Search
  • Follow NativePlanet
Share
» »ధర్మస్థల ... ఎప్పటికీ మరిచిపోలేం !

ధర్మస్థల ... ఎప్పటికీ మరిచిపోలేం !

By Super Admin

మక్కా గురించి మీకు తెలియని నిజాలు !మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

ఎలాగో కర్ణాటక వాసులకు ఈ క్షేత్రం అలాగన్నమాట ! దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో కలదు. మంజునాథ స్వామి ఆలయంలో వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే పూజారులు అర్చన చేయటం ఇక్కడి ప్రత్యేకత.

ఉత్తమమైన తీరులో ఉడిపి పర్యటన !ఉత్తమమైన తీరులో ఉడిపి పర్యటన !

మంజునాథుడు అంటే శ్రీ శివ భగవానుడే ! ఈయనకు గల పేర్లలో ఇది ఒకటి. మంజునాథ, రుద్రుడు, త్రినేత్రుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. ఎలా పిలిచినా, తలచినా కరుణించే దైవం ఆ శివభగవానుడే! ధర్మస్థల దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం గురించి, అక్కడి సౌకర్యాల గురించి మరియు సందర్శించవలసిన స్థలాల గురించి కొన్ని మాటల్లో ...

పూజలు

పూజలు

ధర్మస్థల ప్రదేశం మత సహనానికి ప్రతీక. ఈ దేవాలయాన్ని జైనులు నడుపుతారు. వారి ఆధ్వర్యంలోనే హిందూ పూజారులు దేవునికి అర్చన, పూజలు చేస్తారు.

చిత్రకృప : Dinesh Kumar (DK)

దైవ సన్నిధులు

దైవ సన్నిధులు

శ్రీమంజునాథ దేవాలయంలో శివుడు, మంజునాథుడు, అమ్మనవరు, చంద్రనాథ మరియు కళారులు అనే దైవ ధర్మాలు (ధర్మ రక్షణ దైవాలు), కుమారస్వామి, కన్యాకుమారి మొదలైన దైవ సన్నిధులు ఉన్నాయి.

చిత్రకృప : Prashant Dobhal

ఉత్సవం

ఉత్సవం

నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య నిర్వహించే లక్షదీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. ఆ రోజున లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.

చిత్రకృప : Sri Dharmasthala Manjunatha

విశేష పూజలు

విశేష పూజలు

సుమారు 600 ఏళ్ల క్రితం వెలసిన శ్రీ మంజునాథస్వామి ఆలయంలో వైదిక ధర్మాన్ని అనుసరించి స్వామి వారికి, అమ్మవారికి పూజారులు విశేష పూజలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Sathyanarayan S. Gubbi

తులాభారం

తులాభారం

భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటి పండు, నాణేలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామి వారికి మొక్కుబడి చెల్లించుకుంటారు.

చిత్రకృప : Vaijayanthi Chakravarthy

అన్నదానం

అన్నదానం

ఆలయంలో అధునాతన వంట గది ఉన్నది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు వంటలు తయారుచేసి ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. భోజనశాల పేరు " అన్నపూర్ణ".

చిత్రకృప : telugu native planet

వసతి

వసతి

ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ధర్మస్థల లో అన్ని హంగులతో కూడిన అతిధి గృహాలు, హోటళ్లు,లాడ్జీలు ఉన్నాయి. ఉత్సవాల సమయం తప్పనిచ్చి మిగితా అన్నిరోజులలో సాధారణ చార్జీలే తీసుకుంటారు. ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్నవారికి ఉచిత భోజనం, బస లభిస్తుంది.

చిత్రకృప : Sri Kshetra Dharmasthala Rural Development Project

టైం

టైం

ఆలయ సందర్శన వేళలు : ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 :30 వరకు దర్శించవచ్చు.

చిత్రకృప : Dinesh Kumar (DK)

బాహుబలి విగ్రహం

బాహుబలి విగ్రహం

ధర్మస్థల లో తప్పక చూడవలసినది 'బాహుబలి క్షేత్రం'. ఇది రత్నగిరి కొండ మీద ఉన్నది. 39 అడుగులున్న ఈ ఏకశిలా విగ్రహం 170 టన్నుల బరువు ఉంటుంది. యాత్రికులు ఉదయంపూట వెళితే బాగుంటుంది. సందర్శన సమయం : 8 am నుండి 10 am మరియు తిరిగి 6 pm నుండి 7 pm వరకు.

చిత్రకృప : Abdulla Al Muhairi

అన్నప్ప బెట్ట

అన్నప్ప బెట్ట

అన్నప్ప బెట్ట కు గల మరోపేరు 'బడినెడి బెట్ట'. ఇది ధర్మస్థలలో ఒక కొండ మరియు పైభాగాన ధర్మ దేవతల నాలుగు మందిరాలు ఉంటాయి. పిల్లలు, స్త్రీలను లోనికి అనుమతించరు.

చంద్రనాథ స్వామి ఆలయం

చంద్రనాథ స్వామి ఆలయం

చంద్రనాథ స్వామి ఆలయం జైన మందిరం. ఈ గుడిని సందర్శించే భక్తులు అందమైన శిల్పాలను చూడవచ్చు. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకొనేవారికి ఈ గుడి అనుకూలం. ఇందులో చంద్రనాథ స్వామి విగ్రహం ఉంటుంది. సందర్శన సమయం : 6 am - 2 pm మరియు 6:30 pm - 8:30 pm.

చిత్రకృప : Naveenbm

రామమందిరం

రామమందిరం

రామమందిరం నేత్రావతి నది ఒడ్డున కలదు. దీనిని 2003 లో నిత్యానంద స్వామి నిర్మించారు. శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుని పాలరాతి విగ్రహాలను భక్తులు చూడవచ్చు. సందర్శన సమయం : 6 am -2 pm మరియు 5 pm - 8 pm.

చిత్రకృప : Dinesh Kumar (DK)

మంజుషా మ్యూజియం

మంజుషా మ్యూజియం

మంజుషా మ్యూజియం ధర్మస్థల లో ఉన్న పురావస్తు మ్యూజియం. ఇది మంజునాథస్వామి ఆలయానికి దక్షిణాన ఉన్నది. మ్యూజియంలో కత్తులు, తాళపత్ర గ్రంథాలు, మైసూర్ పెయింటింగ్ లు మొదలైనవి ప్రదర్శిస్తుంటారు. ఇవేకాక దేవాలయానికి సంబంధించిన సమాచారాన్ని అందించే పురాతన పుస్తకాలు ఉంటాయి.

చిత్రకృప : Gowthami k

నేత్రావతి నది వంతెన

నేత్రావతి నది వంతెన

ధర్మస్థల కు 2 కి. మీ ల దూరంలో నేత్రావతి నది బ్యారేజ్ ను చూడవచ్చు. ఇక్కడే ఒక నేచర్ కేర్ ఆసుపత్రి ... అందులో పంచభూత చికిత్స ఉంది. ప్రకృతి దృశ్యాలను ఆనందించాలనుకొనేవారికి ఈ ప్రదేశం సూచించదగినది. సమయం ఉండే నెలియాలిబీడు ను సందర్శించండి.

చిత్రకృప : Bunny Rockzz Yashu

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : బెంగళూరు, మంగళూరు, మైసూరు మరియు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి ధర్మస్థల కు ప్రభుత్వ/ ప్రవేట్ ఓల్వో, లగ్జరి, డీలక్స్ తదితర బస్సులను నడుస్తుంటాయి.

రైలు మార్గం : మంగళూరు సమీప రైల్వే స్టేషన్. అక్కడి నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులలో లేదా టాక్సీ లలో దఃమస్థల చేరుకోవచ్చు.

విమాన మార్గం : సమీపాన 75 కి. మీ ల దూరంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ధర్మస్థల చేరుకోవచ్చు.

చిత్రకృప : Dushan7k

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X