Search
  • Follow NativePlanet
Share
» »తెనాలి : 'ఆంధ్రా పారిస్' నగరం !

తెనాలి : 'ఆంధ్రా పారిస్' నగరం !

By Mohammad

తెనాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన నగరం. తెనాలి ఎందరో కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. విజయనగర సామ్రాజ్యం లో అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలిరామకృష్ణుడు ఈ ప్రాంతం వాడే. ఈయనకు వికటకవి అనే బిరుదు కలదు. కానీ తెలుగు వారికి ఎక్కువగా హాస్యకవిగానే పరిచయం.

గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో, అమరావతి నుండి 60 కిలోమీటర్ల దూరంలో తెనాలి కలదు. అన్నట్టు మీకోవిషయం తెలుసా ? అచ్చం పారిస్ నగరం లో ఉన్నట్లు మెయిన్ రోడ్డు కు ఇరువైపులా రెండు పెద్ద కాలువలు ఉండటం చేత, తెనాలిని 'ఆంధ్రా పారిస్' అని అంటారు.

ఇది కూడా చదవండి : గుంటూరు - సందర్శించే ప్రదేశాలు !

తెనాలిలో ఎక్కడ చూసినా ఆలయాలు దర్శనం ఇస్తాయి. సంస్కృతి - సంప్రదాయానికి ఇక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తారు. శ్రీరామ నవమి పర్వదినాన చూడాలే గానీ ... కిలోమీటరు వరకు పందిరి వేసి ఘనంగా కన్నుల పండుగగా జరుపుతారు. భద్రాచలం తర్వాత శ్రీరామనవమి అంత ఘనంగా జరిగేది ఇక్కడే !!

ఇది కూడా చదవండి : తెనాలి కి 30 km ల దూరంలో హాయ్ లాండ్ !

వైకుంఠపురం

వైకుంఠపురం

వైకుంఠ పురానికి గల మరో పేరు చిన్న తిరుపతి. దశాబ్దకాలంగా నెలకొని ఉన్న పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. తిరుపతి వెళ్లలేని వారు ఇక్కడే తమ మొక్కులను తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామ రైతులు తమ మొదటి పంట(వరి) ను తెచ్చి, పరమాన్నం లేదా పాయసం వండి దేవుడికి నివేదన చేస్తారు. కేశఖండన తిరుపతి లాగా సర్వసామాన్యం. కొత్త పేట లోని విశ్వకర్మ దేవాలయం, గాంధీ చౌక్ వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం చూడదగ్గవి.

చిత్ర కృప : Phanindra.G

దొంగ రాముని గుడి

దొంగ రాముని గుడి

దొంగ రాముడి గుడి ని ఒక్కరాత్రి లోనే దొంగతనం గా కట్టినారట. అందుకే ఆ పేరు. శ్రీ రామనవమి నాడు చిట్టి ఆంజనేయస్వామి గుడి నుండి ఈ గుడి వరకు (కిలోమీటర్ వరకు) పందిరి వేస్తారు. ఇది మునిసిపల్ ఆఫీసు వద్ద కలదు.

చిత్ర కృప : KATTAMURI VENKATA SUBRAHMANYAM

కన్యకా పరమేశ్వరి మందిరం

కన్యకా పరమేశ్వరి మందిరం

అమ్మవారి పేరుతో ప్రసిధ్ధమైన శివాలయం ఇది. రాజ రాజేశ్వరి అమ్మవారు కూడా వేంచేసి వున్నారు. పట్టణ వైశ్య సముదాయముచే నడపబడే ఈ దేవస్థానములో దసరా ఉత్సవము కనుల పండుగగా, పట్టణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది.

చిత్ర కృప : sanctuaryhome

శ్రీ పర్వతవర్ధనీసమేత రామేశ్వర స్వామి ఆలయం

శ్రీ పర్వతవర్ధనీసమేత రామేశ్వర స్వామి ఆలయం

స్థానిక గంగానమ్మపేటలోని ఈ ఆలయం, అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. త్రేతాయుగంలో పరశురామునిచే క్షత్రియ సంహారం అనంతరం, పాపపరిహారార్ధమై ప్రతిష్ఠించిన శివాలయాలలో ఈ క్షేత్రం గూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ దివ్య మందిరంలో శ్రీ పర్వతవర్ధనీ సమేత రామేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు.

చిత్ర కృప : KATTAMURI VENKATA SUBRAHMANYAM Follow

శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం

శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం

తెనాలి పట్టణ నడిబొడ్డున షరాఫ్ బజారులోని ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. దక్షిణ భారతదేశంలో నాలుగు ధ్వజస్థంభాలు గల ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో, హనుమజ్జయంతి సందర్భంగా, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.

చిత్ర కృప : రామ ShastriX

ఇతర ఆలయాలు

ఇతర ఆలయాలు

శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం, అమ్మవారి దేవాలయం, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, జైన మందిరం, వేణుగోపాల స్వామి గుడి, గంగానమ్మ గుడి, అప్పల స్వామి మందిరం, పేరంటాలమ్మ గుడి, శ్రీ బసవమందిరం, విశ్వకర్మ దేవాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలు ఇతర ఆలయాలుగా ఉన్నాయి.

చిత్ర కృప : John Klewer

శాశనాలు

శాశనాలు

కృష్ణదేవరాయలు విజయ యాత్రలో భాగంగా తెనాలిని సందర్శించినట్లు అక్కడి శాశనాలలో తెలుపబడింది. తెనాలిలో సంవత్సరం పొడవునా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

చిత్ర కృప : Vin09

తెనాలి ఎలా చేరుకొవాలి ?

తెనాలి ఎలా చేరుకొవాలి ?

వాయు మార్గం : తెనాలి కి సమీపాన విజయవాడ లోని (40km) గన్నవరం విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లో ఎక్కి చేరుకోవచ్చు.

రైలు మార్గం : తెనాలి లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, విజయవాడ, గుంటూరు లను కలిపే ప్రధాన స్టేషన్ ఇది.

రోడ్డు మార్గం : గుంటూరు, విజయవాడ, అమరావతి తదితర ముఖ్య పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు తెనాలి కి నడుపబడుతున్నవి.

చిత్ర కృప : Vin09

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X