్ కలదు. జైపూర్, ఢిల్లీ, బికనీర్, చురు వంటి ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

విమాన మార్గం : 128 కి. మీ ల దూరంలో ఉన్న జైపూర్ విమానాశ్రయం సికార్ సమీపంలో కలదు.

చిత్ర కృప : Vikas Jangid

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X