Search
  • Follow NativePlanet
Share
» »సిర్పూర్ పురావస్తు కట్టడాల వారసత్వ నగరం !

సిర్పూర్ పురావస్తు కట్టడాల వారసత్వ నగరం !

By Mohammad

సిర్పూర్ పురాతన నగరం. పురాతన నగరం అంటే ఏదో క్రీస్తుపూర్వం నగరం అనుకొనేరు ఇది క్రీస్తు శకం లో స్థాపించబడింది. ఇది క్రీ.శ. 5 వ శతాబ్ధంలో వెలుగులోకి వచ్చింది ఆతరువాత సుమారు 500 సంవత్సరాల పాటు బౌద్ధ యాత్రికులకు కేంద్రంగా ఉన్నది. క్రీ.శ. 12 వ శతాబ్ధంలో వచ్చిన పెనుభూకంపం వలన నగరం అంతా చిన్నాభిన్నమైనప్పటికీ, శిధిలాలు మాత్రం నాటి కళావైభవానికి గుర్తులుగా నిలిచాయి.

సిర్పూర్ ఛత్తీస్ గర్హ్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. దీనిని 'సంపదల నగరం' అని కూడా పిలుస్తారు. సిర్పూర్ పురావస్తు కట్టడాల వారసత్వ నగరం గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న పురావస్తు కట్టడాలు సంప్రదాయ మరియు సాంస్కృతిక వారసత్వానికి ఆనవాళ్ళు గా నిలిచాయి. ఈ నగరం చత్తీస్ గర్హ్ రాజధాని రాయ్ పూర్ కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో, బిలాస్ పూర్ కి 111 కిలోమీటర్ల దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : సుర్గుజా - పురాతన ప్రదేశంలో అన్వేషణ !

సిర్పూర్ - సందర్శనీయ స్థలాలు

సిర్పూర్ లో ఇంతకు ముందే చెప్పినట్లు అనేక స్మారక కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. భారతదేశ అత్యుత్తమ దేవాలయ నిర్మాణాలలో ఒకటైన లక్ష్మణ దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. బుద్ధ విహార్, రామ్ ఆలయం, వన్య ప్రాణుల అభయారణ్యం, గందేశ్వర్ ఆలయం మొదలుగునవి ఇక్కడి మరికొన్ని ఆకర్షణలు.

సిర్పూర్ ఎలా చేరుకోవాలి ?

సిర్పూర్ ఎలా చేరుకోవాలి ?

సిర్పూర్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అదుబాటులో ఉన్నాయి

విమాన మార్గం

సిర్పూర్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. 74 కిలోమీటర్ల దూరంలో రాయ్ పూర్ విమానాశ్రయం కలదు. విమానాలు ఢిల్లీ, భోపాల్, కలకత్తా, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుండి ఈ విమానాశ్రయానికి అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

సిర్పూర్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ సమీపాన ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ పూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ముంబై - హౌరా ప్రధాన రైల్వే మార్గంలో కలదు.

రోడ్డు మార్గం

సిర్పూర్ చేరుకోవటానికి చత్తీస్ గర్హ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు రాయ్ పూర్ నుండి నిత్యం అందుబాటులో ఉంటాయి. అలాగే మహాసముంద్ మరియు సమీప పట్టణాల నుండి, నగరాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : sandeep baraskar

లక్ష్మణ్ ఆలయం

లక్ష్మణ్ ఆలయం

లక్ష్మణ్ ఆలయం రాయ్ పూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం భారతదేశంలో నిర్మించిన మొదటి ఇటుక దేవాలయాలలో ఒకటి. ఆలయం యొక్క జటిలమైన చెక్కడాలు, రాతి శిల్ప సంపద యొక్క వర్ణన మాటల్లో చెప్పలేము.

చిత్ర కృప : jit0ray

లక్ష్మణ్ ఆలయం

లక్ష్మణ్ ఆలయం

లక్ష్మణ్ ఆలయం లో గర్భాలయం, అంతరాలయం, మాడపం అనే మూడు భాగాలు కలవు. ఆలయంలో వాతాయన్, చిట్యా గవాక్ష, భార్వాహక్గన, అజ, కిర్తిమ్ఖ్ మరియు కామ అమలాక్ వంటి మత సంబంధమైన వర్ణనలను అందంగా లోపల స్తంభాల మీద చెక్కారు.

చిత్ర కృప : Ishita Srivastava

రామ్ ఆలయం

రామ్ ఆలయం

లక్ష్మణ్ ఆలయానికి సమీపంలో ఉన్న రామ్ ఆలయం శిధిలావస్థ లో ఉన్నది. ఆలయం ముక్కలైపోయినా నిర్మాణం మాత్రం సందర్శకులను ఆకట్టుకుంటున్నది.

చిత్ర కృప : MANOJ DEWANGAN

ఆనంద్ ప్రభు కుడి విహార్ / బుద్ధ విహార్

ఆనంద్ ప్రభు కుడి విహార్ / బుద్ధ విహార్

సిర్పూర్ పట్టణంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆనంద్ ప్రభు కుడి విహార్ ను బుద్ధ విహార్ అని కూడా పిలుస్తారు. ఈ నిర్మాణం పద్నాలుగు గదులు మరియు ఒక ప్రధాన ద్వారం కలిగి ఉంటుంది. భవనం లోపల అందమైన చెక్కడాలు,అనేక రాతి స్తంభాలు మరియు 6 అడుగుల పొడవైన బుద్ధ విగ్రహం ఉంది.

చిత్ర కృప : MANOJ DEWANGAN

తుర్తురియా

తుర్తురియా

సిర్పూర్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న అడవి గ్రామం తుర్తురియా. ఈ గ్రామం బౌద్ధ శిధిలాలకు ప్రసిద్ధి చెందినది. శిధిలాలలో చెక్కిన స్తంభాలు, బుద్ధిస్ట్ స్థూపాలు, సాయుధ విష్ణు విగ్రహాలు, గణేశ్ విగ్రహాలు అనేకం ఉన్నాయి.

చిత్ర కృప : Birendra Kumar Sinha

గందేశ్వర్ ఆలయం

గందేశ్వర్ ఆలయం

గందేశ్వర్ ఆలయం సిర్పూర్ లో చూడవలసిన మరొక సందర్శనీయ స్థలం. ఆలయం లోపల నేల ను తాకిన ఒక బుద్ధ విగ్రహం, నటరాజ విగ్రహం, గరుడ్ - నారాయణ్, శివలీల చిత్రాలు, మహిసాసుర మర్ధిని వంటివి ఉన్నాయి.

చిత్ర కృప : jit0ray

బర్నవపర వన్య ప్రాణుల అభయారణ్యం

బర్నవపర వన్య ప్రాణుల అభయారణ్యం

ప్రకృతి మీద , జంతువుల మీద ఆసక్తి ఉన్న వారు బర్నపవర వన్య ప్రాణుల అభయారణ్యం తప్పక చూడాలి. 245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ అభయారణ్యంలో దట్టంగా పెరిగిన చెట్లు, వన్య జంతువులు, పక్షులు చూడవచ్చు.

చిత్ర కృప : sheetal saini

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X