Search
  • Follow NativePlanet
Share
» »భీమిలి ... పర్యాటక మజిలీ !

భీమిలి ... పర్యాటక మజిలీ !

By Mohammad

భీమినిపట్నం ... విశాఖ జిల్లాలో పర్యాటకులను అలరించే ఒక అందమైన మజిలీ. బంగాళాఖాతం సముద్రానికి అనుకోని ఉన్న ఈ ప్రదేశాన్ని భీమిలి అని పిలుస్తారు స్థానికులు. వైజాగ్ నగరానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, వైజాగ్ ను చూడటానికి వచ్చే పర్యాటకులు తరచూ భీమిలి ని సందర్శిస్తూ ఉంటారు.

భీమునిపట్నం సముద్ర తీరం వద్ద ప్రకృతి దృశ్యాలు రమణీయం. ఈ పట్టణంలోని లాటరైట్ శిలలపై బౌద్ధ క్షేత్రం పావురాళ్ళకొండ కలదు. కొండ కింద నరసింహస్వామి దేవాలయం ఇక్కడ మరో ఆకర్షణ. బీచ్ లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈత కొట్టడం క్షేమమే ! ఇక్కడి పర్యాటక స్థలాలు ఒకేసారి గమనిస్తే ...

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లోని 5 బెస్ట్ బీచ్ లు !

పావురాళ్ళకొండ

పావురాళ్ళకొండ

పావురాళ్ళకొండ ను పావురాళ్లబోడు అని కూడా పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం ఇది. ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిధిలాలు ఉన్నాయి. ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి క్రీ.శ రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి.

చిత్ర కృప : Adityamadhav83

భీమిలి నరసింహ స్వామి ఆలయం

భీమిలి నరసింహ స్వామి ఆలయం

పావురాళ్ళబోడు వద్ద నరసింహస్వామి కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కలదు. నారాయణుని దశావతారాలలో నర, మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతోపాటు, భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం గూడా ఇక్కడే ఉన్నది.

చిత్ర కృప : dityamadhav83

డచ్ కోట

డచ్ కోట

16-18 శతాబ్ధాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన భాగంగా భీమిలిలో డచ్ వారు దిగారు. ఆ తరువాత వర్తకం చేసుకోవడానికి 1661లో 4 కొమంలతో ఒక కోట నిర్మించుకొన్నారు. ఈ కోటలో గడియార స్థంబం, టంకశాల ఉన్నాయి. పట్టణ మధ్యలో ఉన్న ఈ గడియార స్థంబాన్ని ప్రతి పర్యాటకుడు దర్శించి తీరాలి.

చిత్ర కృప : Adityamadhav83

భీమిలి సాగరతీరం

భీమిలి సాగరతీరం

భీమునిపట్నం బీచ్ ని సింపుల్ గా భీమిలి అని కూడా అంటారు. ఇక్కడ కల స్వచ్చమైన నీరు స్విమ్మర్స్ కు ఈ బీచ్ ని ఒక స్వర్గంగా చేసింది. ప్రత్యేకించి వేసవి నెలల లో అధిక సంఖ్యలో జనాలు ఇక్కడకు వస్తారు. లోతు ఎక్కువగా ఉండదు కనుక ఈత కొట్టడానికి అనువైనది.

చిత్ర కృప : Adityamadhav83

చర్చి

చర్చి

బీచ్ వద్ద పురాతన చర్చి ఒకటి కలదు. ఈ చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు కిటికి మీద ఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చాల విశేషంగా ఉంటుంది. ఈ చర్చిలో ఎంతో కాలం ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నేత్రానందాన్ని అందిస్తాయి.

అతిథిగృహం

అతిథిగృహం

భీమిలి తీరం వద్ద ఉన్న అతిధి గృహం చిట్టివలస జూట్ కర్మాగారం ఆధీనంలో ఉన్నది. పూర్వం ఈ అతిథి గృహంలో ఇంపీరియల్ బ్యాంకు ఉండేది. ఆ తరువాత ఈ గృహాన్ని చిట్టివలస ఝూట్ మిల్లు వారు దత్తత తీసుకొని ఈ గృహం చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఈ పట్టణ వైభవాన్ని చెప్పడానికి ఈ అతిథి గృహం ఒక తార్కాణం. భీమిలి దర్శించడానికి వచ్చిన ప్రతి సందర్శకుడు ఈ అతిధి గృహాని చూసి తీరవలసిందే.

భీమిలి దీపస్తంభం

భీమిలి దీపస్తంభం

కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మించబడిన ఎనిమిది దీప స్తంభాలలొ (లైటు హౌసు) ఇది ఒకటి. ఈ దీప స్తంభం 18 వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది.

చిత్ర కృప : Raj

చోళేశ్వరాలయం

చోళేశ్వరాలయం

పట్టణ ముఖ్య రహదారిపై ఉన్న దేవాలయ సముదాయంలో ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకం లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి అనుబంధంగా చోళేశ్వరాలయం చోళులచే నిర్మించబడింది.

చిత్ర కృప : Adityamadhav83

భీమిలి ఎలా చేరుకోవాలి ?

భీమిలి ఎలా చేరుకోవాలి ?

భీమిలి కి 24 km ల దూరంలో ఉన్న వైజాగ్ లో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి తీరం వెంబడి బస్సులలో లేదా ప్రవేట్ వాహనాలలో ప్రయాణించి భీమిలి చేరుకోవచ్చు. వైజాగ్ నుండి తరచూ సిటీ బస్సులు 999, 900T, 900K తిరుగుతుంటాయి.

చిత్ర కృప : lpiepiora

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X