Search
  • Follow NativePlanet
Share
» »సోలన్ - భారతదేశపు పుట్టగొడుగుల నగరం !

సోలన్ - భారతదేశపు పుట్టగొడుగుల నగరం !

By Mohammad

సోలన్ ... 'భారతదేశపు పుట్టగొడుగుల నగరం' అని పేరు. ఇక్కడున్న విస్తృత పుట్టగొడుగుల వ్యవసాయం కారణంగా ఇది అలా పిలువబడుతుంది. సముద్ర మట్టానికి సరాసరి 1500 మీటర్ల ఎత్తున కొండ మీద ఉన్న సొలాన్ చుట్టూ దట్టమైన అడవులతో, ఎత్తైన కొండలతో చుట్టబడి ఉన్నది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోలన్ ఒక జిల్లా మరియు ముఖ్య పట్టణం. ఇక్కడి ప్రధాన దైవం అయిన సోలోని దేవి పేరుమీద ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చిందని అంటుంటారు స్థానికులు. కందాఘాట్, కాసోవ్లీ, చైల్ మరియు దగషై వంటి ప్రసిద్ధ పర్వత యాత్రలు చేసేవారికి సోలన్ బేస్ క్యాంప్ గా వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతంలో కెల్లా ఎత్తైన శిఖరం కరోల్. దానిపై గుహ కూడా కలదు.

ఇది కూడా చదవండి : నరకంద - హరిత వనాల అద్భుతం !

సోలన్ లో సందర్శించవలసిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

సోలోని దేవి ఆలయం

సోలోని దేవి ఆలయం పరిసరాలు అందంగా ఉండి, ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి అందుచేత యాత్రికులు అధికంగా ఆకర్షించబడతారు. ప్రతి ఏటా ఉత్సవాలు, జాతరలు, పండుగలు వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తుల సందడి మరింత అధికంగా ఉంటుంది. జాతరలో 'కుస్తీ పోటీ' ప్రధాన అట్రాక్షన్.

సోలోని దేవి ఆలయం

సోలోని దేవి ఆలయం

చిత్ర కృప : TARSEM SAJPAL

దోలంజి బాన్ మొనాస్టరీ

దోలంజి బాన్ మొనాస్టరీ బౌద్ధ సాధువుల మఠం. ఈ మఠం నరగ్ - నరహన్ రోడ్డు మీద, బరోగ్ నుండి కేవలం 5 కి. మీ ల దూరంలో ఉంటుంది. దీనినే యుంగ్ద్రుంగ్ మొనాస్టరీ అని కూడా పిలుస్తారు. బాన్ అనే తెగ బుద్దిస్ట్ కన్నా పురాతనమైనది. ప్రపంచంలో ఇది అత్యంత పురాతమైన మొనాస్టరీ గా ప్రసిద్ధికెక్కింది.

బాన్ మొనాస్టరీ

బాన్ మొనాస్టరీ

చిత్ర కృప : Garconlevis

మజతాల్ అభయారణ్యం

ముజతాల్ అభయారణ్యం వన్య ప్రాణుల కేంద్రం. సోలన్ లో ఉన్న ప్రధాన ఆకర్షణలలో ఇది కూడా ఒకటి. వివిధ జాతుల వృక్ష జంతు జాలాలు మరియు పక్షి సంపద ఈ సాన్చూరి లో ఉన్నాయి. పర్యాటకులు నెమళ్ళు, చిరుతలు, హిమాలయ ఎలుగుబంటి, జింక, ఏనుగు, లంగూర్ వంటి జంతువులను రాబందులను, నల్ల ఫ్రంకోలిన్ లను చూడవచ్చు.

మజతాల్ అభయారణ్యం

మజతాల్ అభయారణ్యం

చిత్ర కృప : Abhishek Varma

మోహన్ శక్తి హెరిటేజ్ పార్క్

మోహన్ శక్తి హెరిటేజ్ పార్క్ పర్యాటకులను కనువిందు చేసే పార్కులలో ముందుంటుంది. కాళీ కా టిబ్బా మందిరాన్ని పార్క్ లోపల గమనించవచ్చు. ఇదొక్కటే కాదు ఎన్నో ఆలయాలను, శిధిలావస్థ లో ఉన్న దేవతామూర్తుల ప్రతిమలను కనుగొనవచ్చు. పక్షి ప్రియులకు ఈ ప్రాంతం స్వర్గాన్ని తలపించక మానదు.

సోలన్ పట్టణానికి గల మరో పేరు 'ది సిటీ అఫ్ రెడ్ గోల్డ్ '. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ టమాటా పండ్లు ఎక్కవగా పండిస్తారు కాబట్టి. కునిహర్ వాలీ, అమరావతి కొండలు, జవహర్ పార్క్, ప్లాటినం మాల్, కిరియాఘాట్, కుతార్ కోట మొదలైనవి సోలన్ లో సందర్శించ దగ్గ మరికొన్ని ప్రదేశాలు.

కునిహర్ వాలీ, సోలన్

కునిహర్ వాలీ, సోలన్

చిత్ర కృప : Bhanu Sharma Solan

సోలన్ ను ఎప్పుడు సందర్శించాలి ?

సోలన్ యొక్క వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రికులు ఎప్పుడైనా ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది మరియు మాన్సూన్ ముందు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

కల్క - సిమ్లా టాయ్ ట్రైన్

పర్వత ప్రాంతాల్లో టాయ్ ట్రైన్ సందర్శన ఒక గొప్ప అనుభూతి గా ఉంటుంది. ఇక్కడ కూడా టాయ్ ట్రైన్ సౌకర్యం కలదు. కల్క నుండి సిమ్లా వరకు వయా సోలన్ మీదుగా ఈ ట్రైన్ వెళుతుంది. ఈ మౌంటెన్ రైల్వే ను హెరిటేజ్ సైట్ గా గుర్తించారు.

సోలన్ ఎలా చేరుకోవాలి ?

విమానమార్గం

సోలన్ కు సమీపాన చండీఘర్ విమానాశ్రయం (67 కి. మీ) కలదు. ఢిల్లీ, ముంబై, జైపూర్, కోల్కతా వంటి నగరాల నుండి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సోలన్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

సోలన్ కు సమీపాన 44 కి. మీ ల దూరంలో కల్క రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి ప్రతి రోజు ఒక టాయ్ ట్రైన్ సిమ్లా కు బయలుదేరుతుంది. అది ఎక్కి సోలన్ చేరుకోవచ్చు. ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడింది.

రోడ్డు / బస్సు మార్గం

ఢిల్లీ, సిమ్లా, కల్క , చండీఘర్ తదితర సమీప పట్టణాల నుండి సోలన్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

కల్క టు సిమ్లా వయా సోలన్

కల్క టు సిమ్లా వయా సోలన్

చిత్ర కృప : sanoop

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X